HBD Tarun Arora..తరుణ్ అరోరా (Tarun Arora).. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. పేరుకే బాలీవుడ్ స్టార్ నటుడు అయినప్పటికీ సౌత్ లో స్టార్ హీరోలకు పోటీగా నటిస్తూ సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించారు. ఇకపోతే ఈరోజు తరుణ్ అరోరా పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే తరుణ్ అరోరా ప్రముఖ హీరోయిన్ అంజలా జవేరి (Anjala Zaveri)తో ఏడడుగులు వేసిన విషయం తెలిసిందే.. ఇప్పటికీ అన్యోన్యంగా ఉంటూ ఎంతో ఆదర్శంగా నిలిచింది ఈ జంట. ఇకపోతే ఈ జంటకు పెళ్లయి 20 ఏళ్లు అవుతున్నా.. పిల్లలు మాత్రం లేరు. మరి పిల్లలు లేకపోవడానికి అసలు కారణం ఏంటి? వీళ్ళు పిల్లల్ని వద్దనుకున్నారా ? లేక దేవుడే వీరికి పిల్లలు ఇవ్వలేదా? అసలు ఏం జరిగింది? అనే విషయాలు ఈరోజు వైరల్ గా మారుతున్నాయి. మరి అంజలా జవేరి , తరుణ్ అరోరా దంపతులకు పిల్లలు లేకపోవడానికి అసలు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.
పెళ్లయి 20 ఏళ్ల అయినా పిల్లలు లేరు..
తరుణ్ అరోరా.. తెలుగులో అర్జున్ సురవరం(Arjun Suravaram), ఖైదీ నెంబర్ 150(Khaidi No. 150), కాటమరాయుడు (Katamarayudu), జయ జానకి నాయక (Jaya Janaki Nayaka), సీటీమార్ (Seeti maar) వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. టాలీవుడ్ స్టార్ హీరోలతో సమానంగా పోటీ పడుతూ తనకంటూ ఒక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఇకపోతే ఈయన వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. ప్రముఖ హీరోయిన్ అంజలా జవేరి సినిమాలు చేస్తున్నప్పుడు.. తరుణ్ అరోరా మోడలింగ్ చేస్తున్నారట. వీరిద్దరూ కలిసి ముంబైలోని ఓ ఈవెంట్లో కలుసుకున్నప్పుడు పరిచయం ఏర్పడి, తర్వాత కాలంలో అది కాస్తా ప్రేమగా మారింది. అలా వీరిద్దరి మధ్య బంధం ఏర్పడి 20 ఏళ్లు పూర్తయింది. కానీ ఇప్పటికీ వీరికి పిల్లల పుట్టలేదు. అయితే పిల్లలు పుట్టకపోవడంపై ఓ ఇంటర్వ్యూలో తరుణ్ అరోరా మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.
అందుకే మాకు పిల్లలు లేరు – తరుణ్ అరోరా..
“మా మధ్య బంధం ఏర్పడి 20 ఏళ్లయినా.. మేము పిల్లల్ని కనలేదు. దానికి ఓ కారణం ఉంది.. పెద్దవాళ్లు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకున్న చాలామంది జంటలు వారి మధ్య మరింత ప్రేమ,బాండింగ్ పెరగడానికి పిల్లల్ని కంటూ ఉంటారు. కానీ మాది పెద్దల కుదిర్చిన పెళ్లి కాదు.మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మా మధ్య ఎప్పటికీ ఆ ప్రేమ ఉంటుంది. అందుకే మేము పిల్లల్ని కనలేదు. పిల్లల్ని కనకూడదని కూడా నిర్ణయించుకున్నాం. అంజలా జవేరి ఎప్పటికీ నాకు ఓ చిన్న పాపాయి లాగే.. మా మధ్య ప్రేమ శాశ్వతం.అందుకే భవిష్యత్తులో కూడా పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకున్నాం”.. అంటూ తరుణ్ అరోరా చెప్పుకొచ్చారు. అందుకే ఇన్ని సంవత్సరాలైనా పిల్లల్ని కనలేదన్నారు.
also read:Sukumar Emotional: ఫాదర్స్ డే స్పెషల్.. పిల్లలు ఇచ్చిన గిఫ్ట్ చూసి ఏడ్చేసిన సుకుమార్!
అంజలా జవేరి రీ ఎంట్రీ పై తరుణ్ కామెంట్స్..
అలాగే తన భార్య మళ్ళీ సినిమాల్లోకి వచ్చి నటిస్తానని చెప్పినా కూడా తనకు నో ప్రాబ్లం అని, ఎలాంటి సినిమాలు అయినా చేయడానికి తాను ఒప్పుకుంటానని, సినిమాల విషయంలో ఆమెకు ఎలాంటి కండిషన్లు పెట్టను అంటూ తరుణ్ అరోరా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తరుణ్ అరోరా చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.