BigTV English

Hero Navadeep: కష్టాల్లో యంగ్ హీరో.. స్టార్ హీరో ఎంట్రీ తో..!

Hero Navadeep: కష్టాల్లో యంగ్ హీరో.. స్టార్ హీరో ఎంట్రీ తో..!

Hero Navadeep.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు భారీ ఇమేజ్ సొంతం చేసుకొని, ఇప్పుడు సక్సెస్ కోసం పరితపిస్తున్న హీరోలలో హీరో నవదీప్ (Navadeep )కూడా ఒకరు అని చెప్పవచ్చు. సినీ ఇండస్ట్రీలోకి ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకున్నారు. ప్రముఖ దర్శకుడు తేజ (Teja) తెరకెక్కించిన జై అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై, ఆ తర్వాత హీరోగా కెరియర్ లో ఒకటి రెండు సూపర్ హిట్ లు మాత్రమే అందుకున్నారు. ఆ తర్వాత నటించిన దాదాపు అన్ని చిత్రాలు కూడా డిజాస్టర్ గానే నిలిచాయి. అయినా సరే ఇండస్ట్రీలో నటుడిగా మంచి పేరు దక్కించుకున్నారు నవదీప్.


నిర్మాతగా మారిన నవదీప్..

ఇక హీరో గానే అవకాశాల కోసం ఎదురు చూస్తే ఇండస్ట్రీ నుండి దూరం అవ్వాలనే ఆలోచనలో భాగంగానే అవకాశం వస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడానికి కూడా వెనుకడుగు వేయలేదు. అలా విలన్ గా కూడా నటించిన సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడం మొదలు పెట్టిన తర్వాత ఈయనకు తెలుగు, తమిళ్ భాషలో అవకాశాలు బాగానే వచ్చాయి. దాంతో నిర్మాతగా మారాలనుకున్నారు. అలా నిర్మాతగా మారి ఏవం(Evam )అనే సినిమాను నిర్మించారు నవదీప్. ఎన్నో అంచనాల మధ్య అప్పటి వరకు పోగేసుకున్న మొత్తం డబ్బును ఈ సినిమాపై వెచ్చించాడు. అలా 24 జూన్ 14న విడుదలైన ఈ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకొని ఘోరమైన పరాభవాన్ని దక్కించుకుంది.


భారీగా నష్టపోయిన నవదీప్..

తెలుగు బ్యూటీ చాందిని చౌదరి (Chandini Chaudhary ) ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో ప్రముఖ యూట్యూబర్ తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ అషు రెడ్డి (Ashu Reddy)కూడా కీలకపాత్ర పోషించారు. ఇద్దరు కూడా నటనతో పోటీపడి మరీ ప్రేక్షకులను మెప్పించారు. కానీ కంటెంట్ ప్రేక్షకులకు నచ్చక సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇకపోతే సినిమా నిర్మించడానికి కాదు ప్రమోషన్స్ కోసం భారీగా ఖర్చు చేశారు. సినిమాలో కంటెంట్ లేకపోవడం వల్లే అసలు ఈ సినిమా విడుదలైంది అని ప్రజలకు తెలిసే లోపే సినిమాను థియేటర్ల నుండి తీసేసారు. దీంతో నిర్మాతగా నవదీప్ కు భారీ నష్టాలు వచ్చాయి.

నవదీప్ కి అండగా అల్లు అర్జున్..

మొత్తానికి అయితే భారీగా నష్టపోయిన నవదీప్ దిక్కుతోచని స్థితిలో ఉండగా అల్లు అర్జున్ చేయూతని అందించినట్లు సమాచారం. వీరిద్దరూ మంచి స్నేహితులు. దీనికి తోడు వీళ్లిద్దరూ కలిసి అలా వైకుంఠపురంలో , ఆర్య 2 చిత్రాలలో కూడా నటించారు. ఆ స్నేహం కారణంగానే ఆహా మీడియాలో పలు వెబ్ సిరీస్ లు , స్పెషల్ టాక్ షోలు చేసే అవకాశాన్ని కల్పించారు అల్లు అర్జున్ (Allu Arjun). ఇక ఇప్పుడు నవదీప్ చేస్తున్న వాటికి మంచి రెస్పాన్స్ రావడంతో అల్లు అర్జున్ పుణ్యమా అని ఏవం సినిమాతో వచ్చిన నష్టాలను కూడా పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు నవదీప్. ఏది ఏమైనా నవదీప్ కష్టాల్లో ఉన్నప్పుడు అల్లు అర్జున్ చేయూతనందించి మంచి మనసు చాటుకున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×