Hair Mask: జుట్టు ఒత్తుగా, నల్లగా ఉండే మరింత అందంగా కనిపిస్తారు. పొడవాటి జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ ప్రస్తుతం మారుతున్న జీవనశైలి కారణంగా జుట్టు రాలే సమస్యలను చాలా మంది ఎదుర్కుంటున్నారు. మరి ఇలాంటి సమయంలోనే హెయిర్ మాస్క్ ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఈ మాస్క్‌లు జుట్టుకు లోతైన పోషణను అందిస్తాయి. అంతే కాకుండా తేమను అందిస్తాయి. జుట్టును ఆరోగ్యంగా, మృదువుగా, మెరిసేలా చేస్తాయి. కొన్ని రకాల హెయిర్ మాస్కును రాత్రి పూట జుట్టుకు అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
రాత్రిపూట హెయిర్ మాస్క్‌లు అప్లై చేయడం వల్ల నిర్జీవమైన జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది ఈ హెయిర్ మాస్క్‌లు జుట్టును మాయిశ్చరైజ్ చేయడానికి, కండిషన్ చేయడానికి పని చేస్తాయి. వీటిని జుట్టుకు పట్టించి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం కడిగేయాలి. ఒత్తైన జుట్టు కోసం ఎలాంటి హెయిర్ మాస్కులను ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
హెయిర్ మాస్క్‌ని అప్లై చేయడం వల్ల వెంట్రుకలు చిట్లకుండా ఉంటుంది. అంతే కాకుండా ఈ హెయిర్ మాస్క్‌లు జుట్టును సిల్కీగా, మృదువుగా చేస్తాయి.
రాత్రిపూట హెయిర్ మాస్క్ వాడటం వల్ల జుట్టుకు పోషణ లభిస్తుంది. నిర్జీవమైన జుట్టు సమస్యను ఎదుర్కోవడం కొన్నిసార్లు సవాలుగా ఉంటుంది. అలాంటి సమయంలో ఈ మాస్క్‌లు జుట్టుకు లోతైన పోషణతో పాటు తేమను అందిస్తాయి.
కొబ్బరి నూనె , అలోవెరాతో మాస్క్:
ఈ హెయిర్ మాస్క్ జుట్టును లోతుల నుండి తేమగా చేస్తుంది. ఈ హెయిర్ ప్యాక్ తయారు చేయడం కోసం ఒక బౌల్ లో 3-4 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెతో పాటు తగినంత అలోవెరా జెల్ తీసుకుని మిక్స్ చేయండి, తర్వాత దీన్ని జుట్టు పట్టించి సున్నితంగా మసాజ్ చేయండి. రాత్రిపూట షవర్ క్యాప్ ధరించి, ఉదయం తేలికపాటి షాంపూతో కడగాలి.
పెరుగు, తేనెతో హెయిర్ మాస్క్:
ఈ హెయిర్ మాస్క్ జుట్టును లోతుగా పోషించి, మృదువుగా మారుస్తుంది. అంతే కాకుండా మెరిసేలా చేస్తుంది . అందుకే 2 చెంచాల పెరుగు, 1 చెంచా తేనె కలిపి జుట్టుకు పట్టించాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయం సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.
అరటి, ఆలివ్ ఆయిల్ మాస్క్:
ఈ హెయిర్ మాస్క్ జుట్టును లోతుగా కండిషన్ చేస్తుంది. ఈ హెయిర్ మాస్కును తయారు చేయడం కోసం పండిన అరటిపండును మెత్తగా చేసి, దానికి ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టుకు పట్టించి, రాత్రంతా అలాగే ఉంచండి. తర్వాత రోజు షాంపూతో వాష్ చేయండి. ఇలా చేయడం వల్ల జుట్టుుకు అవసరమైన పోషణ లభిస్తుంది. ఫలితంగా జుట్టు కూడా రాలకుండా ఉంటుంది.
ఆల్మండ్ ఆయిల్, ఎగ్ తో మాస్క్:
ఈ హెయిర్ మాస్క్ జుట్టును బలంగా చేస్తుంది. అంతే కాకుండా మెరుపును కూడా అందిస్తుంది. ఈ హెయిర్ మాస్క్ తయారు చేయడం కోసం 2 చెంచాల బాదం నూనెలో 1 ఎగ్ వైట్ కలిపి ద్వారా హెయిర్ మాస్క్‌ను సిద్ధం చేయండి. దీన్ని జుట్టుకు పట్టించి రాత్రంతా అలాగే ఉంచి, ఉదయాన్నే కడిగేయాలి.
Also Read: జుట్టు పెరగాలా ? అయితే ఈ టిప్స్ మీ కోసమే
మెంతులు, కొబ్బరి పాలతో మాస్క్:
ఈ మాస్క్ జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. తగినంత మెంతి గింజలను ఒక రోజు నానబెట్టి వాటిని మెత్తగా చేసి అందులో కొద్దిగా కొబ్బరి పాలు కలపండి. దీన్ని జుట్టుకు పట్టించి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం కడిగేయాలి.