Jani Master: జబర్దస్త్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన కమెడియన్ రాకింగ్ రాకేష్. కంటెస్టెంట్ గా మొదలైన అతని కెరీర్ టీమ్ లీడర్ గా మారి.. కమెడియన్ గా సినిమాల్లో కనిపిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన హీరోగా మారి నిర్మిస్తున్న చిత్రం కేశవ చంద్ర రమావత్(KCR). గరుడవేగ అంజి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తుంది.
ఇక ఈ చిత్రంలో రాకింగ్ రాకేష్ సరసన సీనియర్ నటి సత్య కృష్ణన్ కుమార్తె అనన్య కృష్ణన్ నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. లంబాడీ వర్గానికి చెందిన యువకుడి కథగా తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 22 న రిలీజ్ కు రెడీ అవుతుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. నేడు కేసీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు.
Nikhil Siddhartha: తనకు తానే కొత్త ట్యాగ్ ఇచ్చుకున్న కుర్ర హీరో.. అదేంటో మీరే చూడండి
ఇక ఈ ఈవెంట్ కు బీఆర్ఎస్ లీడర్, మాజీ మంత్రి హరీష్ రావు చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఆయనతో పాటు మాజీ మంత్రి రోజా, సుడిగాలి సుధీర్, జానీ మాస్టర్ కూడా ఈవెంట్ కు గెస్టులుగా హాజరయ్యారు. ఇక మీడియా చూపు అంతా జానీ మాస్టర్ మీదనే పడింది. జైలు నుంచి బయటకు వచ్చాక మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం ఇదే మొదటిసారి.
ఇక ఈ వేదికపై జానీ మాస్టర్ మాట్లాడుతూ.. ” ఇక్కడకు వచ్చిన వారందరికీ నా నమస్కారాలు. ఈ స్టేజిని అలంకరించడానికి కష్టపడినవారికి ధన్యవాదాలు. ఈ సినిమా సక్సెస్ వైబ్ ను అందిస్తుంది. ఎందుకంటే.. రాకేష్ చాలా మంచి వ్యక్తి. జబర్దస్త్ కు వచ్చినప్పుడు నుంచి జర్నీ మొదలయ్యింది. ఎప్పుడు ఒకరి గురించి నెగెటివ్ చెప్పడం కానీ, సెల్ఫిష్ గా ఉండాలనుకోడు. పదిమంది సంతోషంగా ఉండాలి.. అందులో నేను ఉండాలి అనుకొనే వ్యక్తి. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇక్కడ వరకు రావడం చాలా గ్రేట్.
Dhananjaya: డాక్టర్ తో ‘పుష్ప’ జాలిరెడ్డి నిశ్చితార్థం.. వీడియో వైరల్
ఇలాంటి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయడానికి వచ్చినవారందరికి థాంక్స్. ఇక్కడకు వచ్చినవారందరూ అలా కష్టపడినవారే. ఒక భర్త వెనుకాల భార్య ఉంటుంది.. ఆమె ఒక పవర్, ఒక దీవెన ఉంటుంది. అలా ఎందుకు చెప్తున్నాను అంటే.. ఈ మధ్యన నా లైఫ్ లో కొన్ని సంఘటనలు జరిగాయి. ఆ సమయంలో నా భార్య నాకు ఎంతో అండగా ఉంది. ఒక వెన్నుముక లా అన్ని చూసుకుంది. చాలా థాంక్స్.
భర్తలు ఉన్న ప్రతి భార్యకు చెప్తున్నాను. చాలా థాంక్స్. మీరందరూ వెనుక ఉండి సరైన దారిలో నడిపిస్తున్నారు కాబట్టి వారందరూ మంచి మంచి విజయాలను అందుకుంటున్నారు. ఒక భార్యలని కాకుండా తల్లిగా, ఫ్రెండ్ గా ఉండి మంచి మార్గంలో తీసుకువెళ్తున్నారు. అలానే రాకేష్ వెనుక సుజాత ఉంది.
Janhvi Kapoor : జాన్వీ టాలెంట్ కు నెటిజన్లు ఫిదా
ఇది చిన్న సినిమా అని కాకుండా పెద్దగా థియేటర్ లో రిలీజ్ చేస్తున్నారు.. అది గొప్ప విషయం. ఈ చిన్న సినిమా మీకు కాసుల వర్షం కురిపించాలని నేను కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం పనిచేసిన వారందరి కష్టం కనిపిస్తుంది. కచ్చితంగా ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం జానీ మాస్టర్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.