BigTV English

Jabardasth Avinash : జబర్దస్త్ కమెడియన్ ఇంట తీరని విషాదం.. స్టే స్ట్రాంగ్ అంటున్న నెటిజన్లు

Jabardasth Avinash : జబర్దస్త్ కమెడియన్ ఇంట తీరని విషాదం.. స్టే స్ట్రాంగ్ అంటున్న నెటిజన్లు

Jabardasth Avinash : టాలీవుడ్ ఇండస్టీలో ప్రముఖ కమెడియన్లలో జబర్దస్త్ అవినాష్ ఒకరు. తన కామెడీ టైమింగ్ తో కడుపుబ్బా నవ్వించి ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న అవినాష్ బిగ్ బాస్ షోలో పాల్గొన్నాడు . ఈ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చాక పలు టీవీ షోలో నాటించడం తో పాటు, సినిమాల్లో నటిస్తున్నాడు. బుల్లి తెరతో పాటు వెండితెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.


ఇక అవినాష్ 2021 లో అనూజతో వివాహం చేసుకున్నాడు .అవినాష్ తరుచుగా తన భార్యతో కలిసి తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. గత ఏడాది ఏప్రిల్ లో తన భార్య ప్రెగ్నెన్సీ అయినట్లు సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నాడు. రీసెంట్ గా అనూజకు ఎంతో గ్రాండ్ గా సీమంతం కూడా చేసారు. త్వరలో తమ ఇంటికి ఓ బిడ్డ రాబోతుందని తెలియజేసాడు. అయితే తాజాగా అవినాష్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బిడ్డ పుట్టకుండానే చనిపోవడంతో అవినాష్ భార్య సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

అనూజ ఇన్ స్ట్రాగ్రామ్ పోస్ట్ లో నా లైఫ్ లో సంతోషమైనా, బాధ అయినా .. నా ఫ్యామిలీ అయినా మీతోనే పంచుకుంటాను. ఇప్పటి వరకు నా ప్రతి ఆనందాన్ని మీతోనే పంచుకున్నాను. కానీ మొదటిసారి నా జీవితం లో జరిగిన ఒక విషాదాన్ని మీతో పంచుకుందాం అని అనుకుంటున్నాను. మేము అమ్మ నాన్న అవ్వాలనే ఆ రోజు కోసం ఎదురు చూసాం. కానీ కొన్ని కారణాల వల్ల మేము మా బిడ్డని కోల్పాయాం . ఈ విషయం మేము ఎప్పటికి జీర్ణించుకోలేనిది. మీకు ఎప్పటికైనా చెప్పాలి అన్న బాధ్యతతో ఈ విషయాన్నీ మీతో పంచుకుంటున్నాను . ఇప్పటివరకు మీరు మాపై చూపించిన ప్రేమకి థాంక్యూ. మీ ప్రేమ ఎప్పటికి ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.


అలాగే దయచేసి ఈ విషయంపై ఎలాంటి ప్రశ్నలు అడిగి మమ్మల్ని బాధపెట్టవద్దు. మీరందరు అర్ధం చేసుకుంటారని కోరుకుంటూ మీ అనూజ అవినాష్ అని రాసుకొచ్చింది. ఇక అవినాష్ బిడ్డ చనిపోయారని తెలియడంతో నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేసారు. అవినాష్ కుటుంబానికి దేవుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అవినాష్ రీసెంట్ గా ఆహా ఓటీటీ లో ప్రసారం అవుతున్న “కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ” అనే షోలో పాల్గొంటున్నాడు. పలు సినిమాలు, టీవీ షోలు చేస్తున్నాడు.

Related News

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big Stories

×