BigTV English

Brahmamudi Serial Today April 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  రుద్రాణి ప్రయత్నం అట్టర్‌ ప్లాప్‌ – సంతకం రాజ్‌ చేశాడన్న ఫోరెన్సిక్‌

Brahmamudi Serial Today April 25th: ‘బ్రహ్మముడి’ సీరియల్:  రుద్రాణి ప్రయత్నం అట్టర్‌ ప్లాప్‌ – సంతకం రాజ్‌ చేశాడన్న ఫోరెన్సిక్‌

Brahmamudi serial today Episode: రాజ్‌ లేకుండా నీ చేతికి పవరాఫ్‌ అటార్ని ఎలా వచ్చింది చెప్పు కావ్య అంటూ అందరి ముందు నిలదీస్తుంది రుద్రాణి. దీంతో కావ్య మౌనంగా ఉండిపోతుంది. ఈ ఇంట్లో ఏదైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరించుకోవాలి. మౌనం సమాధానం కాదు అంటుంది రుద్రాణి. ఇంతలో ఇంద్రాదేవి తను అలా అడుగుతుంటే ఏం మాట్లాడవేంటి కావ్య ఆ పేపర్లు నీకు ఎలా వచ్చాయి అని అడుగుతుంది. సీతారామయ్య కూడా కంపెనీ ఎండీ లేకుండా ఒక కంపెనీకి సంబంధించిన పూర్తి హక్కులు వేరొకరి పేరు మీదకు రాయడం సాధ్యం కాని పని కదమ్మా అలాంటిది నువ్వెలా చేయగలవు అంటాడు.


సుభాష్‌ కూడా ఇవి వర్జినల్‌ కాదనుకుందామంటే అధికారం కోసం విలువలు చంపుకుని నమ్మిన సిద్దాంతాలను పక్కన పెట్టి నువ్వేం చేయవు అంటాడు దీంతో కావ్య నన్ను బాగా అర్థం చేసుకున్న మీరే రుద్రాణి మాటలకు ఇదేంటి అని నన్ను ఎలా అడగాలనిపిస్తుంది మామయ్యగారు అంటుంది. దీంతో రుద్రాణి సాక్ష్యాలతో వచ్చి ప్రశ్నిస్తుంది అమ్మా తనకు ఏం సమాధానం చెప్పమంటావు అంటుంది ఇందిరాదేవి. దీంతో ఎవరేం అడిగినా సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత నాదే కాబట్టి చెప్తున్నాను వినండి అంటూ మామయ్య గారు ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో పవరాఫ్‌ అటార్ని అవసరం పడితే ఇబ్బంది పడకూడదని ఎప్పుడో నా పేరు మీద ఇవి రెడీ చేయించి పెట్టారు అని చెప్తుంది. దీంతో నువ్వు చెప్పేదంతా అబద్దం ఇవేమీ నేను నమ్మను అంటుంది. మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు అంటుంది కావ్య.

దీంతో నువ్వు ఫ్రాడ్‌ చేశావని రేపు ఎవరైనా కంప్లైంట్‌ చేస్తే.. నీకేం నువ్వు జైలుకు పోతావు. కానీ పోయేది మా ఇంటి పరువు అంటుంది రుద్రాణి దీంతో అపర్ణ కోపంగా రుద్రాణిని తిడుతుంది. అసలు నువ్వు ఏం రుజువు చేయాలనుకుంటున్నావు అని అడుగుతుంది. దీంతో రుద్రాణి అసలు ఇది రాజ్‌ సంతకమేనా..? లేక ఫోర్జరీ చేశారా అనేది  తెలుసుకోవాలి అని చెప్తుంది. వెంటనే ఫోరెన్సిక్‌ వాళ్లకు ఫోన్‌ చేసి లోపలికి రండి అని చెప్తుంది. ఫోరెన్సిక్‌ ఆఫీసర్‌ లోపలికి వచ్చి రాజ్‌ సంతకాన్ని  పరిశీలిస్తుంటాడు. ఇంతలో రుద్రాణి ఏం కావ్య హాల్లో సెంట్రల్‌ ఏసీ ఉన్నా నీకు చెమటలు పడుతున్నాయి. అయినా అతను ఇప్పుడేగా వర్క్‌ స్టార్ట్‌ చేసింది. ఆ సంతకాలు ఎవరు చేసింది తెలియని అప్పుడు నీకు నేను పట్టిస్తాను అసలైన చెమటలు అంటుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. రుద్రాణి వెంటనే ఇంకా ఎంత సేపు పరిశీలిస్తారు. అవి ఫోర్జరీ అని చెప్పండి అనగానే డాక్యుమెంట్స్‌ మొత్తం పరిశీలించిన అతను ఇవి రెండు వర్జినల్ సంతకాలే మేడం. రెండింట్లోనూ ఒకరే సంతకాలు చేశారు అని చెప్తాడు. దీంతో రుద్రాణి, రాహుల్‌ షాక్‌ అవుతారు. కావ్య మాత్రం కాఫీ షాపులో రాజ్‌ తిరిగి వచ్చి సంతకం చేసింది గుర్తు చేసుకుంటుంది.


