BigTV English

Donald Trump – India : అమెరికాకు ఇండియా భయపడాలా? ఆ దేశం సపోర్ట్ లేకపోతే ఏమవుతుంది?

Donald Trump – India : అమెరికాకు ఇండియా భయపడాలా? ఆ దేశం సపోర్ట్ లేకపోతే ఏమవుతుంది?

Donald Trump – India : ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఇతర దేశాలపై బెదిరింపులు పెరిగిపోయాయి. చీటికిమాటికి.. పన్నులు పెంచేస్తాం, దిగుమతులు ఆపేస్తాం అంటూ పన్నులతో దబాయిస్తున్నారు. తమ మాట వినకుంటే.. అమెరికా నుంచి ఎలాంటి సాయం ఆశించవద్దని, కష్టకాలంలోనూ ఆదుకోమంటూ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. అమెరికా మొదటి నుంచి అంతర్జాతీయంగా తన పలుకుబడి, రాజకీయ, సైనిక ఆధిపత్యం కొనసాగించేందుకు మిత్ర దేశాలకు అనేక సాయాలు చేస్తూ ఉంటుంది. తన ప్రత్యర్థిలను ఎదగకుండా చేసేందుకు అనేక ఎత్తులు అనుసరిస్తుంది. కానీ.. ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత మిత్రుడైనా, శత్రువైనా ఒకే తీరుగా వ్యవహరిస్తున్నారు. దాంతో.. ట్రంప్ దూకుడు, ముందూవెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాల కారణంగా ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోననే కంగారు పెరిగిపోతుంది. ముఖ్యంగా.. భారత్ పై పన్నుల రాజు అంటూ కామెంట్లు చేస్తున్న ట్రంప్.. ఉన్నట్లుండి మన దేశానికి సాయం నిలిపివేస్తే ఏమవుతుంది, దేశం ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే చర్యలు, ఉహాగానాలు వ్యక్తం అవుతున్నాయి.


వాస్తవానికి మనదేశంలో అమెరికాను ఉన్న వ్యూహాత్మక, రక్షణాత్మక దౌత్యం కారణంగా మనతో విరోధం పెంచుకునే అవకాశాలు లేవు. కాదని.. ట్రంప్ ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకున్నా.. అప్పటికప్పుడు మనకు వచ్చే నష్టం లేదంటున్నారు ఆర్థిక నిపుణులు. ఆర్థికంగా, వ్యూహాత్మకంగా తాత్కాలికంగా కొన్ని సవాళ్లు ఎదురుకావచ్చు కానీ, దేశం సంక్షోభంలో కూరుకుపోయేంత భారీ కుదుపు ఉండవని చెబుతున్నారు. ఎందుకంటే.. గత దశాబ్ద కాలంలో భారత్ అనేక దేశాలతో వాణిజ్య లోటును భర్తీ చేసుకుంటూ, ఎగుమతుల నిష్పత్తిని భారీగా పెంచుకుంటూపోతుంది. అయితే.. విభాగాల వారీగా పరిశీలిస్తే ఎలా ఉంటుందన్నది ఆసక్తికర విషయం.

స్వాతంత్ర్యం సిద్ధించినప్పటి నుంచి అనేక పరిశోధనా, సాంకేతికత సంస్థల్ని నెలకొల్పుకున్న భారత్.. అనేక విషయాల్లో స్వయం సమృద్ధి సాధిస్తూ వచ్చింది. నేడు మిగతా వర్థమాన దేశాలతో పోల్చితే… భారత్ శరవేగంగా వృద్ధి రేటు సాధిస్తోంది. ఇప్పుడు కూడా పశ్చిమాసియా, యూరోప్ దేశాలు తీవ్ర ఆర్థిక మాంద్యం, యుద్ధ సంక్షోబాల్లో చిక్కుకుని అభివృద్ధి రేటులో వెనుకబడ్డాయి. కానీ భారత్ మాత్రం 2024-25లో 6.4% వృద్ధి రేటును సాధించగా, అంతకు క్రితం ఏడాది 2023-24లో 8.2% శాతం వృద్ధి సాధించింది. ఈ పరిస్థితుల్లో ట్రంప్ సాయం నిలిపి వేస్తే.. భారత్ తన ఆర్థిక వ్యవస్థ, రక్షణ రంగాల్ని కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉన్నాయంటున్నారు.


