Court Movie: నేచురల్ స్టార్ నాని(Nani ) నిర్మాణంలో శ్రీదేవి(Sridevi ), హర్ష రోషన్ (Harsha Roshan) ప్రధాన పాత్రల్లో మార్చి 14వ తేదీన భారీ అంచనాల మధ్య విడుదలైన చిన్న సినిమా కోర్ట్(Court). కేవలం రూ.11 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ రాబట్టి, రికార్డు క్రియేట్ చేసింది. ప్రియదర్శి(Priyadarshi), శివాజీ(Sivaji ), సాయికుమార్(Sai Kumar), హర్షవర్ధన్(Harsha Vardhan), శుభలేఖ సుధాకర్ (Subhalekha Sudhakar), రోహిణి (Rohini), సురభి ప్రభావతి (Surabhi Prabhavathi) , రాజశేఖర్ అనింగీ (Rajasekhar Aningi) తదితరులు కీలక పాత్రలు పోషిస్తూ విడుదలైన ఈ సినిమా అటు డిజిటల్ రైట్స్ తో పాటు ఇటు సాటిలైట్ హక్కులు కూడా భారీ ధరకు అమ్ముడుపోయాయి.ప్రస్తుతం వరుస కలెక్షన్లతో దూసుకుపోతున్న ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో హౌస్ ఫుల్ గా రన్ అవుతున్న విషయం తెలిసిందే. అలాంటి ఈ సినిమాను రెవెన్యూ అధికారులు అర్ధాంతరంగా ఆపేయడంతో అటు చిత్ర బృందానికి భారీ షాక్ తగిలినట్లు తెలుస్తోంది.
అర్ధాంతరంగా కోర్ట్ మూవీని నిలిపివేసిన అధికారులు..
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం వెంకటరమణా థియేటర్లో కోర్టు సినిమా ప్రదర్శనను రెవెన్యూ అధికారులు నిలిపివేశారు.ఇక అసలు విషయంలోకెళితే.. ప్రభుత్వం కోర్టు సినిమా టికెట్ ధరను 110 రూపాయలకు అమ్మాల్సిందిగా ఆదేశాలు జారీ చేయగా.. అమలాపురంలోని వెంకటరమణ థియేటర్లో మాత్రం ఒక్కో టికెట్ ను 150 రూపాయలకు అమ్ముతున్నట్లు రెవెన్యూ అధికారులకు ప్రేక్షకులు సమాచారం అందివ్వడంతో.. రంగంలోకి దిగిన ఆర్డీవో కే. మాధవి, ఎమ్మార్వో అశోక్ వెంకటరమణ థియేటర్లో తనిఖీలు చేపట్టారు. ప్రకటించిన ధర కంటే 40 రూపాయలు అదనంగా టికెట్టుపై వసూలు చేస్తున్న నేపథ్యంలో ఫైర్ అయిన అధికారులు, షోని నిలిపివేశారు. ఇక థియేటర్ లైసెన్స్ రెన్యువల్ కూడా చేయలేదని ఆర్డిఓ కే.మాధవి తెలిపారు. అంతేకాకుండా థియేటర్ రికార్డులను తమ వెంట తీసుకువెళ్లిన ఆమె.. విచారణ పూర్తయ్యే వరకు సినిమా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి అయితే ఇప్పుడు కోర్టు మూవీకి ఈ విషయంతో భారీ షాక్ తగిలిందని నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.
ALSO READ:Sridevi : ఫేం మాత్రమే కాదు.. ఇలాంటి ట్రోల్స్ కూడా ఉంటాయి..!
కోర్ట్ మూవీ కలెక్షన్స్..
మార్చి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన కోర్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ద్వారా రామ్ జగదీష్ (Ram Jagadeesh) అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇందులో శ్రీదేవి అనే కొత్త హీరోయిన్ కూడా ఇండస్ట్రీకి పరిచయమైంది. విభిన్నమైన కథాంశంతో నేటివిటీకి తగ్గట్టుగా అందరికీ కనెక్ట్ అయ్యేలా సినిమాను చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. దీంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ.17.40 కోట్ల తో దూసుకుపోతోంది.
ముఖ్యంగా ఫుల్ రన్ ముగిసేసరికి రూ.30 కోట్లు ఈజీగా రాబడుతుందని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. చిన్న సినిమాగా వచ్చి ఇప్పుడు భారీ విజయాన్ని సొంతం చేసుకుంటూ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోందని చెప్పవచ్చు.