BigTV English

Home Town Trailer : ‘హోం టౌన్’ వర్కౌట్ అయ్యే పనేనా..? ఆహా పద్దతి మార్చుకోవాల్సిందేనా?

Home Town Trailer : ‘హోం టౌన్’ వర్కౌట్ అయ్యే పనేనా..? ఆహా పద్దతి మార్చుకోవాల్సిందేనా?

Home Town Trailer : ఆహా (Aha OTT) ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రాబోతున్న మరో మిడిల్ క్లాస్ డ్రామా ‘హోం టౌన్’ (Home Town). ఇప్పటికే ఈ సిరీస్ కి సంబంధించి ఆహా కొంతమేర ప్రమోషన్ కంటెంట్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు. కానీ ఆ ట్రైలర్ నేను చూసిన తర్వాత ‘హోం టౌన్’ అసలు వర్కౌట్ అయ్యే పనేనా? ఆహా పద్ధతి మార్చుకోవాల్సిందేనా? అని అనుమానాలు తలెత్తుతున్నాయి.


‘హోం టౌన్’ ట్రైలర్ రిలీజ్ 

‘హోం టౌన్’ ట్రైలర్ లో తాజాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలిలో ఉండే ఇబ్బందులు, ఒడిదుడుకులను చూపించారు. ఇక అచ్చమైన తెలంగాణ యాసలో ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పడే పాట్లు, పిల్లల పై చదువుల కోసం ఆ ఇంట్లో జరిగే గొడవలు, చివరికి తల్లి కొడుకు ఒక్కటై బంధాలను బంధుత్వాలను దూరం చేసుకోవడానికి విదేశాలకు పంపడం తప్ప… ఇక్కడ ఉద్యోగాలు లేవా ? అనేలా మారడం కనిపించింది. మొత్తానికి ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తమ కొడుకుని ఫారిన్ పంపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు ? అసలు తండ్రి చెప్పినట్టుగా చదువుకుని విదేశాలకు వెళ్లడం ఇష్టం లేని ఆ కొడుకు ఏం చేశాడు ? అన్నది ఈ సిరీస్ స్టోరీ అనే విషయం ట్రైలర్ చూస్తుంటే స్పష్టంగా అర్థం అవుతుంది.


ఆహా పద్ధతి మార్చుకోవాల్సిందేనా ?

సాధారణంగా ఓటీటీలో ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ లకు ఉండే క్రేజే వేరు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోనూ మధ్యతరగతి కుటుంబాల నేపథ్యంలో వచ్చే సిరీస్ లకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ’90s : ది మిడిల్ క్లాస్ బయోపిక్’ సిరీస్ కి ఎంత క్రేజ్ దక్కిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓటీటీలోనే రికార్డు బ్రేకింగ్ వ్యూస్ తో ఈ సిరీస్ అదరగొట్టింది. అయితే తాజాగా రాబోతున్న ‘హోం టౌన్’ సిరీస్ అచ్చం ఈ సిరీస్ ను పోలినట్టుగా ఉండడం హాట్ టాపిక్ గా మారింది.

‘హోం టౌన్’ సిరీస్ స్టోరీ వేరైనప్పటికి అచ్చం ’90s’ ఫ్యామిలీ సిరీస్ ని తెరపై చూసినట్టుగానే అనిపిస్తోంది. నిజానికి ఈ సిరీస్ ని అనౌన్స్ చేసినప్పటి నుంచి ’90s’  వెబ్ సిరీస్ తో పోలికలు మొదలయ్యాయి. ఇక ట్రైలర్ రిలీజ్ అయ్యాక అవి మరింత ఎక్కువయ్యాయి. ఆ ఎఫెక్ట్ కచ్చితంగా సిరీస్ కు వచ్చే వ్యూస్ పై పడే ఛాన్స్ ఉంటుంది. తాజాగా రిలీజ్ అయిన హోమ్ టౌన్ ట్రైలర్ చూశాక ఆహా కంటెంట్ ని సెలెక్ట్ చేసుకోవడంలో ఫెయిలవుతుందని, ఈటీవీ విన్ తో పోటీ పడడానికే ఇలాంటి కంటెంట్ తో తెరపైకి వస్తోందని నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా ‘హోం టౌన్’ సిరీస్ ఏప్రిల్ 4 నుంచి ఆహా స్ట్రిమింగ్ కాబోతోంది. మరి ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ’90s’ సిరీస్ కి నిర్మాతగా వ్యవహరించిన నవీన్ మేడారం నిర్మాణంలోనే హోమ్ టౌన్ సిరీస్ రూపొందుతుంది. అలాగే ’90s’ సిరీస్ కు సంగీతం అందించిన సురేష్ బొబ్బిలి దీనికి కూడా సంగీతం అందిస్తున్నారు. ఇందులో ఝాన్సీ రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

 

Tags

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×