Ester Noronha: టాలీవుడ్ హీరోయిన్ ఎస్తర్ నోరోన్హా (Ester Noronha) గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. గతంలో ఎన్నో సినిమాల్లో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మధ్య సినిమాలు కన్నా ఎక్కువగా పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సంచలన విషయాలని షేర్ చేస్తుంది. తాజాగా ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఎస్తర్.. నోయల్ తో విడాకుల పై క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత మరో వీడియోలో ఆమె తెలుగు సినిమాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చిందనే విషయాలను షేర్ చేసుకుంది. అలాగే టాలీవుడ్ డైరెక్టర్ తేజ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది..
ఎస్తర్ కు మూవీ ఆఫర్ ఎలా వచ్చిందంటే..?
హీరోయిన్ ఎస్తర్ గతంలో తెలుగులో పలు సినిమాల్లో నటించింది. తేజ డైరెక్షన్‌లో వచ్చిన ‘1000 అబద్దాలు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఎస్తర్.. ఆ మూవీతో మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ‘భీమవరం బుల్లోడు’, ‘గరం’, ‘జయ జానకి నాయక’, ‘69 సంస్కార్ కాలనీ’ వంటి చిత్రాల్లో నటించారు. అలాగే తులు భాషాలో 2019లో వచ్చిన ఒరిజినల్ ‘కాంతార’ సినిమాలో నటించి అక్కడ మంచి పేరును సంపాదించుకున్నారు. అయితే గతంలో ఓ మూవీకి దర్శకత్వం కూడా వహించారు. ప్రస్తుతం సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు..
AlSo Read : సినిమా స్టేజ్‌లపై రాజకీయాలు వద్దు.. పవన్, చిరులకు బ్రహ్మజీ కౌంటర్..?
డైరెక్టర్ తేజా ప్రేమలో ఎస్తర్..?
తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈమె తెలుగులో మొదటి సినిమా ఆఫర్ గురించి బయటపెట్టింది. తెలుగు లో మొదటి సినిమాకే స్టార్ డైరెక్టర్ తేజా తో చేసింది. షూటింగ్ టైం లో ఆమె సరదాగా ఉండేదని చెప్పింది. అప్పుడు యాంకర్ హీరోయిన్లను తేజా గారు కొట్టేవాళ్ళని ఓ వార్త వినిపించేది. అది నిజమేనా అని అడిగాడు. దానికి ఆమె సమాధానం చెబుతూ.. ఏమో నాకు తెలియదు. నన్ను ఎప్పుడు కొట్టలేదు.. నేను సెట్ లో అందరితో సరదాగా ఉండేదాన్ని. ఓ రోజు అక్కడ వాళ్ళు నువ్వు ఏంటి ఇలా తిరుగుతున్నావ్.. డైరెక్టర్ గారు కొడతారు అన్నారు. ఇప్పుడు నేను సైలెంట్ అయిపోయాను కానీ తేజ గారు నన్ను పిలిచి ప్రామిస్ చేశారు నువ్వు నీ వర్క్ చేస్తున్నావ్ కదా నిన్ను ఎందుకు నేను కొడతాను నాకు ఏమైనా పిచ్చా అనేసి అన్నారు. అప్పుడు నన్ను చూసిన వాళ్లంతా తేజ గారు నిన్ను ప్రేమిస్తున్నారా ఏంది? కూల్ గా ప్రామిస్ చేసి పంపించారు అని అనగానే నాకు అసలు సిగ్గేసింది అని ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ తర్వాత ఆ సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్నందుకువడంతో తెలుగులో పలు సినిమాలు చేశానని చెప్పింది. ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.. ఆయన వయసు ఎక్కడ? నీ వయసు ఎక్కడ? ఏదైనా చెప్తే అర్థం ఉండాలి అనేసి ఆమెపై ఫైర్ అవుతున్నారు.. ఇక ప్రస్తుతం ఈమె ఓ సినిమాలో నటిస్తుంది.