Vijay Devarakonda : టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరోగా కొనసాగుతూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయిన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. కెరియర్ మొదట్లో ఈయన పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అలా 2011 సంవత్సరంలో “నువ్విలా” అనే సినిమాలో ఒక పాత్రలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ ఆ తరువాత “ఎవడే సుబ్రమణ్యం” సినిమాలో నటించే ఛాన్స్ అందుకున్నారు.
అర్జున్ రెడ్డితో సక్సెస్..
ఇక ఈయన హీరోగా తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన “పెళ్లి చూపులు” అనే సినిమాలో ఛాన్స్ అందుకున్నారు. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న విజయ్ దేవరకొండ అనంతరం “అర్జున్ రెడ్డి”, “గీతగోవిందం” వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే ఎంతోమంది ఫాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు. విజయ్ దేవరకొండ స్టైల్ కి ఎంతోమంది ఫిదా అవుతూ ఉటారు. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాకుండా, సెలబ్రిటీలలో కూడా ఈయనకు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి .
నీరజ్ చోప్రా…
ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు విజయ్ దేవరకొండ గురించి పలు సందర్భాలలో తెలియజేశారు. తాజాగా ఒలంపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా(Neeraj Chopra) కూడా విజయ్ దేవరకొండ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. బల్లెం వీరుడు విజయ్ చోప్రా ఇప్పటికే ఒలంపిక్ పథకాలను సాధించి భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు.. ఇటీవల ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న నీరజ్ చోప్రాకు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. మీకు ఎవరి ఫ్యాషన్ పర్సనల్ గా నచ్చుతుందనే ప్రశ్న ఎదురవడంతో వెంటనే ఈయన విజయ్ దేవరకొండ పేరు చెప్పటం విశేషం.
Olympic champion #NeerajChopra says he likes the fashion sense of #VijayDeverakonda. pic.twitter.com/olWHSie4Bg
— Telugu Chitraalu (@TeluguChitraalu) June 10, 2025
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ బాగా నచ్చుతారని తెలిపారు. అద్భుతమైన ఇండియన్ దుస్తులను ధరిస్తూ అతను చాలా స్టైలిష్ గా ఉంటారని తెలిపారు. గుబురు జుట్టు వేసుకొని చూడటానికి చాలా బాగుంటారని విజయ్ దేవరకొండ గురించి నీరజ్ చోప్రా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక ఇది తెలిసిన విజయ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. విజయ్ దేవరకొండకు కేవలం సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈయన లైగర్ అనే పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీగా ప్రమోషన్లను నిర్వహిస్తూ అక్కడ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ కింగ్ డమ్ (King Dom) సినిమా పనులలో బిజీగా ఉన్నారు త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.