Imax: ఇటీవల కాలంలో సినిమాలను పెద్ద స్క్రీన్ లపై చూడటానికి అభిమానులు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఒకానొక సమయంలో హైదరాబాద్లో ఐమాక్స్(IMax) ఫార్మాట్ లో సినిమాలు చూస్తూ ప్రేక్షకులు ఎంతో అనుభూతి చెందేవారు. అయితే 2014 వ సంవత్సరం నుంచి ఈ ఐమాక్స్ ఫార్మాట్లో సినిమాలను పూర్తిగా నిలిపివేశారు. దీంతో అభిమానులు ఒక విధమైన అనుభూతిని కోల్పోయారని చెప్పాలి. అయితే సినీ అభిమానులకు ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ (Suniel Narang)శుభవార్తను తెలిపారు.
హైదరాబాద్ కు వచ్చేస్తున్న ఐమాక్స్…
ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తిరిగి హైదరాబాద్ కు ఐమాక్స్ రాబోతుందని తెలియజేశారు. హైదరాబాద్లోని హకీంపేట్ లో సరికొత్త ఐ మ్యాక్స్ స్క్రీన్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఈయన ప్రకటించారు. ఇది రెండు సంవత్సరాలకు పూర్తీ కాబోతుందని సునీల్ నారంగ్ ప్రకటించడంతో మహేష్ బాబు(Mahesh Babu) అభిమానులు ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు ఎస్.ఎస్ రాజమౌళి (S.S.Rajamouli)దర్శకత్వంలో భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఐమాక్స్ స్క్రీన్ పై మహేష్ సినిమా…
ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి మరో రెండు సంవత్సరాలు సమయం పడుతుంది. అంటే ఈ సినిమా విడుదల అయ్యే సమయానికి ఐమాక్స్ స్క్రీన్ కూడా సిద్ధంగా ఉంటుంది కనుక ఈ సినిమాని ఐమాక్స్ స్క్రీన్ పైనే విడుదల చేస్తారని అభిమానులు భావిస్తున్నారు. మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రాబోయే ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్స్ మూవీగా రాబోతోంది. ఇక రాజమౌళి ఈ చిత్రాన్ని ఐమాక్స్ ఫార్మాట్లో రూపొందించి హైదరాబాద్‌లోని కొత్త ఐమాక్స్ స్క్రీన్‌లో ప్రీమియర్ అయ్యే మొదటి తెలుగు సినిమాగా మహేష్ బాబు సినిమా నిలిచిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
రాజమౌళి ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈయన దర్శకత్వంలో వచ్చిన బాహుబలి, RRR సినిమాలు ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. ఈ రెండు సినిమాల తర్వాత మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్లో చేయబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ఇటు మహేష్ అభిమానులకు కూడా ఎంతో స్పెషల్ అని చెప్పాలి. ఇక రాజమౌళి ఈ సినిమాని ఐమాక్స్ స్క్రీన్ పై రిలీజ్ చేయడానికి ఇదే మంచి సమయమని అభిమానులు కూడా భావిస్తున్నారు.. మరి మహేష్ బాబు ఫ్యాన్స్ కోరుకున్నట్టు రాజమౌళి ఈ చిత్రాన్ని ఐమాక్స్ ఫార్మాట్ లో ఐమాక్స్ స్క్రీన్ పై రిలీజ్ చేస్తారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం మహేష్ బాబు ఈ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈ చిత్రం భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్లు కూడా పనిచేస్తున్నారంటే ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో స్పష్టమవుతుంది. ఇక ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) నటిస్తున్న విషయం తెలిసిందే.