BigTV English

Varun Tej: ఆ సినిమాకు సగం రెమ్యూనరేషన్ మాత్రమే అడిగా.. మిగతాది..: వరుణ్ తేజ్

Varun Tej: ఆ సినిమాకు సగం రెమ్యూనరేషన్ మాత్రమే అడిగా.. మిగతాది..: వరుణ్ తేజ్

Varun tej new movie update


Varun tej new movie update(Tollywood news in telugu): మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం భారీ హిట్టు కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగా వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. గతేడాది ‘గాండీవధారి అర్జున’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది.

దీంతో వరణ్ తేజ్ తన తదుపరి చిత్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఎలాగైనా ఈసారి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాలనే లక్ష్యంతో మరో చిత్రాన్ని చేస్తున్నాడు. వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఈ మూవీ షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుని రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.


ఈ మూవీలో వరుణ్‌కు జోడీగా మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ఇద్దరు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్స్‌గా కనిపించనున్నారు. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్స్ మూవీపై మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి.

యుద్ధ విమానాలతో ఫుల్ యాక్షన్ సహా ఈ మూవీలో దేశభక్తిని హైలెట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా పాకిస్థాన్‌పై భారత్ చేసిన వైమానిక దాడుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రెనైసెన్స్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

READ MORE: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడే సందడి..40కి పైగా కొత్త..

మిక్కీజే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే నెల మార్చి 1న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతుంది. తెలుగు, హందీ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రమోషన్లను వేగవంతం చేసింది. పలు ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాకి సంబంధించిన విషయాల్ని పంచుకుంటోంది.

ఇక ఈ ప్రమోషన్లలో భాగంగా తాజా ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాపై తాను ఫుల్ కాన్పిడెన్స్‌గా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఈ మూవీ అందరికీ బాగా కనెక్ట్ అవుతుందని కూడా తెలిపాడు. అలాగే తన బాబాయ్, పవన్ కళ్యాణ్‌తో ఈ మూవీ ట్రైలర్‌ను ఐదు సార్లు చూశానని.. ఆయన ఎంతో ప్రశంసించారని కూడా చెప్పారు.

కాగా వరుణ్ చేసిన గత మూవీ అంతరిక్షం గురించి కూడా మాట్లాడాడు. సినిమా ఫ్లాపులతో ఒక్కోసారి మార్కెట్ తగ్గినా.. కంటెంట్ బాగున్న సినిమాలే చేస్తానని చెప్పారు. అంతేకాకుండా అంతరిక్షం సినిమా కోసం సగం రెమ్యూనరేషన్ మాత్రమే తనకు ఇవ్వాలని నిర్మాతలను అడిగానని తెలిపారు.

READ MORE: ‘మ్యాడ్’ మూవీకి సీక్వెల్‌‌.. షూటింగ్ డేట్ ఫిక్స్..!

మిగిలిన డబ్బును సినిమా కోసం ఉపయోగించాలని నిర్మాతలకు తాను చెప్పినట్లు తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇకపోతే ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే రెమ్యూనరేషన్ తీసుకోకుండా అయినా.. సినిమాలు చేస్తానని అన్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×