BigTV English

Fraud Flight Attendant: ఫ్రీగా 120 విమాన ప్రయాణాలు.. ఎయిర్‌లైన్స్‌ను 6 ఏళ్ల పాటు చేసిన వ్యక్తి అరెస్ట్

Fraud Flight Attendant: ఫ్రీగా 120 విమాన ప్రయాణాలు.. ఎయిర్‌లైన్స్‌ను 6 ఏళ్ల పాటు చేసిన వ్యక్తి అరెస్ట్

Fraud Flight Attendant| ఈ ప్రపంచంలో అన్నీ ఉచితంగా కావాలనుకునేవారికి కొరత లేదు. అయితే కొందరు మాత్రం ఇలాంటి ఉచితాలు పొందడానికి మోసం చేసేందుకు కూడా వెనుకాడరు. అమెరికాలో అలాంటి వ్యక్తి ఒకరు ఆరు సంవత్సరాల పాటు విమాన సంస్థలను మోసం చేస్తూ.. 120కి పైగా ఉచిత విమాన ప్రయాణాలు చేశాడు.


అతని పేరు టిరాన్ అలెగ్జాండర్, వయసు 35 సంవత్సరాలు. 2018 నుంచి 2024 వరకు అతను అనేక ప్రముఖ అమెరికన్ విమానయాన సంస్థలను తాను ఒక నకిలీ ఫ్లైట్ అటెండెంట్‌గా నటిస్తూ మోసం చేశాడు. ఈ విషయం యునైటెడ్ స్టేట్స్ అటార్నీ ఆఫీస్, సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఫ్లోరిడా వెల్లడించింది.

టిరాన్ అలెగ్జాండర్ ఉద్యోగుల కోసం రిజర్వ్ చేయబడిన వెబ్‌సైట్‌లను ఉపయోగించి, ఉద్యోగులకు ఇచ్చే ఉచిత విమాన టికెట్ సౌకర్యాన్ని దుర్వినియోగం చేశాడు. విమాన సిబ్బందికి ఉచిత ప్రయాణం అనేది విమానయాన రంగంలో ఎప్పటి నుంచో ఉన్న సౌకర్యం, దీన్ని నాన్-రెవెన్యూ (ఆదాయం లేని) ట్రావెల్ అని కూడా అంటారు.


కోర్టు డాక్యుమెంట్ల ప్రకారం.. అలెగ్జాండర్ 2015 నవంబర్ నుంచి ఒక విమానయాన సంస్థలో పనిచేశాడు, కానీ అతను ఎప్పుడూ ఫ్లైట్ అటెండెంట్ లేదా పైలట్ గా పనిచేయలేదు. ఆ సమయంలోనే అతను ఈ ఉచిత విమాన ప్రయాణాల గురించి తెలుసుకున్నాడు. ఆ తరువాత నుంచి అలెగ్జాండర్ నకిలీ గుర్తింపుతో ఉచిత టికెట్లు బుక్ చేసుకున్నాడు. అతనిపై ఇప్పుడు వైర్ ఫ్రాడ్ (మోసపూరిత ఆన్‌లైన్ లావాదేవీలు), నకిలీ గుర్తింపుతో విమానాశ్రయ సురక్షిత ప్రాంతంలోకి ప్రవేశించినట్లు నేరారోపణలు ఉన్నాయి.

కోర్టు డాక్యుమెంట్లలో అమెరికన్ ఎయిర్‌లైన్స్, స్పిరిట్ ఎయిర్‌లైన్స్, యునైటెడ్ ఎయిర్‌లైన్స్, డెల్టా ఎయిర్ లైన్స్, సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ వంటి సంస్థల పేర్లు పేర్కొనబడ్డాయి. అలెగ్జాండర్ ఒకే ఎయిర్‌లైన్స్ కంపెనీకి 34 విమానాల్లో ఉచితంగా ప్రయాణాలు చేశాడు అని నివేదికలో ఉంది. ఇందుకోసం అతను 30 వేర్వేరు ఉద్యోగుల బ్యాడ్జ్ నంబర్లు, నియామక తేదీలను ఉపయోగించాడు. మరో మూడు విమానయాన సంస్థలలో కూడా అతను ఫ్లైట్ అటెండెంట్‌గా నటించి, మొత్తం 120కి పైగా ఉచిత ప్రయాణాలు చేశాడు. కోర్టులో అతను దోషిగా తేలాడు. అయితే శిక్ష ఇంకా ఖరారు కాలేదు.

ఈ నేరాలకు గరిష్ట శిక్షగా, వైర్ ఫ్రాడ్‌కు 20 సంవత్సరాల జైలు శిక్ష, నకిలీ గుర్తింపుతో విమానాశ్రయ సురక్షిత ప్రాంతంలోకి ప్రవేశించడానికి 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంది. ఈ రెండు నేరాలకు గరిష్టంగా మూడు సంవత్సరాల సర్వీస్డ్ రిలీజ్, రూ. 2.15 కోట్ల ($250,000) జరిమానా విధించవచ్చు.

Also Read: విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న మహిళ.. 10 నిమిషాలు లేటు కావడంతో లండన్ ఫ్లైట్ మిస్

ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (టీఎస్ఏ) ఈ తీర్పుపై సంతోషం వ్యక్తం చేసింది. “అలెగ్జాండర్ మోసపూరితంగా బోర్డింగ్ పాస్ సంపాదించి విమానాల్లో ప్రయాణించినప్పటికీ, అతను టీఎస్ఏ యొక్క అన్ని సెక్యూరిటీ ప్రొసీజర్‌లను, అంటే గుర్తింపు పత్రాల తనిఖీ, శారీరక స్క్రీనింగ్‌ లు, ఇతర ప్రక్రియ మొత్తం సజావుగా చేశాడు. అతను ఇతర ప్రయాణికులకు ఎలాంటి హాని కలిగించలేదు,” అని టీఎస్ఏ ఒక ప్రకటనలో తెలిపింది. “ప్రయాణికుల భద్రత కోసం మేము అంకితభావంతో ఉన్నాము. విమానయాన నియమాలను ఉల్లంఘించే వారిని శిక్షించడంలో మేము సహకరిస్తాము,” అని పేర్కొంది.

Related News

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Big Stories

×