Amazing benefits of Shiv worship during Sravana Somavaram: సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో శ్రావణ మాసం అంటే శివుడికి ఎంతో ఇష్టమని శివుడే స్వయంగా బ్రహ్మ మానస పుత్రుడైన సనత్ కుమారిడికి వివరించాడని స్కాంద పురాణం చెబుతుంది. కాబట్టి శ్రావణ సోమవారం శివుడికి చాలా ఇష్టం. మరి అలాంటి శ్రావణ సోమవారం ఈశ్వరుడిని ఏవిధంగా పూజిస్తే సర్వ సంపదలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయో తెలుసుకుందాం.
వర్షాలు బాగా కురవడానికి, పంటలు బాగా పండటానికి, ధన పరంగా బాగా కలిసి రావడానికి శ్రావణ సోమవారం శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఒక చిన్న వ్రతం చదవాలి. “ఓం భవాయ జలమూర్తి యే నమః” ఈ మంత్రం చదువుతు శివుడికి అబిషేకం చేస్తే అనుగ్రహం తొందరగా కలుగుతుంది. మహిళలు అత్యంత పవిత్రంగా భావించే శ్రావణ మాసంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తే సకల సంపదలు చేకూరుతాయి. ఆ నెలలో సోమవారాలు పరమ పవిత్రమైనవి. ఈ మాసంలో సోమవారం రోజున శివుడిని పూజిస్తే జన్మ జన్మల ఫలం దక్కుతుందని పెద్దలు చెబుతుంటారు.
ఆరోగ్యం సరిగ్గా లేని వారు శ్రావణ సోమవారం రోజున శివుడికి తేనెతో పూజ చేస్తే ఆరోగ్యం మెరుగవుతుంది. అంతే కాదు సంపద కూడా వృద్ది చెందుతుంది. శ్రావణ సోమవారం రోజున శివలింగానికి చెరుకు రసంతో పూజ చేస్తే ఆర్ధిక కష్టాలు తొలగిపోతాయి. సంతానం లేని వారు శివలింగాన్ని పాలతో అభిషేకం చేయాలి. పేదవారికి దాన ధర్మం చేస్తే సంతాన భాగ్యం కలుగుతుందని శివ పురాణం చెబుతోంది.
శ్రావణ సోమవారం రోజున పాలు, పంచదార కలిపి అభిషేకం చేస్తే సుఖసంతోషాలతో జీవిస్తారట.అలాగే శ్రావణ సోమవారం నాడు శివుడికి కొన్ని నైవేద్యాలు పెడితో తొందరగా అనుగ్రహం కలుగుతుంది. చిమ్మిలి శివుడికి నైవేధ్యంగా పెడితే సిరిసంపలు కలుగుతాయి. చక్కెర పొంగలితో శివుడికి నైవేధ్యంగా పెడితో కష్టాలన్ని తొలగిపోతాయి. పులిహోర నైవేధ్యం గాపెడితో ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే శ్రావణ సోమవారం నాడు శివుడికి పూజ చేసేటప్పుడు ఒక రాగిచెంబులులో నీళ్లు తీసుకుని పూజ దగ్గర ఉంచండి.
Also Read: నాగ పంచమి నాడు ఈ పరిహారాలు పాటిస్తే పితృ దోషం నుంచి విముక్తి పొందవచ్చు..
పూజ మొత్తం పూర్తయ్యాక రాగి చెంబుని తీసుకెళ్లి మీ ఇంట్లో ఈశాన్యం మూల ఉంచండి. దాంట్లో కొన్ని గులాబీ పూలు వేసి ఓం నమః శివాయ అని ఐదుసార్లు చదివి రాగి చెంబులో ఉన్న గులాబీపూలు కలిపిన నీళ్లు ఈశాన్యం నుంచి చుట్టుప్రక్కల అంతా సంప్రోక్షణ చేయండి. ఇలా చేస్తే మీ ఇళ్లు పవిత్రమవుతుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. ఇలా శ్రావణ సోమవారం నాడు శివుడిని పూడిస్తే అష్టైశ్వర్యాలు, భోగ భాగ్యాలు కలుగుతాయి.