BigTV English

Jaat movie collection: జాట్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే..?

Jaat movie collection: జాట్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. ఎన్ని కోట్లంటే..?

Jaat movie collection: బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ నటించిన చిత్రం జాట్. దర్శకుడు గోపీచంద్ మలినేని ఈ సినిమాతో బాలీవుడ్ కి పరిచయం అవుతున్నారు. బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు తొలిసారి బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తూ రూపొందించిన సినిమా జాట్. సన్నీడియోల్ మాస్ ఎలిమెంట్స్ తో, యాక్షన్, అంశాలను రంగరించి సినిమాలు రూపొందించారు. సన్నీడియోల్ కెరియర్ లోనే గాయల్, ఘాతక్, నరసింహా లాంటి మాస్ ఇమేజ్ తెచ్చి పెట్టిన సినిమాలను మైమరిపించే విధంగా గోపీచంద్ ఈ సినిమాని రూపొందించారు. ట్రైలర్ లో చూసిన దానికి మించి సినిమాలోయాక్షన్ ఎలిమెంట్స్ వుంటాయి అని తెలుస్తుంది. ఈ సినిమాల లో రెజీనా కసాండ్ర, సయామీకేర్, రమ్యకృష్ణ జగపతిబాబు, పృథ్వీరాజ్, ఉపేంద్ర లిమియో, అజయ్ గోష్, ఊర్వసి రౌటే, కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్లో రూపొందించారు. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్స్ అంచనా ఎంత అని వివరాలు చూస్తే ..


బాలీవుడ్ స్టార్ మూవీ డే వన్ కలెక్షన్స్ ..

సన్నీ డియోల్, గద్దర్ 2 లాంటి సినిమా తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ సినిమా సుమారు 100 కోట్లతో నిర్మించినట్లు సమాచారం. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 100కోట్ల చేరు 200 రాబట్టాలి. ఈ సినిమా మొదటి రోజు సుమారు 40 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు రాబట్టినట్లు సమాచారం. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా తొలి రోజున 9.2 కోట్ల రూపాయల వసూలు నమోదు అయినట్లు సమాచారం. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ నెంబర్ ఇంకాస్త పెరిగే అవకాశం ఉందని, ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


బాలీవుడ్ లో హిట్ ఇచ్చిన దక్షిణాది డైరెక్టర్ ..

బాలీవుడ్ లో మంచి హిట్ లేక డల్ గా ఉన్న సమయంలో దక్షిణాది నుంచి వెళ్లిన డైరెక్టర్ గోపీచంద్ మళ్లీనేని అక్కడ సినిమా తీసి సూపర్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఈ సినిమా కదా తెలుగులో మనం చూసినట్లే అనిపిస్తుంది కానీ బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రం చాలా కొత్తగా అనిపిస్తుంది. ఈ సినిమా కలెక్షన్స్ గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఈ చిత్రం సంగీతం తమన్ అందించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టారని చెప్పొచ్చు. వేసవిలో ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి. థియేటర్ లలో అభిమానులు సందడితో, సరికొత్త రికార్డులను నెలకొల్పుతుంటాయి. అలా వేసవి కానుకగా మన ముందుకు చిత్రం జాట్. ఈ సినిమా ఏప్రిల్ 10వ తేదీన, ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ ని అందుకుంది. సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నందున రికార్డ్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక జాట్ బాలీవుడ్ లో ఎలాంటి సునామీ సృష్టిస్తుందో చూడాలి.

 

Also read: Hebah Patel : ఏంటమ్మా… హీరో ఎవరో తెలియకుండానే… రెండు సార్లు చేశావా..?

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×