Trolls on RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కొనసాగుతున్న నేపథ్యంలో…. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును ( Royal Challengers Bangalore team ) ఒక ఆట ఆడుకుంటున్నారు నెటిజెన్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ప్రారంభమై 18 సంవత్సరాలు గడిచిన కూడా… ఒక్క ట్రోఫీ కూడా గెలవలేదని… దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్… గత 18 సంవత్సరాల కింద ప్రారంభమైన సంగతి తెలిసిందే. 2007 సంవత్సరంలో ఈ టోర్నమెంట్కు ఫౌండేషన్ వేయగా 2008 సంవత్సరంలో తొలి సీజన్ జరిగింది.
Also Read: Anaya Bangar: అనయ బంగర్ కామెంట్స్ దుమారం.. కొందరు క్రికెటర్లు ఆ*ఫోటోలు పంపేవారు
18 సంవత్సరాలుగా బెంగళూరుకు నిరాశే
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమై 18 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటివరకు టోర్నమెంట్ గెలవలేదు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. చెన్నై సూపర్ కింగ్స్ అలాగే ముంబై ఇండియన్స్ జట్లు అత్యధికంగా టోర్నమెంటు లు గెలిచాయి. ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా రెండుసార్లు టోర్నమెంట్ గెలిచింది. డెక్కన్ చార్జెస్ గా ఉన్న సమయంలో.. గిల్ క్రిస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కు మొదటిసారి టోర్నమెంట్ దక్కింది. ఆ తర్వాత డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో రెండోసారి ట్రోఫీ అందుకుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. చివరిసారిగా కేకేఆర్ జట్టు.. 2024 టోర్నమెంట్ గెలుచుకుంది. ఈసారి కూడా మంచి టచ్ లో ఉంది కేకేఆర్ జట్టు.
ఇన్ని జట్లు విజయాలు సాధించినప్పటికీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటివరకు ఒక కప్పు గెలవలేదు. ఆ జట్టులో చాలామంది బలమైన ప్లేయర్లు ఉన్నప్పటికీ… అదృష్టం కలిసి రావడం లేదు. విరాట్ కోహ్లీ అయితే మొదటి నుంచి అందులోనే ఆడుతున్నాడు. కెప్టెన్సీ కూడా చేశాడు. అయినా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రాత మారలేదు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు నేటిజన్స్. డెస్క్ టాప్ పైన.. పది జట్ల లోగోలను ఓపెన్ చేశారు.. అందులో ప్రతి జట్టు లోగో పైన టచ్ చేస్తే.. వాళ్లు గెలిచిన టోర్నమెంట్లు కనిపిస్తున్నాయి. కానీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లోగో పైన టచ్ చేస్తే ఒక్క ట్రోఫీ కూడా చూపించడం లేదు. ఈ వీడియోను వైరల్ చేసి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ను ఒక ఆట ఆడుకుంటున్నారు నెటిజెన్స్.
Also Read: Travis head – Rohit Sharma: రోహిత్ ఏమైనా నీ లవర్ ఏంట్రా… ట్రావిస్ హెడ్ పై ట్రోలింగ్
అయితే ఐపిఎల్ 20025 టోర్నమెంట్లో ( IPL 2025 ) మాత్రం రాయచలెంజర్స్ బెంగళూరు (RCB Team ) అద్భుతంగా రాణిస్తారు. ఈ నేపథ్యంలోనే… పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఇప్పటివరకు ఆరు మ్యాచ్ లాడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నాలుగు మ్యాచ్లో విజయం సాధించింది. రెండు మ్యాచ్ల్లో మాత్రమే ఓడిపోయింది.. ఈ తరుణంలోనే 8 పాయింట్లు సాధించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. దీంతో ఈసారి ఎట్లాగైనా… టోర్నమెంట్ గెలుస్తుందని రాయల్ చాలెంజర్స్ అభిమానులు అంచనా వేస్తున్నారు.
— Out Of Context Cricket (@GemsOfCricket) April 18, 2025