BigTV English

Janu Lyri Video: నేను సచ్చిపోతా.. నా చావుకు కారణం వీరే.. శేఖర్ మాస్టర్ ఇష్యూపై జాను లిరి ఎమోషనల్

Janu Lyri Video: నేను సచ్చిపోతా.. నా చావుకు కారణం వీరే.. శేఖర్ మాస్టర్ ఇష్యూపై జాను లిరి ఎమోషనల్

Janu Lyri Video: వెండితెరపై మాత్రమే కాదు.. బుల్లితెరపై కూడా యాక్టర్ల గురించి ఎన్నో రూమర్స్ క్రియేట్ అవుతుంటాయి. అయితే మొదటిసారి ఒక డ్యాన్స్ మాస్టర్ గురించి, ఒక డ్యాన్సర్ గురించి ఎఫైర్లు వైరల్ అవుతున్నాయి. వాళ్లు మరెవరో కాదు.. శేఖర్ మాస్టర్, జాను లిరి. శేఖర్ మాస్టర్ సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నా తనకు లైఫ్ ఇచ్చిన ‘ఢీ’ షోను మాత్రం ఎప్పుడూ వదల్లేదు. ఇప్పటికే ఈ షో సక్సెస్‌ఫుల్‌గా ఎన్నో సీజన్స్ పూర్తిచేసుకుంది. ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ షోలో డ్యాన్సర్‌గా వచ్చిన జాను లిరికి, శేఖర్ మాస్టర్‌ (Sekhar Master)కు మధ్య ఏదో ఉందని వార్తలు వైరల్ అవుతుండగా.. తాజాగా వాటిపై స్పందిస్తూ జాను లిరి వరుస వీడియోలు అప్లోడ్ చేసింది.


నరకంలాగా ఉంది

‘‘చాలామంది రూమర్స్ గురించి పట్టించుకోకు, వదిలేయమని అంటున్నారు. కానీ ఈ బాధ తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియడం లేదు. నేను మీకు ఏమైనా హాని చేశానా? నా వల్ల ఏమైనా నష్టం వచ్చిందా? నా గురించి మంచి కూడా ఉంది కదా మాట్లాడడానికి. ఎవరితో మాట్లాడినా, నవ్వినా, ఆఖరికి కూర్చున్నా కూడా ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. నాకు ఇదంతా నరకంలాగా ఉంది. మీరు చేసేది చాలా తప్పు. చాలామంది అమ్మాయిలు సూసైడ్ చేసుకొని చనిపోతుంటే ఎందుకు చచ్చిపోయారో. వీరికి ఏం మాయరోగం అనుకునేదాన్ని కానీ ఆ బాధలో ఉన్నవాళ్లకే సూసైడ్ గురించి ఆలోచన ఎందుకు వచ్చిందని తెలుస్తుంది’’ అంటూ ఏడ్చేసింది జాను లిరి (Janu Lyri).


ఓపిక నశించింది

‘‘మీడియా, ఇన్‌స్టాగ్రామ్ యూజర్స్ చేసేది చాలా తప్పు. ఒక ప్రాణం పోయిన తర్వాత మీరు చేసేది ఏమీ లేదు. ఒకరిని చంపి, వాళ్లు బాధపడుతుంటే మీరు చూస్తూ ఉండడం చాలా తప్పు. ఇన్నిరోజులు దీని గురించి నేను మాట్లాడలేదు. కానీ నాకు ఓపిక నశించిపోతోంది. ఈ బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావడం లేదు. నా లైఫ్ మీద పెట్టే ఇంట్రెస్ట్ మీ లైఫ్ మీద పెట్టుకుంటే బాగుంటుంది. ఒక అమ్మాయి జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నారు? నా కొడుకును మంచి స్థాయిలో చూడాలని అనుకున్నాను. ఇప్పుడు అలా చూడలేనేమో అనిపిస్తుంది. నేను మధ్యలోనే చనిపోతా. ఇలా మాట్లాడితే నా గురించి మాట్లాడడం ఆపేస్తారని కాదు. కానీ నా ఓపిక నశించిపోయింది’’ అంటూ బాధపడింది.

Also Read: మా అమ్మను దూషించారు, అది చేసింది రియల్ ముస్లింస్ కాదు

సూసైడ్ చేసుకుంటా

‘‘అన్నతో, తమ్ముడితో మాట్లాడినా కూడా లింకులు పెడుతున్నారు. మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి గురించి ఏది పడితే అది మాట్లాడేస్తారా. ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్ పెడుతున్నారు. మా అమ్మ, నాన్న నన్ను చిన్నప్పటి నుండి ఒక్క మాట కూడా అనకుండా పెంచారు. కానీ ఈరోజు అడ్డమైన యెధవలతో నేను మాటలు పడుతున్నాను. అందరూ చేసే రచ్చకే చాలామంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో చండాలంగా వీడియోలు పెడుతున్నారు. మీ అమ్మకు ఇలా చేస్తే నీకు బాధ ఉండదా? నాకు ఒక కొడుకు ఉన్నాడు వాడు అవన్నీ చూడడా? మొదటిసారి నాకు చచ్చిపోవాలని అనిపిస్తుంది. నేను నిజంగా చచ్చిపోతే మీరే దానికి కారణం’’ అని వాపోయింది జాను లిరి

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×