Allu Arjun Bail : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న పాన్ ఇండియా హీరోస్ లో అల్లు అర్జున్ ఒకరు. తెలుగులో తనకంటూ ఒక గుర్తింపు సాధించుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపును సాధించాడు. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయింది. పుష్ప సినిమాకి సీక్వెల్ గా రీసెంట్ పుష్ప 2 సినిమా కూడా విడుదలైంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలమైన విజయాన్ని నమోదు చేసుకుంది. త్వరగా వెయ్యి కోట్లు వసూలు చేసిన సినిమాగా రికార్డ్స్ కూడా క్రియేట్ చేసింది. దేశవ్యాప్తంగా ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇకపోతే ఈ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అయింది. ఒకరోజు ముందు చాలాచోట్ల ప్రీమియర్ షోస్ నిర్వహించారు.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో 4వ తారీఖు రాత్రి అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో పాటు ఈ సినిమాను చూడడానికి వెళ్లారు. అక్కడ అనుకోని విధంగా సినిమా చూడడానికి వచ్చిన ఒక ఫ్యామిలీ లో విషాదం చోటుచేసుకుంది. రేవతి అనే ఒక ఆమె తోక్కిసిలాటలో మరణించింది. అలానే తన కుమారుడు ఆసుపత్రి పాలయ్యాడు. దీనిపై ఇప్పటివరకు చిత్ర యూనిట్ తో పాటు అల్లు అర్జున్ కూడా స్పందించాడు. అయితే ఇక తాజాగా పొద్దున్నుంచి మీడియాలో వస్తున్న కథనాలు అన్నిటి గురించి మనకు తెలిసిందే. అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత 14 రోజులపాటు రిమాండ్ విధించినట్లు వార్తలు కూడా వచ్చాయి.
ఇక తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ కు మద్యంతర బెయిల్ లభించింది.అల్లు అర్జున్ కు ఇచ్చింది మధ్యంతర బెయిల్ మాత్రమే.
కేవలం నాలుగు వారాలే మధ్యంతర బెయిల్ ఉంటుంది. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో దాఖలు చేసుకోవాలని హైకోర్టు ఆదేశించినట్లు సమాచారం వినిపిస్తుంది. అర్నబ్ గోస్వామి వర్సెస్ స్టేట్ అఫ్ మహారాష్ట్ర తీర్పు ఆధారంగా బెయిల్ మంజూరు. జైలు సూపరింటెండెంట్‌కు అన్నీ డాక్యుమెంట్స్ ఇవ్వాలని ఆదేశం జారీ చేశారు. తీర్పు కాపీని చదివి అరెస్ట్ వరకు దారి తీసిన పరిణామాలను రికార్డ్ చేశారు న్యాయమూర్తి అని తెలుస్తుంది. వ్యక్తి గత పూచీకత్తుతో హైకోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Also Read : Poonam Kaur – Allu Arjun: బన్నీ అరెస్ట్.. సంచలన ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్ హీరోయిన్..!
ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవన్న కోర్టు. యాక్టర్ అయినంత మాత్రాన సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులను నిరాకరించలేమన్న హైకోర్టు. అల్లు అర్జున్‌కు కూడా జీవించే హక్కు ఉందన్న హైకోర్టు. కేవలం నటుడు కాబట్టే 105(B), 118 సెక్షన్ల కింద నేరాలను అల్లు అర్జున్‌కు ఆపాదించాలా..? రేవతి కుటుంబంపై సానుభూతి ఉంది. అంతమాత్రాన నేరాన్ని నిందితులపై రుద్దలేం. అని హైకోర్టు చెప్పినట్లు తెలుస్తోంది.