Dhruv Vikram : గత కొంతకాలం నుంచి కోలీవుడ్ యంగ్ హీరో ధృవ్ విక్రమ్ (Dhruv Vikram) టాలీవుడ్ ఎంట్రీ గురించి వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఆయన డైరెక్ట్ తెలుగు మూవీకి ఇప్పుడు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. కాకపోతే ముందుగా వార్తలు వచ్చిన ఓ ప్రముఖ డైరెక్టర్ తో కాకుండా ధృవ్ విక్రమ్ ఒక కొత్త డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్టు సమాచారం.
చియాన్ విక్రమ్ వారసుడిగా ధృవ్ విక్రమ్ (Dhruv Vikram) ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చాలా కాలమే అయిపోయింది. ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ తో తమిళ ప్రేక్షకులకు పరిచయమయ్యాడు ధృవ్. పలు అడ్డంకుల తర్వాత రిలీజ్ అయిన ఈ ఫస్ట్ మూవీ తోనే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ యంగ్ హీరో కమర్షియల్ సినిమాల జోలికి వెళ్లకుండా, విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ, కెరీర్ లో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కేవలం నటుడి గానే కాకుండా సింగర్ గా కూడా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు. ఇక తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ విలక్షణ పాత్రలు చేయాలని ఆశపడుతున్న ధృవ్ విక్రమ్ తన తండ్రితో కలిసి ‘మహాన్’ అనే సినిమాలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అలాగే నాని హీరోగా నటించిన “హాయ్ నాన్న” సినిమాలోని ‘ఓడియమ్మ’ పాటను పాడి తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు.
ఈ నేపథ్యంలోనే ఇప్పటికే నటుడిగా మంచి పేరుని సొంతం చేసుకున్న ధృవ్ విక్రమ్ (Dhruv Vikram) ఇప్పుడు తెలుగు తెరపై మెరవబోతున్నాడని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ‘మంగళవారం’ డైరెక్టర్ అజయ్ భూపతి తో ఆయన సినిమా తెరకెక్కబోతోంది అంటూ పుకార్లు షికార్లు చేశాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ధృవ్ విక్రమ్ ఒక కొత్త దర్శకుడితో తెలుగు చిత్ర సినిమాలోకి అడుగు పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. ‘మనసా నమః’ ఫేమ్ దీపక్ ఈ మూవీకి దర్శకత్వం వహించబోతున్నట్టు సమాచారం. ఆయనకు తెలుగులో ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఇక సమాచారం ప్రకారం ఈ సినిమా క్లాసిక్ లవ్ స్టోరీ అవుతుందని అంటున్నారు. అలాగే ఈ సినిమాను ఓ బడా నిర్మాణ సంస్థ నిర్మించబోతుందని తెలుస్తోంది. ఒకేసారి తెలుగు తో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను చిత్రీకరించబోతున్నట్టుగా టాక్ నడుస్తోంది. దీనిపై అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చాక మరిన్ని వివరాలు తెలుస్తాయి. మరి ధృవ్ విక్రమ్ ఫస్ట్ తెలుగు మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు రానుందో చూడాలి.
ఇప్పటికే శివ కార్తికేయన్, కార్తీ వంటి యంగ్ హీరోలతో పాటు విజయ్, అజిత్, సూర్య వంటి అరవ హీరోలకు టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. అలాగే విక్రమ్ కు కూడా తెలుగులో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. మరి ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతున్న యంగ్ హీరో ధృవ్ (Dhruv Vikram) టాలీవుడ్ లో ఎలాంటి బెంచ్ మార్క్ ను సెట్ చేస్తాడో చూడాలి.