Saif AliKhan:బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో.. సెలబ్రిటీల హత్యా బెదిరింపులు ఏ రేంజ్ లో అయితే సంచలనం సృష్టిస్తున్నాయో.. ఇప్పుడు సైఫ్ అలీఖాన్ (Saif AliKhan) పై జరిగిన కత్తి దాడి కూడా అంతే సంచలనం సృష్టించింది. ముఖ్యంగా బాంగ్లాదేశ్ కి చెందిన ఒక వ్యక్తి, సైఫ్ ఇంట్లోకి చొరబడి మరీ సైఫ్ పై కత్తితో దాడి చేయడం అత్యంత దారుణం అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఈ కేసులో రోజుకొక వార్త వెలుగులోకి వస్తోంది. అటు పోలీసులనే కాదు ఇటు ప్రజలను కూడా ఈ వార్తలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఇక అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
సైఫ్ అలీ ఖాన్ పై దాడి..
బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై జనవరి 16వ తేదీన బాంద్రా లోని ఆయన నివాసంలోకి ఆగంతకుడు తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ప్రవేశించాడు. తన భార్య కరీనాకపూర్ (Kareena Kapoor)తో కలిసి 12వ అంతస్తులోని వారి బెడ్రూంలో నిద్రిస్తూ ఉండగా.. అర్థరాత్రి 2:30 గంటల సమయంలో ఇంట్లో అలికిడి వినిపించింది. వెంటనే సైఫ్ పదకొండవ అంతస్తుకి వచ్చాడు. అక్కడ తన పిల్లలు తైమూర్, జహంగీర్ లకు సంరక్షకులుగా ఉన్న వారిపై ఆ ఆగంతకుడు దాడికి పాల్పడ్డాడు. అక్కడికి సైఫ్ రాగానే.. కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో సైఫ్ అలీ ఖాన్ నిరాకరించడంతో ఇష్టం వచ్చినట్లు కత్తితో దాడి చేశాడు. ఆ తర్వాత తోపులాట జరగగా.. సైఫ్ అలీ ఖాన్ సంరక్షకురాలి సహాయంతో ఆగంతకుడుని గదిలోకి నెట్టేసి గడి పెట్టేశారు. ఆ తర్వాత సైఫ్ ను తన ఏడేళ్ల కుమారుడు లీలావతి హాస్పిటల్ కు తీసుకెళ్లారు. వైద్యులు రెండు సర్జరీలు చేసి వెన్నెముకలో ఉన్న కత్తి ముక్కను కూడా తొలగించారు.
కరీనా హస్తం ఉందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు..
ఈ నేపథ్యంలోనే పోలీసులు సీసీ కెమెరాలను జల్లెడ పట్టి మరీ అతడు షరీఫుల్ ఇస్లాం షేహబాజ్ గా గుర్తించి అరెస్టు చేశారు. ఇకపోతే అతడు ఫోన్ పే ఉపయోగించి కొనుగోలు చేసిన పరాటా, వాటర్ బాటిల్ ఆధారంగా థానే లో ఉన్నట్టు గుర్తించి, అతడిని అరెస్టు చేసి, ముంబై కోర్ట్ లో హాజరు పరిచారు. అంతేకాదు ఇటీవల ఇతడికి ఐదు రోజులపాటు పోలీస్ కస్టడీకి ఆదేశించింది కోర్ట్. నిందితుడిని పోలీసులు విచారిస్తూ ఉండగా.. అటు నిందితులు చెప్పిన విషయాలకు, పనిమనిషి , కరీనాకపూర్ చెప్పిన విషయాలకు పొంతనలేదని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట ఆగంతకుడిని రూమ్లో బంధించినట్లు పని మనుషులు చెప్పగా.. మళ్లీ అతను డోర్ తీసుకొని ఎలా పారిపోయాడు. అంతేకాకుండా కరీనా ఘటన రోజు రాత్రి తన భర్తతో పాటే ఇంట్లో ఉంది. అలాగే ఆమె సోదరీ కూడా అదే ఇంట్లో ఉన్నట్లు సమాచారం. అయినా సరే ఏడేళ్ల కొడుకుతో భర్తను ఆసుపత్రికి ఎలా పంపించింది అనే అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఘటన జరిగిన తర్వాత కరీనా మధ్యాహ్నం హాస్పిటల్ కి వెళ్లడం, ఘటన జరిగిన తర్వాత పనిమనిషితో మాట్లాడుతూ టైం పాస్ చేయడం అన్నీ అనుమానాస్పదంగా మారాయి. దీని వెనుక కరీనా హస్తం ఉందా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరొకవైపు భర్తను చంపించాల్సిన అవసరం కరీనాకు ఏముంది? అనే కోణంలో కూడా ఆరాతీస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి పలు అనుమానాలకు దారితీస్తోంది అని చెప్పవచ్చు.