Manchu Manoj : ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన పేరు మంచు మనోజ్.. మంచు ఫ్యామిలీలో ఆస్తుల వివాదాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.. తండ్రి, కొడుకులు ఆస్తుల పంపకాల పై కోర్టు మెట్లేక్కారు. ఒకరిపై మరోకరు పంచ్ లు వేసుకుంటునే ఉన్నారు. ఇటీవల మంచుమనోజ్ తన భైరవం మూవీ ప్రమోషన్లలో భాగంగా… విష్ణు మూవీ కన్నప్పపై సెటైర్ లు వేసిన సంగతి తెలిసిందే. ఇది ఒకపక్క జరుగుతూనే ఉన్నా కూడా మరోవైపు తన సినిమా సక్సెస్ కోసం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు మనోజ్. తాజాగా ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ లో మనోజ్ నిజ స్వరూపాన్ని తట్టుకోలేరు అంటూ సంచలన కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఇది మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
మంచు మనోజ్ తో గొడవలు.. మనకే డేంజర్..
మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోలుగా విజయ్ తెరకెక్కించిన చిత్రమిది. ఈ నెల 30న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం నిర్వహించారు. దర్శకులు అనిల్ రావిపూడి, సంపత్ నంది ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.. ఈ క్రమంలో సినిమా గురించి బాయ్ కాట్ అంటూ వస్తున్న వార్తల పై క్లారిటీ ఇచ్చారు.. ఇక మనోజ్ లైవ్ లో మాట్లాడుతూనే తమిళ స్టైల్ హీరో శింబుకి ఫోన్ చేశాడు. శింబు మాట్లాడుతూ మనోజ్ గురించి ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు.. అతని ప్రేమిస్తే మనల్ని తిరిగి అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. ఒకవేళ కనుక మనసుని ద్వేషించితే ఆయన కోపాన్ని తట్టుకోవడం ఎవరివల్ల కాదు.. మనకే డేంజర్ అంటూ.. తమిళ హీరో శింబు అన్నారు. మంచు మనోజ్ చిన్నపిల్లాడు లాంటివాడు.. మనం మాట్లాడే మాటతీరులోనే అతని మాట ప్రవర్తన ఉంటుందని శింబు అన్నారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
Also Read :ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆ హీరో లవర్స్ కు జాతరే..
సినిమా బాయ్ కాట్ వార్తల పై మనోజ్ కామెంట్స్..
మంచు మనోజ్ నటిస్తున్న భైరవం సినిమా ఎప్పుడు రిలీజ్ కావాల్సి ఉంది.. అయితే కొన్ని అనుకొని కారణాలవల్ల సినిమా వాయిదా పడుతూనే వచ్చింది. ఈమధ్య ఈ సినిమాను బాయ్ కట్ చేయాలంటూ కొందరు ఆరోపణలు చేశారు. తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆ రోమర్స్ పై మంచు మనోజ్ క్లారిటీ ఇచ్చారు.. మనోజ్ మాట్లాడుతూ.. ఇటీవల ఈ సినిమా విషయంలో బాయ్‌కాట్ ట్రెండ్ నడిచింది. దర్శకుడు విజయ్ పని పట్ల అంకిత భావం ఉన్న వ్యక్తి. పదిమందికి సేవ చేస్తూ ఉంటారు. విజయ్ ఏదో ఒక పోస్టు పెట్టారంటూ కొందరు అంటున్నారు. అది నిజమో కాదో తెలియదు. చిరంజీవి, పవన్ కల్యాణ్‌లకు ఆయన వీరాభిమాని.. ఈ మూవీని అడ్డుకోవాలని చూస్తున్నారు. నాకు సపోర్ట్ గా నిలవండి మెగా ఫ్యాన్స్ అంటూ రిక్వెస్ట్ చేశాడు మనోజ్.. పోస్టు విషయంలో మీరు ఇబ్బంది ఫీల్ అయితే మా టీమ్ తరఫున మీ అందరికీ క్షమాపణలు. సినిమా ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఎంతోమంది కష్టంతో కూడుకున్నది. 9 ఏళ్ల గ్యాప్ తర్వాత నేను నటించిన సినిమా ఇది.. దయచేసి మా సినిమాని ఆదరించి ముందుకు పంపించండి.. అంటూ మనోజ్ లైవ్ లోనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఈ సినిమా అన్ని అడ్డంకులను తొలగించుకొని మరో నాలుగు రోజుల్లో థియేటర్లలోకి రాబోతుంది..