రుద్రాణి కోపంగా ఫోరెన్సిక్‌ అతన్ని తిడుతుంది నేను ఇచ్చిన డబ్బులు సరిపోలేదా..? అదే దీని పేమెంట్‌ సరిపోలేదా..? ఇంకా ఇస్తాను ఇంకే కావాలో చెప్పండి.. టైం కావాలా చెప్పండి. ఇంకొకసారి క్లియర్‌గా చూసి చెప్పండి అంటుంది. దీంతో అతను నేను క్లియర్‌గానే చూశాను మేడం ఇది వర్జినల్‌ సంతకమే అని చెప్తాడు. దీంతో రుద్రాని కోపంగా ఏమయ్యా అసలు నీకు పని తెలుసా..? అంటుంది. దీంతో  అతను మేడం నేను ఈ వర్క్‌ 20 ఏళ్లుగా చేస్తున్నాను. రెండు నిమిషాల్లో ఏది వర్జినల్‌ సంతకమో.. ఏది ఫోర్జరీ సంతకమో చెప్పేయగలను అంటాడు. దీంతో రుద్రాణి నిన్ను నమ్ముకుంటే నా టైం అంతా వేస్ట్‌ అయింది. నీకంటే ప్రొఫెషనల్‌ దగ్గరకు తీసుకెళ్తాను అటుంది. దీంతో అతను మేడం మీరు ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకెళ్లండి ఈ రెండు సంతకాలు ఒక్కరివే అని చెప్తారు. ఆ తర్వాత మీ ఇష్టం అంటూ వెళ్లిపోతాడు. దీంతో ఇంట్లో వాళ్లందరూ రుద్రాణిని తిడతారు. ఇంక నిన్ను తిట్టడానికి మా దగ్గర మాటలు కూడా లేవే అంటూ ఇందిరాదేవి వాపోతుంది. చీచీ ఒక మనిషి మీద ఇంత ధ్వేషం పెంచుకోవడమా..? అంటూ వెళ్లిపోతుంది. ఇక సుభాష్‌, అపర్ణ కావ్యను మెచ్చుకుంటారు.

కావ్య వేసిన పొడుపుకథ గురించి ఆలోచిస్తాడు రాజ్‌. నెట్‌లో వెతుకుదామని చూస్తూ.. ఏదో కనుక్కున్నట్టు కావ్యకు ఫోన్‌ చేసి నీ పొడుపుకథకు ఆన్సర్‌ కనుక్కున్నానని చెప్తాడు. దీంతో కావ్య ఆశ్చర్యపోతుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?

 

Tags

Related News

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు గుడ్ న్యూస్.. బాలును ఇరికించేసిన కల్పన..

Illu Illalu Pillalu Today Episode: భర్తను కాపాడిన భాగ్యం.. నర్మదకు మొదలైన అనుమానం.. శ్రీవల్లి సేఫ్..

Today Movies in TV : ఆదివారం టీవీలల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Tv Kissik Talks: వాడి కోసం ప్రాణాలైనా ఇస్తా… థాంక్స్ చెప్పి రుణం తీర్చుకోలేను!

Big Tv Kissik Talks: అందుకే పిల్లల్ని వద్దనుకున్నాం..  బాంబు పేల్చిన అమర్!

Big Tv Kissik Talks:  అమర్ దీప్ , తేజు మధ్య గొడవలు.. ఇన్నాళ్లకు బయటపెట్టిన అమర్!

Big Stories

×