BigTV English

Gautham Menon about ‘Dhruva Nakshatra’: కుటుంబాన్ని కూడా ప్రభావితం చేసింది.. ‘ధృవ నక్షత్రం’ చిత్రంపై స్పందించిన గౌతం మేనన్‌

Gautham Menon about ‘Dhruva Nakshatra’: కుటుంబాన్ని కూడా ప్రభావితం చేసింది.. ‘ధృవ నక్షత్రం’ చిత్రంపై స్పందించిన గౌతం మేనన్‌

Gautham Menon reacts about 'Dhruva Nakshatra'


Gautham Menon reacts about ‘Dhruva Nakshatra’: గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వంలో విక్రమ్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘ధృవ నక్షత్రం’. ఈ సినిమా 2013 నుంచి వాయిదా పడింది. అది ఆర్థిక సమస్యలు, మరిన్ని వ్యక్తిగత సమస్యలను ఎదుర్కొంది. ఈ చిత్రం ఇంకా థియేటర్లలో విడుదల కోసం ఎదురు చూస్తోంది. దీనిపై ఈ సినిమా దర్శకుడు స్పందించాడు.

ఇటీవల గౌతమ్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనతోపాటు చిత్రబృందం ‘ధృవ నక్షత్రం’ విడుదల కోసం ఎదుర్కొన్న ఒత్తిడి, అడ్డంకుల గురించి తలుచుకుంటే చాలా హృదయవిదారకంగా ఉంటుందన్నాడు. తను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం విడుదలను చివరి క్షణంలో రద్దు చేయడం ఎలా అనిపించిందో గౌతం వెల్లడించాడు.


Read More: లీప్ ఇయర్‌.. ఫిబ్రవరి 29న బర్త్ డే సెలబ్రేట్ చేసుకునే తారలు వీరే..

ఈ విషయం అతని కుటుంబాన్ని కూడా ప్రభావితం చేసిందన్నాడు. ఈ చిత్రం గురించి ఎప్పుడూ నా భార్య ఆలోచిస్తూనే ఉంటుంది అందుకే నాకు ఎక్కడికైనా వెళ్లిపోవాలనిపిస్తోంది అన్నాడు. సినిమా అనుకున్న విధంగా థియేటర్లలోకి రాకపోగా, కొత్త పెట్టుబడిదారులకు సమాధానం చెప్పాల్సి రావడం వల్ల మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నాడు.

త్వరలో థియేటర్లలోకి రానున్న తన కొత్త చిత్రం ‘జాషువా ఇమై పోల్ కాఖా’పై గౌతమ్ ఆశలు పెట్టుకున్నట్లు తెలిపాడు. జాషువా కంటే ముందే ‘ధృవ నక్షత్రం’ విడుదల చేయాలని చాలా ప్రయత్నించినా కుదరలేదని  బాధ పడ్డాడు. 2017లో విడుదల చేయాలని భావించిన కొన్ని ఆర్ధిక ఇబ్బందులతో సినిమా విడుదల నిలిచిపోయిందని అన్నాడు.

Read More: ఆ సినిమాకు సగం రెమ్యూనరేషన్ మాత్రమే అడిగా.. మిగతాది..: వరుణ్ తేజ్

‘ధృవ నచ్చతిరమ్’ 2023 నవంబర్ 24న విడుదల చేయాలనుకున్నారు. అయితే సినిమా సజావుగా విడుదల కావాలంటే ఉదయం 10:30కి రూ. 2.40 కోట్లు చెల్లించాలని చిత్రనిర్మాతకి ముందురోజు కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అందువల్లే సినిమా విడుదల వాయిదా పడింది. ఈ యాక్షన్-ప్యాక్డ్ మూవీలో విక్రమ్ ప్రధాన పాత్రలో నటించగా, వినాయకన్, రీతూ వర్మ, రాధిక శరత్‌కుమార్, సిమ్రాన్, మాయ ఎస్ కృష్ణన్, పార్తిబన్ సహాయక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ స్వరాలు సమకుర్చాడు.

Tags

Related News

Alekhya Chitti pickles: పిక్‌నిక్‌కి వెళ్లి పికిల్స్ తినడం ఏంట్రా… మీ ప్రమోషన్స్ పాడుగాను!

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

Big Stories

×