Janhvi Kapoor: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) గురించి పరిచయాలు ప్రత్యేకమైన అవసరం లేదు . దివంగత నటీమణి శ్రీదేవి (Sridevi ) కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె తన అందంతో, నటనతో యువతను మంత్రముగ్ధుల్ని చేసింది. ఇకపోతే శ్రీదేవి కూతురుగా పేరు సొంతం చేసుకున్న జాన్వీ కపూర్ అనుకున్నంత స్థాయిలో బాలీవుడ్ లో సక్సెస్ కాలేదు. అయినా సరే ఆఫర్లు మాత్రం తలుపు తడుతున్నాయి. ఈ క్రమంలోనే కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హీరోగా నటించిన దేవర (Devara ) సినిమాలో హీరోయిన్ గా అవకాశాన్ని దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఏడాది సెప్టెంబర్ 27వ తేదీన పాన్ ఇండియా వైడ్ గా విడుదలైన ఈ సినిమా మొదటి రోజు రూ.172 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అంతే కాదు రాజమౌళి సెంటిమెంట్ ని కూడా బ్రేక్ చేసింది ఈ సినిమా. దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ రన్ ముగిసేసరికి డిస్ట్రిబ్యూటర్స్ కి, నిర్మాతలకు భారీ లాభాలను మిగిల్చింది.
మధురానగర్లో ఆంజనేయ స్వామి దేవాలయం లో జాన్వీ..
ఇకపోతే ఈ సినిమాకి జాన్వీ కపూర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇకపోతే జాన్వీ కపూర్ తాజాగా మధురానగర్ లోని దేవాలయంలో కనిపిపించి, అందరినీ ఆశ్చర్యపరిచింది. మధురానగర్లో ఆంజనేయ స్వామి ఆలయానికి వచ్చారు. ఇక్కడ ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. దాదాపు అరగంట పాటు ఆలయంలోనే పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజ ముగించుకొని బయటకొచ్చిన తర్వాత జాన్వి కపూర్ తో సెల్ఫీలు దిగడానికి అభిమానులు ఎగబడ్డారు. ప్రస్తుతం పూజా కార్యక్రమాల్లో జాన్వీ పాల్గొన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.వాస్తవానికి జాన్వీ కపూర్ కి భక్తి ఎక్కువ.. తరచూ తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆంజనేయస్వామిని దర్శించుకుంది ఈ ముద్దుగుమ్మ.
జాన్వీ కపూర్ సినిమాలు..
ఇక జాన్వీ కపూర్ సినిమాల విషయానికొస్తే.. ఎన్టీఆర్ దేవర సినిమాలో నటించే సమయంలోనే బుచ్చిబాబు సనా (Bacchibabu Sana), రామ్ చరణ్ (Ram Charan) కాంబినేషన్లో వస్తున్న సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత యంగ్ హీరో నాని (Nani ) సరసన నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది జాన్వీ కపూర్. ఏది ఏమైనా టాలీవుడ్ లోకి అలా అడుగుపెట్టిందో లేదో ఇప్పుడు రెమ్యూనరేషన్ విషయంలో కూడా భారీగా డిమాండ్ చేస్తోంది. ఇక సౌత్ హీరోయిన్స్ ని కూడా పక్కనపెట్టి ఈమెను సినిమాలలో తీసుకుంటూ ఉండడంతో ఈ రేంజ్ లో డిమాండ్ చేస్తోందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అసలు బాలీవుడ్ లో దిక్కేలేదు. అలాంటిది ఇక్కడికి వచ్చి ఇలా డిమాండ్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ కొంతమంది నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాన్వి కపూర్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ వరుస గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ యువతకు మంచి ట్రీట్ ఇస్తోంది. మరొకవైపు భక్తి పారవశ్యం లో మునిగి తేలుతూ ఆకట్టుకుంటూ ఉంటుంది.