Kovai Sarala : సినీ ఇండస్ట్రీలో కొందరి నటన జనాలను బాగా ఆకట్టుకుంటుంది. వారిని జనాలు ఎప్పటికి మర్చిపోలేరు. ఒక మార్క్ తో తమ నటనతో అందరి మనసు దోచుకున్నారు. ఇండస్ట్రీలో స్టార్స్ గా కొనసాగుతున్న కమెడియన్స్లలో కోవై సరళ ఒకరు.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లేడి కమెడీయన్ కోవై సరళ గురించి తెలియని వాళ్లు ఉండరు. 900 లకు పైగా సినిమాలు చేసింది. ఒక్కో సినిమాలో ఒక్కో వెరియేషన్ చూపిస్తూ కామెడీ క్వీన్ అనే టాక్ ను సొంతం చేసుకుంది. తమిళ్, తెలుగు కన్నడ, మలయాళ భాషల్లో నటించింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే ఉత్తమ హాస్యనటి పురస్కారాలను మూడు సార్లు అందుకున్నది. గత కొన్ని సంవత్సరాలుగా తన కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తూ ఎంతోమంది స్టార్ కమెడియన్స్ కి పోటీ ఇచ్చిన ఫిమేల్ కమెడియన్ కోవై సరళ గురించి కొంతమందికి తెలియని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
కోవై సరళ జీవిత విశేషాలు..
కోవై సరళ పుట్టింది, పెరిగింది అంతా తమిళనాడులోనే.. తెలుగు సినిమాలలో స్టార్ కమెడియన్ గా పేరు సంపాదించుకుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్రహ్మానందం – కోవై సరళ కాంబినేషన్ అంటే నవ్వని వారంటూ ఉండరు. కోవై సరళ తెలుగు, తమిళ్ భాషల్లో నటించింది. వందల సినిమాల్లో నటించి అందరి మనసులో చెరగని ముద్ర వేసుకుంది. స్టార్ కమెడీయన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె ఇప్పటికీ కొన్ని సినిమాల్లో నటిస్తుంది. తమిళనాట క్రేజ్ ను అందుకుంది. తెలుగులో కూడా అంతే క్రేజ్ ఉంది. అయితే ఈ జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ప్రస్తుతం ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: ఈరోజు టీవి ఛానెల్లో వచ్చే సినిమాలు.. ఆ ఒక్క సినిమా వెరీ స్పెషల్..
జీవితంలో అన్నీ కష్టాలే..
వృత్తిపరమైన జీవితంలో ఎన్నో సినిమాలలో నటించి ఎంతో సక్సెస్ అయిన కోవై సరళ వ్యక్తిగత జీవితంలో మాత్రం పూర్తిగా ఫెయిల్ అయ్యారని చెప్పాలి. కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని కుటుంబ భారాన్ని తన భుజాల మీద వేసుకుంది. కోవై సరళ ఇంటికి పెద్ద కూతురు కావడంతో తన తోబుట్టువుల బాధ్యతను తీసుకొని వారిని చదివించి వారికి ఓ మంచి జీవితాన్ని ప్రసాదించింది. ప్రస్తుతం ఆమె తోబుట్టువులు ఇతర దేశాలలో స్థిరపడ్డారు.. కానీ వారి జీవితం కోసం కష్టపడిన ఈమె పెళ్లి చేసుకుండా అలానే ఉండిపోయింది. ఈమెకు ప్రస్తుతం వయసు పై పడడంతో అవకాశాలు తగ్గడంతో పాటు తనని పలకరించే వారు కూడా లేరు. ఎవరికైతే ఈమె తన జీవితాన్ని త్యాగం చేసిందో వాళ్లు కూడా తనని పట్టించుకోవడం లేదట. ఈమె నటించిన మూవీస్ జనాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి.. మంచి సినిమాలు చేసి అందరిని అలరించాలని కోరుకుందాం.. ఇలాంటి వాళ్లు ఇండస్ట్రీకి ఎన్నో సేవలు చేస్తూ, సినిమాలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం ఈమె కొత్త సినిమాలను ప్రకటించలేదు..