HBD Ram Pothineni:రామ్ పోతినేని (Ram Pothineni).. ఎంత సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ కూడా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకోవడానికి కష్టపడే అతి తక్కువ మంది హీరోలలో రామ్ కూడా ఒకరు అని చెప్పవచ్చు. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ప్రస్తుతం అన్ని రకాల సినిమాలు చేస్తూ ఎనర్జిటిక్ స్టార్ గా పేరు దక్కించుకున్న రామ్ .. యాక్టింగ్ తో పాటు స్టైల్ తో కూడా అందరిని ఆకట్టుకుంటున్నారు. ఇకపోతే ఈరోజు (మే 15) రామ్ పోతినేని పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అవేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం..
రామ్ పోతినేని బర్త్ డే స్పెషల్..
1988 మే 15న మురళీ పోతినేని,పద్మశ్రీ దంపతులకు జన్మించారు రామ్ పోతినేని. ప్రముఖ సినీ నిర్మాత స్రవంతి రవికిషోర్ తమ్ముడే ఈ మురళి పోతినేని. పెదనాన్న అడుగుజాడల్లోనే నడుస్తూ సినిమా రంగం వైపు వచ్చిన ఈయన.. తమిళంలో వచ్చిన అడయాళం అనే షార్ట్ ఫిలిం తో తన నటనా ప్రస్తానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత వైవిఎస్ చౌదరి (YVS Choudhary)దర్శకత్వం వహించిన ‘దేవదాస్’ సినిమాతో 2006లో తెలుగు వెండితెరకు పరిచయమైన ఈయన.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక్కడ నటన , డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మెప్పించిన రామ్ కి తెలుగులో అవకాశాలు వరుసగా వచ్చాయి. కానీ కథ ఎంపిక విషయంలో కాస్త తడబడ్డారు అని చెప్పాలి. ఎందుకంటే ఈయన రెండవ సినిమా ‘జగడం’ ఫ్లాప్ గా నిలవడంతో ఆయన కథల ఎంపిక విధానం ఎలా ఉందో అభిమానులు అర్థం చేసుకోగలిగారు. అయినా సరే రామ్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అయితే 2008లో మాత్రం శ్రీను వైట్ల (Srinu vaitla) దర్శకత్వంలో వచ్చిన ‘ రెడీ ‘ సినిమాతో సత్తా చాటాడు. ఇక తర్వాత ఎందుకంటే ప్రేమంట, ఒంగోలు గిత్త, రామ రామ కృష్ణ కృష్ణ, మస్కా, హైపర్, పండగ చేసుకో, హలో గురు ప్రేమకోసమే వంటి ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్దకు వచ్చాయి కానీ పర్వాలేదు అనిపించుకున్నాయి.
నార్త్ లో ఆ రికార్డు సృష్టించిన ఏకైక దక్షిణాది హీరో..
ఇక 2019లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్నారు. అంతేకాదు అప్పటివరకు చాక్లెట్ బాయ్ గా ఉన్న హీరో రామ్ ఈ సినిమాతో ఒక్కసారిగా మాస్ హీరో అయిపోయారని చెప్పవచ్చు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద రూ.100 కోట్ల క్లబ్లో చేరగా.. ఇదే చిత్రాన్ని హిందీలో డబ్ చేసి వదిలితే, సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాదాపు 100 మిలియన్ల వ్యూస్ తో అదరగొట్టింది. అంతేకాదు హిందీలోకి డఫ్ చేసిన రామ్ నాలుగు చిత్రాలు కూడా ఏకంగా 100 మిలియన్ల వ్యూస్ నమోదు చేసి ఓ రికార్డు సృష్టించాయి. మొత్తానికైతే దక్షిణా సినీ పరిశ్రమలో నాలుగు సినిమాలు వంద మిలియన్ల వ్యూస్ కి చేర్చిన తొలి హీరో ఘనత రామ్ కే సాధ్యం. ఇక ఈ మధ్య స్కంద ,డబుల్ ఇస్మార్ట్, ది వారియర్ చిత్రాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. కానీ అవి పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక ఇప్పుడు మహేష్ బాబు.పి దర్శకత్వంలో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మరి ఈ సినిమాతో రామ్ ఎలా మెప్పిస్తారో చూడాలి.
ALSO READ:RAPO22 Title Glimpse: రామ్ బర్తడే స్పెషల్.. గ్లింప్స్ తో పాటు టైటిల్ రిలీజ్.. ఇది గమనించారా?