Dog video: ఈ రోజుల్లో ఎక్కడ చూసిన సోషల్ మీడియా హవానే నడుస్తోంది. ఎలాంటి వార్తలు అయినా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా నెటిజన్లు వైరల్ వీడియోలను ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. పాములు, కుక్కలు, ఏనుగులు, కామెడీ వీడియోలను నెటిజన్లు ఎక్కువగా వీక్షిస్తున్నారు. అయితే తాజాగా జర్మనీ షెపర్ట్ జాతికి చెందిన కుక్క.. మరో కుక్క నుంచి పిల్లలను రక్షించింది. ఓ వీధి కుక్క పిల్లలను కరిచేందుకు పరిగెత్తుకుంటూ వస్తుండగా.. జర్మనీ షెఫర్డ్ దాని నుంచి పిల్లలను కాపాడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
ఉత్తరాఖండ్, రుషికేష్ లో ఇంటి ఆవరణలో ముగ్గురు పిల్లలు ఆడుకుంటున్నారు. ఇదంతా ఇంట్లో పెంచుకుంటున్న జర్మనీ షెపర్డ్ జాతికి చెందిన కుక్క నిశ్చబ్దంగా చూసుకుంటూ ఉంది. అయితే పిల్లలు ఆడుకుంటుండగా వీధి కుక్క వేగంగా పిల్లల మీదకు పరిగెత్తకుంటూ వచ్చింది. దీన్ని గమనించిన షెపర్ట్ జాతికి చెందిన కుక్క వెంటన అప్రమత్తమైంది. పిల్లలకు ఎక్కడ ఆపాయం కలుగుతుందోనని బాల్కనీ నుంచి టైగర్ లాగా దూకి వీధి కుక్కను వేటాడి.. వెంటాడి తరిమికొట్టింది. చిన్నారులు వీధి కుక్కుల గురించి అవగాహన లేకుండా సరదాగా ఆడుకుంటూ ఉన్నారు. ఆ దీంతో ఆ వీధి కుక్కు ఆపాయం చేస్తోందని గమనించలేకపోయారు.
ALSO READ: Ganga Bridge: ఆసియాలోనే అద్భుతం.. 10 కి.మీ పొడవైన గంగా వంతెన.. ఇది వేరే లెవల్ బాస్!
‘షెపర్డ్ డాగ్ సూపర్‌హీరోలా దూకి పిల్లలను రక్షించింది’ అనే క్యాప్షన్‌తో ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ సంఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఈవీడియో నెటిజన్లు ఆకట్టుకుంటుంది. ఓ నెటిజన్ ఈ విధంగా కామెంట్ చేశాడు. ‘కుక్కలు మనుషుల కంటే ఎక్కువ నమ్మకంగా ఉంటాయని మరోసారి నిరూపించబడింది’ అని పేర్కొన్నాడు. మరొకరు ‘వెల్ డన్ డాగేష్ భాయ్’ అని సరదాగా కామెంట్ చేశాడు. ‘డాగేష్ భాయ్ నిజమైన రక్షకుడిలా వ్యవహరించాడు’ అని మరొకరు రాసుకొచ్చారు. కొందరు ఈ కుక్కను ‘పిల్లల నిజమైన బాడీగార్డ్’ అని సరదాగా కామెంట్ చేసుకొచ్చారు. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన చాలా మంది ‘ఇది చూడటానికి ఆనందంగా ఉంది’ అని, ‘సూపర్‌హీరోలకు కాస్ట్యూమ్ అవసరం లేదు’ అని సంతోషం వ్యక్తం చేశారు.
ALSO READ: Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో అనుకూలించని వాతావరణం.. ఐదు విమానాలు మళ్లింపు
అయితే ఓవరాల్ గా ఈ వీడియో జర్మన్ షెపర్డ్ ధైర్యం అందరినీ ఆకట్టుకుంటుంది. కుక్కల నమ్మకమైన స్వభావం, రక్షణ సహజ గుణం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటన పెంపుడు జంతువులపై ప్రజలకున్న ఇంట్రెస్ట్, వాటి పట్ల గౌరవాన్ని మరింత పెంచిందని చెప్పవచ్చు.