1. ఆర్థిక ప్రభావం

ట్రేడ్ : అంతర్జాతీయంగా అగ్రగామిగా ఉన్న అమెరికాతో భారత్ కు బలమైన వాణిజ్య సంబంధం ఉంది. కానీ.. మన ఎగుమతులు ఆ ఒక్కదేశానికే కాదు.. అరబ్ ఎమిరేట్స్ తో $28.8 బిలియన్ డాలర్లు, చైనాతో $18.1 బి.డా, జర్మనీతో $15 బి.డా, యూకే దేశంతో $14.4 బిలియన్ డాలర్ల ఎగుమతుల మార్కెట్ ఉంది. అమెరికాతో సంబంధాలు తెగిపోతే.. వేరే దేశాలకు ఎక్స్ పోర్ట్స్ పెంచే అవకాశాలు భారత్ కు ఉంది. పైగా.. భారత్ ఉత్పత్తులపై అంతర్జాతీయంగా మంచి గుర్తింపు, పేరు ఉన్నాయి.

ఐటీ & సేవలు : ట్రంప్ తో విభేధాలు తారాస్థాయికి చేరితే.. ఎక్కువగా ఇబ్బంది పడే రంగాల్లో ఐటీ అండ్ సర్వీసెస్ ముందుంటుంది. ఎందుకంటే.. మన దేశం నుంచి సగానికి పైగా ఐటీ సేవలు అమెరికా, దానితో సంబంధాలున్న సంస్థలకే వెళుతుంటాయి. అయితే.. ప్రస్తుత భిన్న ధృవ ప్రపంచంలో భారత్ ఐటీ మిగతా దేశాలకూ విస్తరిస్తోంది. ముఖ్యంగా.. యునైటెడ్ కింగ్ డమ్, యూరప్, మధ్యప్రాచ్యం, ఆసియాలోని వర్థమాన దేశాలకు విస్తరిస్తున్నాయి.

పెట్టుబడులు : ఇక పెట్టుబడుల విషయానికి వస్తే.. అమెరికా భారత్ కు అతిపెద్ద పెట్టుబడిదారు. కానీ.. ఈ ఏడాది లెక్కల్ని పరిశీలిస్తే.. దేశంలోని ప్రవేశించిన మొత్తం పెట్టుబడుల్లో మారిషస్ (25.0%), సింగపూర్ (23.6%), అమెరికా (9.6%), నెదర్లాండ్స్ (7.4%), జపాన్ (6.1%), యునైటెడ్ కింగ్‌డమ్ (5%) గా ఉన్నాయి. ఇప్పుడు.. అరబ్ ఏమిరేట్స నుంచి భారీగా పెట్టుబడుల ఒప్పందాలు కుదురుతున్నాయి. భారత్ లోని అపార అవకాశాల్ని అందుకునేందుకు వివిధ దేశాలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ తరుణంలో అమెరికా సంస్థలు, వ్యక్తులు భారత్ లో పెట్టుబడుల్ని పెట్టకపోతే.. వారే నష్టపోయే ప్రమాదముంది.

ప్రత్యామ్నాయాలు : గతంలో విదేశాల నుంచి ఇలాంటి బెదిరింపులు వచ్చిన నేపథ్యంలోనే భారత్ “ఆత్మనిర్భర్ భారత్” ద్వారా దేశీయ పరిశ్రమలను బలోపేతం చేయడంపై దృష్టి సారించింది. ఆ కార్యక్రమాన్ని మరింత భారీగా చేపట్టి, కొత్త పరిశ్రమల స్థాపన, నూతన సాంకేతికతల్ని అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుందంటున్నారు నిపుణులు. BRICS దేశాలతో కొత్త వాణిజ్య సంబంధాలు ఏర్పరచుకోవడం ద్వారా భారత్ ముందుకు సాగగలదని అభిప్రాయ పడుతున్నారు.

2. రక్షణ & సైనిక రంగం

ఆయుధాలు దిగుమతులు : వాస్తవానికి సైన్యానికి కావాల్సిన ఆయుధాల తయారీ, అభివృద్ధిలో భారత్ అనుకున్నంత వేగంగా స్వయం సమృద్ధి సాధించ లేదు. దీంతో.. భారత్ అమెరికా నుంచి పెద్ద ఎత్తున రక్షణ సామగ్రిని కొనుగోలు చేస్తుంది. కానీ.. అక్కడి నుంచి మాత్రమే కాదు. రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయిల్‌ల నుంచి కూడా ఆయుధాలను పొందుతోంది. ఇటీవల.. భారత్ దిగుమతి చేసుకున్న అత్యాధునిక్ రఫెల్ జెట్లను ఫ్రాన్స్ నుంచి ప్రత్యేకంగా తయారీ చేపించుకుని, కొనుగోలు చేసింది. ఈ కారణంగా.. అమెరికా ఆయుధాలు రాకున్నా.. భారత్ రక్షణ రంగానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదని అంటున్నారు.

