Prabhas: రెబల్ స్టార్ కృష్ణంరాజు గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన నటించిన సినిమాల కన్నా ఆయన అందించే ఆతిధ్యం గురించే ఎక్కువ చెప్పుకోవాలి. రాజు గారి ఇంటికీ వెళ్లి భోజనం చేయకుండా తిరిగి వచ్చినవారు లేరు అంటే అతిశయోక్తి కాదు. మర్యాదతో చంపేయడంలో రాజు గారి కుటుంబం తరువాతే ఎవరైనా.. ఇక కృష్ణంరాజు.. మరణించాకా ఆ ఆనవాయితీని ఆ ఇంటి వారసుడు ప్రభాస్ రాజు కొనసాగిస్తున్నాడు. ఎవరైనా కొట్టి చంపుతారు.. ప్రభాస్ ఫుడ్ పెట్టి చంపేస్తాడు. ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా ఇదే మాట వినిపిస్తుంది. కృష్ణంరాజూ లెగసీని ప్రభాస్ కొనసాగిస్తున్నాడు.
ఇక కృష్ణంరాజు మరణించాక.. ఆయన కూతుళ్లను ప్రభాస్ నే చూసుకుంటున్నాడు. కృష్ణంరాజుకి ముగ్గురు కూతుళ్లు ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తి. ప్రస్తుతం పెద్ద అమ్మాయి ప్రసీద తమ నిర్మాణ సంస్థ బాధ్యతలను చూసుకుంటుంది.. మిగతా ఇద్దరు చదువుకుంటున్నారు. ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లకు అన్న ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ఇక వారంటే ప్రభాస్ కు ప్రాణం. పెద్దమ్మ శ్యామలా దేవి ఏది చెప్తే.. ప్రభాస్ దాన్ని కాదనడు.
తాజాగా ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. ఒక ఫంక్షన్ లో సందడి చేశారు. వారి బంధువుల ఇంట్లో జరిగిన ఒక ఫంక్షన్ లో కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి, ముగ్గురు ఆడపిల్లలు సందడి చేశారు. ఇక ఈ ఫోటోలను ప్రసీద తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ముగ్గురు చీరకట్టులో ఎంతో అద్భుతంగా కనిపించారు. ఇక ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోలు చూసిన అభిమానులు కృష్ణంరాజును గుర్తుచేసుకుంటున్నారు. ఈ ఫ్రేమ్ లో కృష్ణంరాజు కూడా ఉండి ఉంటే ఎంతో బావుండేది అని కామెంట్స్ పెడుతున్నారు.
Sriya Reddy: అల్ట్రా స్టైలిష్ లుక్ లో విశాల్ వదిన.. అబ్బా.. ఏమైనా ఉందా అసలు.. పిచ్చెక్కించింది అంతే
ఉప్పలపాటి కుటుంబం మాత్రమే కాదు.. టోటల్ ఇండస్ట్రీ మొత్తం ప్రభాస్ పెళ్లి కోసం ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ప్రభాస్ మారాడు. కుర్ర హీరోలు, హీరోయిన్లు కూడా పెళ్లి చేసుకుంటున్నారు.. కానీ, ప్రభాస్ మాత్రం పెళ్లి పీటలు ఎక్కింది లేదు. ఎప్పుడు ప్రభాస్ ను పెళ్లి గురించి అడిగినా చేసుకుంటా.. ? అనే సమాధానం తప్ప ఇంకో ఆన్సర్ లేదు. పెళ్లి గురించి పక్కన పెడితే.. ప్రతి హీరోయిన్ తో ప్రభాస్ పెళ్లి అంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
మొదట నుంచి అనుష్కతో ప్రభాస్ పెళ్లి అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. బిల్లా సమయం నుంచి వీరు ప్రేమలో ఉన్నారని, స్వీటీ కోసమే ప్రభాస్ ఇంకా పెళ్లి చేసుకోలేదని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక అనుష్క తరువాత కృతి సనన్ తో పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. ఆదిపురుష్ సినిమా సమయంలో వీరిద్దరి ప్రేమాయణం బయట పడింది. అయితే అది కూడా నిజం కాదని ఆ తరువాత కృతి క్లారిటీ ఇచ్చింది.
ఇక హీరోయిన్లు కాకుండా ఈమధ్యనే ప్రభాస్ పెళ్లి.. ఆంధ్రప్రదేశ్ లోని గణపవరానికి చెందిన అమ్మాయితో జరగబోతుందని బాలకృష్ణ అన్ స్టాపబుల్ లో చెప్పుకొచ్చాడు. కానీ, అది కూడా నిజంకాదని ప్రభాస్ క్లారిటీ ఇచ్చాడు. ఇలా ఉప్పలపాటి బంధువుల ఇంట్లో వేడుక జరిగినా ప్రభాస్ పెళ్లి గురించే చర్చ నడుస్తోంది. మరి ఈ ఏడాదిలోనైనా డార్లింగ్ పెళ్లి పీటలు ఎక్కుతాడో లేదో చూడాలి.