HBD Manchu Manoj:మంచు మనోజ్ (Manchu Manoj).. 1983 మే 20న జన్మించిన మంచు మనోజ్.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. బాల్యంలోనే తన పదవ యేట తన తండ్రి మోహన్ బాబు నటించి , నిర్మించిన ‘మేజర్ చంద్రకాంత్’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక 2004లో ‘దొంగ దొంగది’ అనే సినిమాతో తెలుగు సినీ ప్రపంచానికి హీరోగా పరిచయమైన ఈయన.. ‘బిందాస్’ సినిమాతో ఏకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే నంది స్పెషల్ జ్యూరీ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొట్టడమే కాదు తన కామెడీతో ప్రేక్షకులను మెప్పించగలడు కూడా .. అంతేకాదు ఇటు సమాజంలో కూడా కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్నారు మంచు మనోజ్. సినిమాల పరంగా అంతా బాగానే ఉన్నా వ్యక్తిగతంగా మంచు మనోజ్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
రోడ్డుపై వదిలేసారంటూ మనోజ్ ఆవేదన..
ముఖ్యంగా గత కొన్ని నెలలుగా కుటుంబంలో జరుగుతున్న గొడవల కారణంగా వార్తల్లో నిలిచారు. అందులో భాగంగానే తన తండ్రి మంచు మోహన్ బాబు, తన అన్నయ్య మంచు మనోజ్ (Manchu Manoj) తనను కట్టుబట్టలతో రోడ్డుపై నిలబెట్టారు అని కన్నీటి పర్యంతం అయ్యారు. అసలు విషయంలోకి వెళ్తే.. దాదాపు 9 ఏళ్ల తర్వాత మళ్లీ ‘భైరవం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మంచు మనోజ్. ‘విజయ్ కనకమేడల’ దర్శకత్వంలో నారా రోహిత్ (Nara Rohit), బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas) తో కలిసి మంచు మనోజ్ ఈ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా మే 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా.. అందులో ఆయన తనకు జరిగిన విషయాలను తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. ఈ మధ్యకాలంలో ఎన్నో జరిగాయి.. ఎన్నో చూశాను.. కట్టుబట్టలతో రోడ్డు మీదకి వచ్చాను.. పిల్లల బట్టలు కూడా లేకుండా చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన అన్నయ్య మంచు విష్ణు తనకు అన్యాయం చేస్తున్నారు అంటూ ఇన్ డైరెక్ట్ గా కామెంట్లు చేసిన మనోజ్.. శివయ్యా అంటే శివయ్య రాడు” అంటూ తన అన్న మంచు విష్ణు పై సెటైరికల్ కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.
బర్తడే రోజు కూడా ర్యాగింగ్ ఆపని మనోజ్..
అయితే తన అన్నయ్యను టార్గెట్ చేసుకొని ఇప్పుడు రోజుకొక రూపంలో సెటైర్లు వేస్తున్నారు మంచు మనోజ్. అయితే ఈ రోజైనా ఈ సెటైర్లు ఆపుతారా అని అనుకుంటే.. బర్తడే రోజు కూడా మనోజ్ ర్యాగింగ్ ఆపడం లేదు అని తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే మంచు మనోజ్ అన్నయ్య మంచు విష్ణు తన డ్రీం ప్రాజెక్టుగా ‘కన్నప్ప’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. శివయ్య కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాను టార్గెట్ గా చేసుకొని ఇన్ డైరెక్ట్ గా మనోజ్ విష్ణు ను ర్యాగింగ్ చేస్తున్నారు. శివయ్య అంటే శివుడు రాడు మనసుపెట్టి పనిచేస్తేనే శివయ్య వస్తాడు అంటూ మనోజ్ మరోసారి కామెంట్లు చేశారు. దీనికి తోడు పలు ఇంటర్వ్యూలలో కూడా మనోజ్.. విష్ణుని ర్యాగింగ్ చేయడం మనం చూడవచ్చు. ఏది ఏమైనా మనోజ్ టార్గెట్ చేశారు అంటే ఇక అది ఎంతకు దారితీస్తుందో చూడాలి. మొత్తానికి తన అన్నయ్య కన్నప్ప మూవీని ఇండైరెక్టుగానే ర్యాగింగ్ చేస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
ALSO READ:Vijay Varma: తమన్నాతో బ్రేకప్.. లగ్జరీ అపార్ట్మెంట్ కొనుగోలు చేసిన విజయ్ వర్మ.. ఎన్ని కోట్లంటే?