BigTV English

Raw onions: సమ్మర్‌లో పచ్చి ఉల్లిపాయలు తింటే.. ఇన్ని లాభాలా ?

Raw onions: సమ్మర్‌లో పచ్చి ఉల్లిపాయలు తింటే.. ఇన్ని లాభాలా ?

Raw onions: వేసవిలో పచ్చి ఉల్లిపాయ తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పచ్చి ఉల్లిపాయలో ఉండే పోషకాలు శరీరాన్ని వేడి నుండి రక్షించడమే కాకుండా ఆరోగ్యంగా ఉండటానికి కూడా సహాయపడతాయి. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో పచ్చి ఉల్లిపాయ కూడా సహాయపడతాయి. ఉల్లిపాయలో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు సమ్మర్ లో ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.


ముఖ్యంగా సమ్మర్‌లో.. పచ్చి ఉల్లిపాయ శరీరాన్ని లోపలి నుండి చల్లబరచడమే కాకుండా, ఎండ దెబ్బ నుండి కూడా రక్షిస్తాయి. అందుకే పురాతన కాలం నుండి భారతీయ వంటకాల్లో సలాడ్‌గా పచ్చి ఉల్లిపాయకు ప్రత్యేక స్థానం ఇవ్వబడింది. వేసవిలో పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:


1. హీట్ స్ట్రోక్ నుండి రక్షణ:
వేసవిలో హీట్ స్ట్రోక్ సర్వసాధారణం. ముఖ్యంగా మీరు ఎండలో బయటకు వెళ్ళాల్సి వచ్చినప్పుడు.. పచ్చి ఉల్లి పాయ శరీరాన్ని లోపలి నుండి చల్లగా ఉంచుతుంది. అంతే కాకుండా వీటిలో ఉండే సల్ఫర్ హీట్ స్ట్రోక్ ప్రభావాలను తగ్గించడంలో సహాయ పడతాయి. ప్రతి రోజూ మీరు తినే ఆహారంలో పచ్చి ఉల్లిపాయను జోడించడం వల్ల హీట్‌స్ట్రోక్ నుండి మిమ్మల్ని రక్షించుకోవచ్చు.

2. హైడ్రేషన్ లో సహాయపడుతుంది:
ఉల్లిపాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయపడుతుంది. అదనంగా.. ఇది శరీరం నుండి చెమట ద్వారా కోల్పోయిన ఖనిజాలను కూడా తిరిగి నింపుతుంది. అంతే కాకుండా డీ హైడ్రేషన్ బారిన పడకుండా కూడా కాపాడుతుంది.

3. జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది:
పచ్చి ఉల్లి పాయలో ఉండే ఫైబర్ జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా ఇది మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. వేసవిలో కడుపు సంబంధిత సమస్యలు తరచుగా పెరుగుతాయి. ఇలాంటి పరిస్థితిలో ఉల్లి పాయ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది.

4. చర్మాన్ని కాంతివంతం చేస్తుంది:
యాంటీ ఆక్సిడెంట్లు , విటమిన్ సి సమృద్ధిగా ఉన్న పచ్చి ఉల్లిపాయ చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది. అంతే కాకుండా చర్మాన్ని ప్రకాశవంతంగా , యవ్వనంగా ఉంచుతుంది. ఇది వేసవిలో చర్మంపై వచ్చే టానింగ్ , మొటిమల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

5. రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
పచ్చి ఉల్లి పాయలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి. ముఖ్యంగా వేసవిలో బ్యాక్టీరియా వేగంగా పెరిగే సమయంలో.. ఉల్లిపాయలు తినడం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

Also Read: కూరగాయలు, పండ్లు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే ?

6. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది:

ఉల్లి పాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. అంతే కాకుండా రక్తపోటు సమతుల్యంగా ఉంటుంది. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్లు గుండె జబ్బులను నివారించడంలో సహాయ పడతాయి. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తప్పకుండా ప్రతి రోజు ఉల్లి పాయలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×