Hrithik Roshan: సినీ ఇండస్ట్రీలో ఎన్నో నిర్మాణ సంస్థలు భారీ బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ పాన్ ఇండియా స్థాయిలో తమ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థలలో హోంభలే (Hombale)నిర్మాణ సంస్థ ఒకటి. ఈ నిర్మాణ సంస్థ నుంచి ఇప్పటికే కేజిఎఫ్, కాంతార, సలార్ వంటి సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా ఈ నిర్మాణ సంస్థ నుంచి భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తోంది. అయితే ఈ నిర్మాణ సంస్థలో తదుపరి చేయబోయే సినిమాల కోసం ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ (Hrithik Roshan)సైతం ఒప్పందాలను కుదుర్చుకున్నారని తెలుస్తోంది. ఇలా హోంభలే నిర్మాతలతో హృతిక్ రోషన్ ఒప్పందానికి అంగీకరించడంతో ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ అధికారకంగా తెలియజేస్తూ తమ నిర్మాణ భాగస్వామ్యంలోకి హృతిక్ రోషన్ కు సాదర స్వాగతం పలుకుతూ అధికారక పోస్టర్ విడుదల చేశారు.
హోంభలే సినిమాటిక్ యూనివర్స్…
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న హృతిక్ రోషన్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలాంటి స్టార్ హీరో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేయాలన్న ఉద్దేశంతోనే హోంభలే వారితో భాగస్వామ్యం కుదుర్చుకున్నారని తెలుస్తోంది. హోంభలే సినిమాటిక్ యూనివర్స్ లోకి హృతిక్ రోషన్ రావటంతో హోంభలే నిర్మాతలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ నిర్మాణ సంస్థతో హృతిక్ రోషన్ భాగస్వామ్యం కావడంతో ఆయన కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఈ ఒప్పందంపై హృతిక్ రోషన్ స్పందిస్తూ… తాను గత కొంతకాలంగా హోంభలే నిర్మాణ సంస్థ నుంచి వచ్చే సినిమాలను చూస్తున్నానని చాలా విభిన్నమైన కథలకు నిలయంగా ఈ నిర్మాణ సంస్థ ఉందని తెలిపారు.
గట్టిగానే ప్లాన్ చేస్తున్నారుగా..
ఇలాంటి ఒక గొప్ప నిర్మాణ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకొని నా ప్రేక్షకాభిమానులకు సినిమాటిక్ అనుభవాన్ని అందించడానికి తాను కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నానని తెలియజేశారు. ఇలా ఈ నిర్మాణ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నందుకు హృతిక్ రోషన్ కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. హోంభలే నిర్మాణ సంస్థలో ఇప్పటికే భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. సలార్ 2, కే జి ఎఫ్ ఫ్రాంచైజీ, కాంతార ఫ్రీక్వెల్ సినిమాల నిర్మాణంలో ఇకపై హృతిక్ రోషన్ ఇకపై భాగస్వామ్యం కాబోతున్నారు. అదేవిధంగా ఈ ఇద్దరి భాగస్వామ్యంలో బాలీవుడ్ స్టార్ హీరోతో కూడా ఓ భారీ బడ్జెట్ సినిమాను గట్టిగానే ప్లాన్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఇక హృతిక్ రోషన్ కూడా ఒకవైపు వరుస సినిమాలలో నటిస్తున్నారు. త్వరలోనే ఈయన హీరోగా నటించిన వార్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు ఎన్టీఆర్ కూడా కీలక పత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.