Jagapathi Babu: తెలుగు తెరపై విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న హీరో జగపతిబాబు. అప్పట్లో వరుసగా హీరో పాత్రలతో అలరించి మెప్పించిన ఈ హీరో ఇప్పుడు వరుసగా విలన్ పాత్రలలో నటించి టాలీవుడ్ లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఒకప్పుడు విలన్ పాత్ర అంటే మనకి గుర్తొచ్చేది ప్రకాష్ రాజ్. ఆయన తరువాత అంతగా గుర్తింపు తెచ్చుకున్న హీరో జగపతిబాబు అని చెప్పొచ్చు. నాన్నకు ప్రేమతో సినిమా తరువాత, వరుసగా నెగిటివ్ రోల్స్ చేస్తూ, బిజీగా గడుపుతున్నారు. రీసెంట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన అల్లు అర్జున్ పుష్ప 2 లో విలన్ పాత్రలో నటించారు. 62 సంవత్సరాల వయసు లోను వరుస సినిమాలు చేస్తూ ఇటు టాలీవుడ్ లోనే కాక బాలీవుడ్ లోనూ సినిమాలు చేస్తున్నారు జగపతిబాబు. మొన్న బాలీవుడ్ లో రిలీజ్ అయిన జాట్ సినిమా లోను నటించి మెప్పించారు. ప్రస్తుతం రామ్ చరణ్, పెద్ది సినిమాలోని ఒక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే సోషల్ మీడియాలో, ఎప్పటికప్పుడు తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాల గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటారు జగ్గు భాయ్. ఇక ఇప్పుడు తాజాగా ఆయన రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వీడియోని, షేర్ చేశారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం..
రోడ్డు పైన సీనియర్ తెలుగు హీరో ..
ఇక సినిమా విషయాలు పక్కన పెడితే, సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేసే వీడియోలు అవుతుంటాయి.మొన్న మధ్య షూటింగ్ సమయంలో రెబల్ స్టార్ ప్రభాస్ పంపించిన ఫుడ్ ను వీడియో తీసి, పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఉగాది రోజున తన కుటుంబంతో కలిసి, భోజనం చేస్తున్న వీడియోను షేర్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో లో ఆయన రోడ్డు మీద సామాన్యుడిలా నడుచుకుంటూ వెళ్తున్నాడు ఒక షాపులో, మొబైల్ కొనేందుకు ఆయన నడుచుకుంటూ వెళ్తూ వున్నారు.వీడియో లో ఆయన ట్రాఫిక్ మధ్యలో నుంచి వెళ్తున్నారు ఇదంతా ఆయన వీడియో తీసి మరీ ఎక్స్ వేదికగా,పంచుకున్నారు. నా ప్రయాణం ఇలా ..నా లైఫ్ బ్లాక్ అండ్ వైట్ అంటూ ఆయన పోస్ట్ కింద క్యాప్షన్ రాసుకొచ్చారు.
సీనియర్ హీరో .. సింప్లిసిటీ..
ఆయన అలా రోడ్డు మీదకి నడుచుకుంటూ చాలా దూరం నడిచారు అయినా ఎవరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి పలకరించింది లేదు. బహుశా ఆయన ఎవరు గుర్తుపట్టలేదు అనిపిస్తుంది. అప్పట్లో తెలుగు హీరోయిన్స్ అంతా జగపతి బాబు తో సినిమా చేయటానికి ఆసక్తి చూపేవారు .ఆమనీ,సొందర్య, రమ్యకృష్ణ, రోజా ఇలా చెప్పుకుంటూ పొతే చాల మందే వున్నారు. కొంతకాలం తరువాత విలన్ పాత్రలతో రి ఎంట్రీ ఇచ్చారు.ఇక వరుస ఆఫర్స్ చేతిలోకి వచ్చాయి .ఇప్పుడు అయన ఏదైనా సినిమా కోసం, ఇలా రోడ్డు మీదకు వచ్చారా లేదంటే ఆయన సొంత పని కోసం వచ్చారా అన్నది తెలియాల్సి ఉంది. ఒకప్పటి స్టార్ హీరో ఇప్పుడు నడిరోడ్డు మీద సామాన్యుడిలా నడుచుకుంటూ వెళుతున్న, ఆయన సింప్లిసిటీకి అభిమానులు ఫిదా అవుతున్నారు.
Mangalavaram 2 : హర్రర్ తో పాటు మరో ప్రయోగం… ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే