HBD Balakrishna: నందమూరి బాలకృష్ణ (Balakrishna)టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని అగ్ర హీరోగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. సీనియర్ నటుడు నందమూరి తారకరామారావు వారసులుగా ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు కానీ బాలయ్య మాత్రమే ఇండస్ట్రీలో సక్సెస్ అందుకొని నందమూరి వారసత్వాన్ని ముందుకు కొనసాగిస్తున్నారు. ఇలా తండ్రికి తగ్గ తనయుడిగా సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా బాలయ్య రాజకీయాలలోకి (Politics) ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా అపజయం ఎరుగని నాయకుడిగా దూసుకుపోతున్నారు. ఇలా సినిమా ఇండస్ట్రీలోనూ, రాజకీయరంగంలోనూ బాలయ్యకు ఎవరు సాటి రాలేదని చెప్పాలి.
ఇక నేడు బాలకృష్ణ పుట్టిన రోజు(Birthday) వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో బాలయ్యకు సంబంధించిన ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలకృష్ణ చిన్నప్పటినుంచి సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలోనే పుట్టి పెరగడంతో బాలా నటుడుగా ఈయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటుడిగా సక్సెస్ అందుకున్నారు. ఇక రాజకీయాలలోకి కూడా అడుగుపెట్టి అక్కడ మంచి సక్సెస్ అందుకున్నారు. హిందూపురం నియోజకవర్గం నుంచి బాలకృష్ణ ఇప్పటివరకు మూడుసార్లు పోటీ చేయగా మూడుసార్లు అద్భుతమైన మెజారిటీతో విజయం సాధించారు.
అన్ స్టాపబుల్…
ఇలా సినిమాలలోను రాజకీయాలలో మాత్రమే కాకుండా తనలో మరో యాంగిల్ కూడా ఉంది అంటూ బాలయ్య యాంకర్ గా మారిపోయారు. ఆహా ప్రసారం చేస్తున్న అన్ స్టాఫబుల్ (Un Stoppable)అనే కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తూ తన మాట తీరుతో బాలయ్య అందరిని ఆకట్టుకున్నారు. ఇలా అన్ని రంగాలలోనూ సక్సెస్ అందుకున్న బాలయ్య ఒక విషయంలో మాత్రం సక్సెస్ అందుకోలేక ఫెయిల్యూర్ గానే మిగిలిపోయారని తెలుస్తోంది. మరి బాలయ్యకు అందని ఆ సక్సెస్ ఏంటి అనే విషయానికి వస్తే….
నిర్మాతగా ఫెయిల్యూర్….
బాలకృష్ణ సినిమా ఇండస్ట్రీలో నటుడిగా కొనసాగడమే కాకుండా నిర్మాతగా కూడా మారారు. స్వయంగా తన తండ్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు బయోపిక్ చిత్రంలో బాలకృష్ణ ఎన్టీఆర్ గారి పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు స్వయంగా నిర్మాతగా మారిపోయారు. ఎన్బీకే ఫిల్మ్స్ పేరుతో ప్రొడక్షన్ హౌజ్‌ని స్టార్ట్ చేసి, “ఎన్టీఆర్” బయోపిక్‌ని సినిమాని సుమారు 60 కోట్ల రూపాయల వరకు డబ్బు ఖర్చు చేశారు. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వ్యవహరించారు. ఇలా బాలకృష్ణ ప్రొడక్షన్ లోనే ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చినప్పటికీ ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. నిర్మాతగా బాలయ్యకు నష్టాలే వచ్చాయి. ఇలా నిర్మాతగా మాత్రం బాలకృష్ణ ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోలేకపోయారని చెప్పాలి.ఇదే కాదు అంతకు ముందు కూడా సహ నిర్మాతగా వ్యవహరించారు. “సుల్తాన్” అనే చిత్రానికి సమర్పకులుగా వ్యవహరించారు. ఈ మూవీ డిజాస్టర్ గా మిగిలిపోవడంతో నిర్మాతగా బాలయ్య ఫెయిల్యూర్ అయ్యారనే చెప్పాలి.