Prabhas: టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్,యంగ్ హీరొయిన్ నిది అగర్వాల్ తో చేస్తున్న సినిమా ది రాజాసాబ్. నిధి అగర్వాల్ తెలుగు, తమిళ,హిందీ సినిమాలలో నటిస్తూ మెప్పిస్తున్నారు. మారుతీ దర్శకత్వంలో పీపుల్స్ మీడియా బ్యానర్ పై టీ.జీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ది రాజా సాబ్. ఈ సినిమాలో నిధి అగర్వాల్,మాళవికా మోహనన్, హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు సంజయ్ దత్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించనున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని సమాచారం. ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎగ్జైట్మెంట్తో ఎదురుచూస్తున్నారు. హరిహర వీరమల్లు,ది రాజా సాబ్ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు నిధి అగర్వాల్. తాజాగా ఈ అమ్మడు డార్లింగ్ ప్రభాస్ గురించి చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె ప్రభాస్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు చూద్దాం..
ప్రభాస్ అందానికి ఫిదా..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హర్రర్ జోనర్ లో తీస్తున్న సినిమా ది రాజాసాబ్. మారుతి దర్శకత్వంలో ఈ సినిమా రానుంది. తాజాగా నిధి అగర్వాల్ ప్రభాస్ గురించి సోషల్ మీడియా వేదికగా,పోస్ట్ చేసింది అందులో..’ప్రభాస్ తో నేను కలిసి పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయనతో వర్క్ చేయడం నాకు మంచి అనుభవం ఆయన్ని అందరూ డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారు అని అనుకునేదాన్ని ఆయనతో వర్క్ చేసిన తర్వాత నాకు అర్థమైంది.ఆయనకు అందంతోపాటు, గోల్డెన్ హార్ట్ వుంది. ప్రభాస్ బాక్సాఫీస్ కింగ్. అంటూ ప్రభాస్ ని పొగడ్తలతో ముంచెత్తింది. హీరోయిన్ ఎవరైనా, ప్రభాస్ తో వర్క్ చేస్తే ఆయన ఇచ్చే గౌరవానికి ఆయన చూపించే ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే.. ఇప్పుడు ఈ పోస్ట్ చూసిన వారంతా, ప్రభాస్ అందానికి ఫిదా అయిన మరో హీరోయిన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇద్దరు బడా హీరోలతో ..
సినిమాల విషయానికి వస్తే, డార్లింగ్ ప్రభాస్ 2024లో కల్కి తో బ్లాక్ బస్టర్ హిట్టు ని అందుకున్నారు. ప్రస్తుతం కన్నప్ప సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. స్పిరిట్, సలార్ 2, ప్రాజెక్టులు లైన్లో పెట్టారు. ఇక నిధి అగర్వాల్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. డార్లింగ్ ప్రభాస్ తో ది రాజా సాబ్ లో నటిస్తున్నారు. ఇస్మార్ట్ శంక,ర్ భీష్మ, మిస్టర్ మజ్ను, వంటి చిత్రాలతో తెలుగు పరిశ్రమలో తనకంటూ ఒక సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇద్దరు బడా హీరోలతో వరుసగా సినిమాలు చేస్తున్న నిధి ఏ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోనుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు వస్తున్న రాజా సాబ్ సినిమాలో ఆమె పాత్ర డిఫరెంట్ గా ఉంటుందని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. హర్రర్ కామెడీ చిత్రంగా వస్తున్న ఈ సినిమా, బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.