స్వయం సమృద్ధి : భారత్ స్వతహాగా రక్షణ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంటోంది. ఇందులో భాగంగా.. ఏటా బడ్జెట్ కేటాయింపులు భారీగా కేటాయిస్తుండగా, రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థలు సైతం చెప్పుకోదగ్గ స్థాయిలోనే రక్షణ ఉత్పత్తుల్ని ఆవిష్కరిస్తున్నాయి. భారత్ దేశీయంగా తయారు చేసుకున్న తేజస్ యుద్ధ విమానాలు, మిత్ర దేశాలతో కలిసి అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణులు, ఐఎన్ఎస్ విక్రాంత్ విమాన వాహక నౌక.. మన స్వయం సమృద్ధికి కొన్ని ఉదాహరణలు.
వ్యూహాత్మక మార్పులు : అమెరికా మద్దతు తగ్గినంత మాత్రనా.. భారత్ ప్రపంచంలో ఒంటరిగా మిగిలిపోతే అవకాశం లేదు. అంతర్జాతీయ వేదికలపై భారత్ నెరుపుతున్న దౌత్యం కారణంగా, మన చరిత్ర కారణంగా.. రష్యా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్‌తో వంటి శక్తివంతమైన దేశాలతో సజావుగానే అంతర్జాతీయ దౌత్యాన్ని నడిపించవచ్చని అంటున్నారు.

3. జియోపాలిటికల్ ప్రభావాలు

చైనా అంశం : ప్రస్తుతం ఆసియాలో ఆధిపత్యం కోసం చైనా, భారత్ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ దశలో చైనా అభివృద్ధి అమెరికాకు కంటగింపుగా మారింది. ఆ దేశాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టేందుకు వీలుందో.. అన్ని రకాలుగా పతనం చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇందులో భాగంగానే.. చైనాకు సరిహద్దుల్లో ఉన్న అమెరికా మిత్ర దేశాలకు నిత్యం సాయంగా నిలుస్తుంది. ముఖ్యంగా.. బలమైన భారత్ సాయం అమెరికాకు కావాల్సి ఉంటుంది. ఒకవేళ.. మనతో వైరం వచ్చి.. చైనాకు ట్రంప్ సపోర్టుగా నిలిస్తే.. భవిష్యత్త్ లో అమెరికాను నమ్ముకుని ఎవరూ స్నేహం చేసే అవకాశాలు లేవు. పైగా.. అంతర్జాతీయ ఆర్థిక రంగంలో అమెరికాకు ప్రత్యమ్నాయాన్ని మిగతా దేశాలు అన్వేషిస్తాయి.

QUAD & ఇండో-పసిఫిక్ : అమెరికా లేకుండా భారత్, జపాన్, ఆస్ట్రేలియా, ఆసియన్ దేశాలతో మరింతగా కలిసి పని చేయవలసి ఉంటుంది.
రష్యా & BRICS : భారత్ తన అంతర్జాతీయ వ్యూహాలను మార్చుకుని, రష్యా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా వంటి దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవచ్చు. ఆయా దేశాలతో దౌత్యపరమైన, వాణిజ్యపరమైన సంబంధాలను కొత్త శిఖరాలకు చేర్చే అవకాశం ఉంటుంది.

4. సాంకేతికత & ఇన్నోవేషన్

భారత్ లోని స్టార్టప్‌లు, ఐటీ సంస్థలు.. అమెరికాకు చెందిన గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్ వంటి కంపెనీల భాగస్వామ్యంపై ఆధారపడుతున్నాయి. ఈ స్థితిలో భారత్ ఈ రంగంలో వేగంగా స్వయం సమృద్ధి సాధించాల్సి ఉంటుంది. తన స్వంత టెక్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేసుకోవాలి, యూరప్‌తో సహకారం పెంచుకోవాలడంతో పాటు.. పరిశోధన & అభివృద్ధికి ఇంకా గట్టిగా ఇక్కడి సంస్థలు, ప్రభుత్వాలు ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read : Deadly trend : వామ్మో ఇదేం ట్రెండ్ – యువకుడి ప్రాణాల మీదకి తెచ్చిన ఛాలెంజ్

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×