BigTV English

Rk Roja : ఇష్టం లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రోజా.. ఫస్ట్ అవకాశం ఇచ్చింది ఆ పార్టీ నేతే..!

Rk Roja : ఇష్టం లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రోజా.. ఫస్ట్ అవకాశం ఇచ్చింది ఆ పార్టీ నేతే..!

RK Roja : టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ రోజా పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. అందరికి తెలిసే ఉంటుంది. ఒకప్పుడు హీరోయిన్ గా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉండేది. స్టార్ హీరోయిన్ గా అతి తక్కువకాలంలో ఎన్నో సినిమాల్లో నటించింది. హీరోలతో మాత్రమే కాదు కమెడీయన్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె సినిమాల్లో కీలక పాత్రల్లో నటించడమే కాదు. బుల్లితెర పై కూడా తన హవాను కొనసాగిస్తుంది. ఇదిలా ఉండగా రోజా గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. రోజా అసలు పేరు వేరే ఉందట.. అది కేవలం ఆమె కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు.. ఇంతకీ రోజా సెల్వమణి అసలు పేరేంటో మనం తెలుసుకుందాం..


రోజా విద్యాభ్యాసం.. 

సినీ నటి ఆర్కే రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి. ఆమె 1972 నవంబర్ 17న నాగరాజు రెడ్డి, లలితా దంపతులకు చిత్తూరు జిల్లా బాకరావుపేటలో జన్మించారు. ఆమెకు ఇద్దరు అన్నయ్యలు. ఈమె తండ్రి నాగరాజు గారు సారథి స్టూడియోలో పనిచేసేవారు. అందువలన వీరి కుటుంబం హైదరాబాదులోనే ఉండేది. కానీ, రోజూ తిరుపతిలోనే ఉంటూ.. పద్మాలయ మహిళ యూనివర్సిటీలో డిగ్రీ చదివారు.. అప్పట్లో డిగ్రీ అంటే పెద్ద చదువే.. ఆ తర్వాత ఈమె నటన వైపు అడుగులు వేసిందని తెలుస్తుంది..


రోజా సినిమా కెరీర్.. 

రోజా డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు టిడిపి ఎంపీ శివప్రసాద్ ప్రేమ తప్పస్పు అనే సినిమా తీస్తున్నారు. ఆ సినిమాలో రాజేంద్రప్రసాద్ కి జోడిగా రోజాను సెలెక్ట్ చేశారు. అయితే ఈమెకు అప్పటిలో యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ లేదు. పై చదువులు చదుకోవాలనే కోరికతో ఉందట.. వాళ్ళ నాన్న దగ్గరకు ఈ మూవీ ఆఫర్ గురించి తెలిపారు. ఇక ఆయన ఇండస్ట్రీలో అవకాశాలు రావడం కష్టం, వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని చెప్పడంతో ఒక్క సినిమా చెయ్యమనగానే ఒప్పుకుందట..తండ్రి మాటకు ఎదురు చెప్పలేక సినిమాలో హీరోయిన్ గా చేయడానికి ఒప్పుకున్నారు. ఈ సినిమా సమయంలోనే ఛాంబర్తి అనే ఒక తమిళ సినిమాలో హీరోయిన్ కోసం తమిళ దర్శకుడు సెల్వమని రోజాను సెలెక్ట్ చేశారు.. ఆ మూవీ చేస్తున్న సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. రోజా నటించిన సినిమాలు మంచి హిట్ కావడంతో అటు తమిళం, ఇటు తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చాయి. తెలుగులో సీతారత్నం గారి అబ్బాయి, బొబ్బిలి సింహం, భైరవద్వీపం లాంటి అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు. కెరీర్ లో సెట్ కావాలనే ఉద్దేశంతో ఆమె తన పెళ్లిని వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇక పది సంవత్సరాల్లో 100 సినిమాల్లో నటించారు. ఇలా తమిళంలోనూ.. తెలుగులోనూ టాప్ హీరోయిన్గా ఎదిగారు. ఇలా అనుకున్న లక్ష్యాన్ని సాధించిన రోజా.. 2002 ఆగస్టు10న అంగరంగ వైభవంగా తిరుపతి శ్రీనివాసుడు సన్నిధిలోడైరెక్టర్ సెల్వమనిని వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఆమె అటు ఫ్యామిలీ లైఫ్ ను, మూవీస్ చేస్తూ బిజీగా అయ్యారు

రాజకీయ జీవితం..

1999లో తన సినిమా పరిశ్రమకు పరిచయం చేసిన శివప్రసాద్ .. తిరుపతిలో టిడిపి తరఫున ఎంపీగా పోటీ చేయడంతో రోజాని ప్రచారానికి రమ్మన్నారు. ఆమె సరే కొత్తగా ఉంటుందని ఆయనతో పాటు వెళ్లి ప్రచారం నిర్వహించింది. ఈ విషయం చంద్రబాబు దృష్టికి రావడంతో రోజాను పిలిచి.. నీలాంటి అమ్మాయి తెలుగుదేశం పార్టీకి అవసరమని ఆహ్వానించారు. 2004లో నగిరి నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేశారు.. అలా ఆమె ఎమ్మెల్యే నుంచి మంత్రి అయ్యారు. ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోవడంతో కాస్త సైలెంట్ అయ్యింది. ఇక సినిమా అవకాశాలు వస్తే ఆమె సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉందని సన్నిహిత వర్గాల్లో వినిపిస్తున్న టాక్..

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×