BigTV English

Jani Master : నిజస్వరూపం త్వరలోనే బయట పడుతుంది… ఝాన్సీకి ఇచ్చి పడేసిన జానీ మాస్టర్

Jani Master : నిజస్వరూపం త్వరలోనే బయట పడుతుంది… ఝాన్సీకి ఇచ్చి పడేసిన జానీ మాస్టర్

Jani Master : గత కొన్ని రోజుల నుంచి టాలీవుడ్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వరుసగా సెలబ్రిటీలంతా వివాదాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఓ మహిళా కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పెట్టిన కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన జానీ మాస్టర్ తాజాగా యాంకర్ ఝాన్సీకి సోషల్ మీడియా వేదికగా స్పెషల్ పోస్టుతో ఇచ్చి పడేసాడు. పైగా నిజ స్వరూపం త్వరలోనే బయట పడుతుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.


జానీ మాస్టర్ టార్గెట్ ఝాన్సీనేనా?

పాన్ ఇండియా రేంజ్ లో కొరియోగ్రాఫర్ గా మంచి పేరు తెచ్చుకున్న జానీ మాస్టర్ పై అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల కేసు పెట్టింది. దీంతో కొన్నాళ్లు జైల్లో ఉన్న జానీ మాస్టర్ రీసెంట్ గా బెయిల్ పై బయటకు వచ్చి, మళ్లీ ఇండస్ట్రీలో బిజీ కావాలని ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీ కమిటీ మెంబర్ అయిన ఝాన్సీ తాజాగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ పోస్ట్ కి కౌంటర్ గా తాజాగా జానీ మాస్టర్ మరో పోస్ట్ చేశారు.


అందులో “తమ సొంత లాభం కోసం కోర్టు ఆర్డర్ల పై కూడా తప్పుడు ప్రచారాలు చేసేవారిని చూస్తుంటే జాలేస్తుంది. ముందస్తుగా నాకు తెలియకుండా జరిగిన యునియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ గురించి నేను పెట్టిన కేసుకి సంబంధించి వచ్చిన తీర్పుని మీకు అనుకూలంగా, నచ్చినట్టుగా మార్చి మరో కేసుతో ముడిపెట్టి పోస్టులు పెడుతూ ఉన్నారు. మీరేది చెప్పినా ప్రజలు నమ్ముతారనుకుంటున్నారేమో కానీ అసలు తీర్పు వివరాలు బయటకి వచ్చిన రోజున మీ నిజస్వరూపమేంటో, దేనికోసం ఈ దుష్ప్రచారం చేస్తున్నారని అందరికీ అర్థమవుతుంది. ఆ రోజు ఎంతో దూరం లేదు. న్యాయమే గెలుస్తుంది. అందరికీ నిజం తెలుస్తుంది” అంటూ పోస్ట్ చేశారు. దీంతో అసలు ఈ వివాదంలో ఏం జరుగుతోంది అన్నది ఆసక్తికరంగా మారింది.

ఝాన్సీ ఏమన్నది అంటే?

యాంకర్ ఝాన్సీ తాజాగా తన పోస్టులో “జిల్లా కోర్టులో ఛాంబర్ ఆదేశాలను సవాల్ చేస్తూ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వేసిన కేసులో ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ గెలిచింది. ఈరోజే జానీ మాస్టర్ వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. ఇది చాలా కీలకమైన తీర్పు. పని చేసే ప్రదేశాల్లో మహిళల భద్రతకు ప్రాధాన్యతనివ్వాలని, POSH రూల్స్ ను అమలు చేసే సంస్థలకు సపోర్ట్ ఉందని దీని ద్వారా రుజువైంది. ఫెడరేషన్ ఈ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించి ధర్మం వైపు నిలబడి పోరాటం చేసింది. దీనికి సపోర్ట్ చేసిన తెలుగు చలన చిత్ర మండలికి నా స్పెషల్ థాంక్స్” అంటూ పోస్ట్ చేసింది.

జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన లేడీ కొరియోగ్రాఫర్ ఫిలిం ఛాంబర్ లైంగిక వేధింపుల పరిష్కార కమిటీలో కంప్లైంట్ చేసింది. దీంతో వెంటనే జానీ మాస్టర్ ను డాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడి పదవి నుంచి తప్పించాలని ఫెడరేషన్ కోరగా, కేసు కోర్టులో ఇంకా నడుస్తుండగా, ఎలా తప్పిస్తారంటూ జానీ మాస్టర్ కోర్టులో పిటిషన్ వేసినట్టు తెలుస్తోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×