Rp Patnaik : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్.పి పట్నాయక్ ఒకరు. మ్యూజిక్ డైరెక్టర్ గానే కాదు ఒక సింగర్ గా కూడా పలు సినిమాల్లో పాటలు పాడి ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆయన పాడిన పాటలు తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్నాయి. ఆర్పీ పట్నాయక్ తేజ దర్శకత్వంలో చిత్రం అనే మూవీతో మ్యూజిక్ డైరెక్టర్ గా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆ తర్వాత మళ్లీ తేజ డైరెక్షన్లోనే నువ్వు నేను, జయం, సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. అంత క్రేజ్ ఉన్న డైరెక్టర్ ఇప్పుడు ఇండస్ట్రీకి దూరం అవడానికి కారణం ఒక హీరో అంటూ సోషల్ మీడియాలో వార్తలు చూపిస్తున్నాయి..
బిజీగా మ్యూజిక్ డైరెక్టర్ గా ఆర్. పి పట్నాయక్..
తేజ దర్శకత్వంలో వచ్చిన సినిమాలతో ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు. అప్పటి రోజుల్లో నాగార్జున లాంటి స్టార్ హీరోలకి డేట్స్ ఇవ్వలేనంత బిజీగా ఉండేవారు.. కొన్ని స్టార్ హీరోలు సినిమాలను పక్కన పెట్టేసిన ఈ మ్యూజిక్ డైరెక్టర్ ప్రస్తుతం నటుడిగా సినిమాల్లో రాణిస్తున్నారు. ఆయన ఈ పరిస్థితికి రావడానికి కారణం ఓ స్టార్ హీరో అని పలు సందర్భాల్లో బయటపెట్టారు..
ఆ హీరో వల్లే సినిమాలకు దూరం..
ఓ స్టార్ హీరో సినిమాకు మ్యూజిక్ ను ఇవ్వలేను అని చెప్పడమే ఆయన చేసిన తప్పు. అదే ఆయన జీవితాన్ని తల క్రిందులు చేశాయని టాక్. దానికి హర్ట్ అయిన పెద్ద హీరో ఆర్పి పట్నాయక్ కి అవకాశాలు రాకుండా చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపించింది. మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయినప్పటికీ ఆఫర్స్ లేకపోవడంతో ఈయన కెరియర్ నాశనం చేయడంలో ఆ హీరో మెయిన్ కారణం అని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్..ఆ స్టార్ హీరో అల్లుడు సినిమాకి మ్యూజిక్ చేయకపోవడమే ఆర్పి పట్నాయక్ చేసుకున్న పాపమని అన్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ స్టార్ హీరో నటించిన రెండు సినిమాలకు కూడా ఆయన మ్యూజిక్ ఇచ్చారు. ఆ రెండు సినిమాలు మంచి టాక్ ను అందుకున్నాయి.. కానీ ఆయన జీవితం మాత్రం హీరో వల్లే మారిందని ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త కోడై కూస్తుంది.. మ్యూజిక్ డైరెక్టర్ గా ఈయన సినిమాలు చేయకపోయినా నటుడుగా మాత్రం ప్రస్తుతం సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని టాక్..
Also Read :ప్రభాస్ బ్యూటీ అలాంటి పనిచేసిందా..? ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం..
ఆ హీరో కూడా ఇప్పటికీ హీరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడని టాక్.. ఏ మాటకు ఆ మాట చెప్పాలి ఈయన ఎక్కువగా ఉదయ్ కిరణ్ సినిమాలకు గొంతును అందించారు. ఆ పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఈయన మాత్రమే కాదు రఘు కుంచె కూడా నటుడుగా మారి సినిమాలు చేస్తున్నాడు.