VD 12 Update : యంగ్ హీరోల్లో కాస్త మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. ఈ హీరో ఓ బ్లాక్ బస్టర్ హిట్ కొడితే… చూడాలని చాలా మంది ఫ్యాన్స్ అనుకుంటారు. అది పూరి వల్ల, లైగర్ మూవీతో అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ, అది అతిపెద్ద డిజాస్టర్‌గా మారిపోయింది. దీని తర్వాత ఖుషి, ఫ్యామిలీ స్టార్ మూవీస్ వచ్చినా… అవి ఈ రౌడీ హీరో ఇమేజ్‌ను పెంచలేకపోయాయి. అయితే ఇప్పుడు రౌడీ హీరో ఫ్యాన్స్ చూపులు, ఆశలు అన్నీ కూడా గౌతమ్ తిన్ననూరిపైనే ఉన్నాయి. విజయ్ దేవరకొండతో గౌతమ్ VD 12 అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ గురించి కొన్ని విషయాలు ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో వైరల్ అవుతున్నాయి. అవి కాస్త రౌడీ హీరో ఫ్యాన్స్ చెవిలో పడటంతో నిర్మాత నాగ వంశీపై ఫైర్ అవుతున్నారు. ఆ డీటైల్స్ ఏంటో ఇప్పుడు చూద్ధాం…
ఎప్పుడో రెండేళ్ల క్రితం స్టార్ట్ అయింది VD12. స్పై సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీ అని తెలియడంతో రౌడీ హీరో అభిమానులు మొత్తం ఈ సినిమా కోసం ఇంట్రెస్టింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. అలాగే 150 కోట్ల భారీ బడ్జెట్, రెండు పార్ట్స్‌గా సినిమా రిలీజ్ చేయడం లాంటి విషయాలు బయటికి రావడంతో VD 12 పైన పెట్టుకున్న హోప్స్ అన్నీ ఇన్ని కాదు. అలా ఈ సినిమా కోసం చాలా రోజుల నుంచి కళ్లు కాయాలు కాచేలా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ, రిలీజ్ డేట్స్ అనుకుంటూ… వాయిదా వేస్తూ వస్తున్నారు.
వీటి వల్ల నిర్మాత నాగ వంశీపై ఇప్పటికే అభిమానులు గుర్రుగా ఉన్నారు. కొన్ని రోజుల క్రితం VD 12 మూవీని వేసవి కానుకగా మార్చి 28న రిలీజ్ చేస్తామని ఓ అద్భుతమైన పోస్టర్ రిలీజ్… అనౌన్స్ చేశారు. తాజాగా వేసవిలో కష్టం… మే 30న రిలీజ్ చేస్తామని అనుకుంటున్నారట. త్వరలో వాయిదా, కొత్త రిలీజ్ డేట్‌పైన అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.
నిర్మాతలు డబ్బులు ఇవ్వడం లేదా..?
సాధారణంగా స్పై సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అంటే… సినిమా ఎక్కువ భాగం విదేశాల్లో ఉంటుంది. కానీ, VD 12 షూటింగ్ మాత్రం మన దేశంలోనే చేస్తున్నారట. ఇక్కడే ప్రత్యేకమైన సెట్స్ వేసి షూటింగ్ ను పూర్తి చేసే పనిలో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఉన్నట్టు తెలుస్తుంది. అందువల్లే షూటింగ్ కూడా ఆలస్యంగా జరుగుతుందట. దీంతో నిర్మాత నాగ వంశీపై ఫైర్ అవుతున్నారు. స్పై థ్రిల్లర్ మూవీ అంటే… షూటింగ్ విదేశాల్లో చేయాలి కానీ, ఇలా ఇక్కడే స్పెషల్ సెట్స్ వేసి షూటింగ్ చేస్తే సహజత్వం ఉంటుందా..? అని అంటున్నారు.
అయితే ఈ మూవీ బడ్జెట్ 150 కోట్లు అని సమాచారం. అంత బడ్జెట్ పెట్టి… విదేశాల్లో షూటింగ్ చేయకుండా.. దేనికి ఖర్చు చేస్తున్నారు అనే క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి.
షూటింగ్ ఇంకా ఎన్ని రోజులు…
రౌడీ హీరో అభిమానులు ఎన్నో హోప్స్ పెట్టుకున్న మూవీ ఇది. దీన్ని వరుసగా వాయిదా వేస్తూ రావడంతో నిర్మాత నాగ వంశీపై అభిమానులు గుర్రుగా ఉన్నారు. అయితే సినిమా రిలీజ్ డేట్ వాయిదా అవ్వడానికి కారణం… ఇంకా షూటింగ్ పూర్తి కాలేదట. రెండేళ్ల క్రితం స్టార్ట్ చేసిన సినిమా… డైరెక్టర్ నెమ్మదిగా చేయడంతో షూటింగ్ ఇంకా పూర్తి కాలేదని టాక్ వస్తుంది. ఇప్పటి వరకు VD 12 మూవీ షూటింగ్ 90 శాతం పూర్తి అయినట్టు తెలుస్తుంది.
మార్చిలో పూర్తి…?
మిగిలిన పార్ట్ ను ఫైనల్ షెడ్యూల్‌లో పూర్తి చేస్తారని సమాచారం. ఫిబ్రవరి రెండో వారంలో ఫైనల్ షెడ్యూల్‌ను స్టార్ట్ చేసి మార్చిలో కంప్లీట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. హైదరాబాద్ శివారులో ఓ భారీ సెట్ వేసి అందులోనే మిగిలిన 10 శాతం షూటింగ్ ను పూర్తి చేయబోతున్నారట.