Bayya Sunny Yadav: బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారంటూ కొందరు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్లపై పోలీసులు, అధికారులు సీరియస్‌గా ఉన్నారు. అలా ఇప్పటికే ఆ యాప్స్‌ను ప్రమోట్ చేసిన పలువురు ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదయ్యాయి. అందులో ఒక ఇన్‌ఫ్లుయెన్సరే బయ్యా సన్నీ యాదవ్. ఒక మోటో రైడర్‌గా సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకున్న సన్నీ.. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తూ కోట్లు సంపాదించాడంటూ తనపై ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా నా అన్వేషణ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఫేమస్ అయిన యూట్యూబర్ అన్వేష్.. సన్నీ యాదవ్‌కు కోట్ల ఆస్తులు ఉన్నాయంటూ ఆరోపణలు చేశాడు. దానిపై సన్నీ యాదవ్ తమ్ముడు సీరియస్‌గా స్పందించాడు.
ప్రమోషన్స్ ఆపేశాడు
బయ్యా సన్నీ యాదవ్ (Bayya Sunny Yadav) ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వక ముందే తన ఫ్యామిలీ వివిధ వ్యాపారాల్లో సెటిల్ అయిపోయింది. తన తండ్రి కష్టపడి మెడికల్ షాప్ పెట్టుకున్నాడని, అందులో తన అన్నకు ఏమీ సంబంధం లేదని తన తమ్ముడు చెప్పుకొచ్చాడు. ‘‘మా అన్నయ్య యూట్యూబ్‌లో ఇంత ఫేమస్ అవుతాడని ఎవరూ ఊహించలేదు. అదృష్టంకొద్దీ అయిపోయాడు. ఇంటి నిర్మాణంలో మా అన్నయ్య డబ్బులు ఏమీ లేవు. ఆయన కొంచెం సపోర్ట్ ఇవ్వగలడేమో కానీ మొత్తం ఇల్లు కట్టించలేడు కదా.. అన్నయ్య సంపాదించుకున్న డబ్బులు ఆయనకే సరిపోతాయి. రైడింగ్‌కే చాలా ఖర్చు అవుతుంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ఆపేస్తా అని మా అన్నయ్య ఎప్పుడో చెప్పాడు’’ అని చెప్పుకొచ్చాడు.
అన్వేష్‌పై కేసులు
‘‘ఈ విషయంలో అందరూ అన్వేష్ (Anvesh) వర్షనే వింటున్నారు. మా వర్షన్ కూడా వినాలి. అతడు ఇండియాకు రావట్లేదు. ఎందుకంటే అన్వేష్‌పై కూడా ఎఫ్ఐఆర్ ఉంది. అయిదేళ్ల నుండి ఇండియాకు రాకుండా ట్యాక్స్ కడుతున్నా అంటున్నాడు. ట్యాక్స్ కడితే సరిపోదు కదా.. ఇండియాకు ఎందుకు రావట్లేదని తనను కూడా ప్రశ్నించాలి. ఫ్యామిలీని దొంగచాటుగా వేరే దేశాల్లో ఎందుకు కలుస్తున్నాడు? వాడు చెప్పింది కరెక్టా కాదా అని ఎంక్వైరీ చేయాలి. వాడు వీడియోల్లో నోటికి ఏదొస్తే అదే చెప్తుంటాడు. అమ్మాయిలతో అసభ్యకరమైన వీడియోలు చేస్తాడు. అన్వేష్‌పై వైజాగ్‌లో ఎఫ్‌ఐఆర్ ఉంది. వాడికి పెళ్లయ్యింది, విడాకులు అయ్యాయి. ఈ విషయాలు ఇంకా బయటపడలేదు’’ అంటూ అన్వేష్‌పై సీరియస్ అయ్యాడు సన్నీ యాదవ్ తమ్ముడు.
Also Read: బెట్టింగ్‌లో వీడే అతిపెద్ద తిమింగలం.. ఎన్ని కోట్లు సంపాదించాడంటే.?
వాళ్లు చేసిన కుట్ర
‘‘మా అన్నయ్య ఎదుగుదల చూడలేక తోటి యూట్యూబర్స్, రైడర్స్ కూడా ఈ కుట్రకు పాల్పడి ఉండవచ్చు. ఆయన ఒక్కసారి రైడ్‌కు వెళ్తే అస్సలు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వడు. ఇన్‌స్టాగ్రామ్‌లోనే అప్డేట్స్ చూసుకోమంటాడు. ఈ విషయం పోలీసులకు చెప్పినా నమ్మట్లేదు. అన్నయ్య ఇండియాకు రాగానే ముందుగా ఎఫ్ఐఆర్‌పై దృష్టిపెడతాం. మేము కూడా లీగల్ మార్గంలోనే వెళ్తాం. ఆయన ఎప్పుడు ఇండియాకు వస్తాడో చెప్పలేం. రెండు రోజుల్లో రావచ్చు, వారం పట్టొచ్చు, పదిరోజుల్లో రావచ్చు’’ అంటూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పా తన అన్నయ్య చేసిన తప్పు ఇంకేమీ లేదంటూ తనకు సపోర్ట్‌గా మాట్లాడాడు బయ్యా సన్నీ యాదవ్ తమ్ముడు.