BigTV English
Advertisement

Unstoppable 4: ‘అన్‌స్టాపబుల్’ ప్రీమియర్‌కు ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబుతో స్పెషల్ ఫోటో రిలీజ్

Unstoppable 4: ‘అన్‌స్టాపబుల్’ ప్రీమియర్‌కు ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబుతో స్పెషల్ ఫోటో రిలీజ్

Unstoppable 4: ఈరోజుల్లో చాలామంది స్టార్ హీరోలు బుల్లితెరపై కనిపించడానికి కూడా వెనకాడడం లేదు. అదే విధంగా చాలామంది హోస్టులుగా కూడా మారారు. అందులో సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. ‘అన్‌స్టాపబుల్’తో హోస్ట్‌గా మారి అందరికీ షాకిచ్చారు బాలయ్య. ఇప్పటికే ఈ టాక్ షోకు సంబంధించిన మూడు సీజన్స్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తయ్యాయి. ఇప్పుడు నాలుగో సీజన్ కూడా ప్రీమియర్ అవ్వడానికి సిద్ధమయ్యింది. ‘అన్‌స్టాపబుల్’ సీజన్ 4కు సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రాగా తాజాగా దీనికి సంబంధించిన ప్రీమియర్ డేట్ కూడా వచ్చేసింది. బాలయ్య.. చంద్రబాబుతో కలిసి దిగిన ఫోటోలతో పాటు ప్రీమియర్ డేట్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.


కూల్ బాలయ్య

కేవలం తెలుగు ప్రేక్షకుల కోసమే ఎక్స్‌క్లూజివ్‌గా ఆహా అనే ఓటీటీ యాప్ మొదలయ్యింది. ఈ యాప్‌కు ప్రేక్షకుల్లో రీచ్ పెంచడం కోసం పలు టాక్ షోలు ప్రారంభించారు. అందులో ‘అన్‌స్టాపబుల్’ కూడా ఒకటి. ఆన్ స్క్రీన్ మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ కూడా నటసింహం అని పేరు తెచ్చుకున్న బాలయ్యను హోస్ట్‌గా ప్రవేశపెట్టారు. మామూలుగా బాలకృష్ణ (Balakrishna) ఆఫ్ స్క్రీన్ చాలా కోపంగా ఉంటారు, ఊరికే కోప్పడతారు అనే విమర్శలు ఉన్నాయి. కానీ ‘అన్‌స్టాపబుల్’ మొదలయిన తర్వాతే అసలు ఆయన ఎంత కూల్‌గా ఉండగలరు అని ప్రేక్షకులకు అర్థమయ్యింది. అలాగే ఆయన కూల్ యాటిట్యూడ్‌తో మూడు సీజన్స్‌ను పూర్తి చేసుకొని నాలుగో సీజన్‌లోకి అడుగుపెట్టారు.


Also Read: అల్లు అర్జున్ మరోసారి… గెస్ట్ లిస్ట్ చూశారా… మైండ్ పోయేలా ఉంది సామి..

ఈసారి గెలిచి వచ్చారు

‘అన్‌స్టాపబుల్’ సీజన్ 4 అక్టోబర్ 25 శుక్రవారం సాయంత్రం 8.30 గంటలకు ఆహాలో ప్రీమియర్ అవ్వడానికి సిద్ధమయ్యింది. దీంతో ఫ్యాన్స్‌లో మరింత ఎగ్జైట్మెంట్ పెరిగింది. అయితే ఈ ప్రీమియర్ ఎపిసోడ్‌ను ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు (Chandrababu)తో మొదలుపెడుతున్నారు బాలయ్య. ఇప్పటికే నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్.. ‘అన్‌స్టాపబుల్’లోని మునుపటి సీజన్‌లో గెస్టులుగా వచ్చారు. కానీ అప్పుడు వారి చేతుల్లో అధికారం లేదు. ఇటీవల ఎన్నికలు ముగిసిన తర్వాత ఏపీ ప్రజలంతా కలిసి ఆయనను ముఖ్యమంత్రిగా ఎంచుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రిగా మారిన తర్వాత బాలయ్యతో కలిసి ‘అన్‌స్టాపబుల్’ షోలో పాల్గొనడం చాలా స్పెషల్ అనుకుంటున్నారు ఫ్యాన్స్.

మరోసారి వారే

‘అన్‌స్టాపబుల్’ సీజన్ 4 ప్రీమియర్స్ గురించి అనౌన్స్ చేస్తూ బాలయ్య, చంద్రబాబు కలిసున్న కొన్ని ఫోటోలను విడుదల చేశారు మేకర్స్. అలా వాళ్లిద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూడడం చాలా బాగుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ట్రైలర్ ఎప్పుడు వస్తుందా లేదా ఫుల్ ఎపిసోడ్ రిలీజ్ ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ‘అన్‌స్టాపబుల్ 4’ (Unstoppable 4)లో మొదటి ఎపిసోడ్ నారా చంద్రబాబుతో ముగిసిన తర్వాత రెండో ఎపిసోడ్‌లో ‘పుష్ప’ టీమ్ మొత్తం సందడి చేయనుంది. ‘పుష్ప’ విడుదలయిన తర్వాత బాలయ్యతో కలిసి స్టేజ్‌పై సందడి చేసిన ఈ మూవీ టీమ్.. ఇప్పుడు అదే మూవీ సీక్వెల్ కోసం మరోసారి అదే స్టేజ్‌పైకి రానున్నారు.

Related News

OTT Movie : హిందువుల ఊచకోతను కళ్ళకు కట్టినట్టు చూపించే మరో రియల్ స్టోరీ… ‘బెంగాల్ ఫైల్స్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

OTT Movie : యాక్షన్ లేదు, రొమాన్స్ లేదు… IMDbలో 7.4 రేటింగ్‌… హృదయాన్ని హత్తుకునే ఫ్యామిలీ డ్రామా

OTT Movie : మంత్రముగ్ధులను చేసే కథ… మెంటలెక్కించే క్లైమాక్స్.. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌లో మిస్ అవ్వకుండా చూడాల్సిన థ్రిల్లర్లు

OTT Movie : బీహార్ రాజకీయాలు ఎంత బ్రూటల్‌గా ఉంటాయో తెలుసుకోవాలా ? అయితే ఈ వెబ్ సిరీస్‌లపై లుక్కేయండి

Dude OTT: ‘డ్యూడ్’ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

OTT Movies: 3 రోజుల వ్యవధిలో 4 చిత్రాలు స్ట్రీమింగ్..ముందు ఏది చూడాలి?

OTT Movie : న్యూయార్క్ నగర మేయర్‌గా ఇండియన్ ఫిలిం మేకర్ తనయుడు… మీరా నాయర్ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : పెళ్ళికి రెడీ అవుతూ ప్రియుడితో… మీరా నాయర్ ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్రేమ కావ్యం

Big Stories

×