BigTV English

Daaku Maharaj: బాలయ్య మూవీకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుండి ముప్పు.. బాయ్ కాట్ చేస్తామంటూ..?

Daaku Maharaj: బాలయ్య మూవీకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుండి ముప్పు.. బాయ్ కాట్ చేస్తామంటూ..?

Daaku Maharaj:బాలకృష్ణ (Balakrishna) హీరోగా, బాబీ కొల్లి(Bobby Kolli) దర్శకత్వంలో నిర్మాత నాగ వంశీ (Naga Vamshi) తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘డాకు మహారాజ్’.. జనవరి 12న సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కాబోతున్న ఈ సినిమాకి పోటీగా హీరో వెంకటేష్ (Venkatesh) ‘సంక్రాంతికి వస్తున్నాం’, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) గేమ్ ఛేంజర్ సినిమాలు వస్తున్నాయి. అయితే తాజాగా బాలకృష్ణ సినిమాకి పెద్ద షాక్ తగిలింది. “బాయ్ కాట్ డాకు మహారాజ్” అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వైరల్ అవుతున్నాయి. మరి ఇంతకీ “బాయ్ కాట్ డాకూ మహారాజ్” అని సోషల్ మీడియాలో పోస్టులు ప్రత్యక్షం అవ్వడానికి కారణం ఏంటి..? బాలకృష్ణ చేసిన తప్పేంటి? అనేది ఇప్పుడు చూద్దాం..


బాయ్ కాట్ డాకు మహారాజ్ అంటూ కామెంట్స్..

“బాయ్ కాట్ డాకు మహారాజ్ ” అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వైరల్ అవ్వడానికి కారణం బాలయ్య మాట్లాడిన మాటలే అని అర్థమవుతోంది. ఎందుకంటే బాలకృష్ణ నోటి దూలతో మాట్లాడిన మాటల వల్ల సినిమాకి నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అనుకుంటున్నారు.ఇక అసలు విషయం ఏమిటంటే.. రీసెంట్గా బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న “అన్ స్టాపబుల్ షో” లోకి నిర్మాత నాగ వంశీ,డైరెక్టర్ బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ లు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.అయితే వీరి ఇంట్రడక్షన్ ప్రోమో ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. ఇందులో భాగంగా ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందులో ఏముందంటే.. డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించిన కొన్ని హిట్ సినిమాలు స్క్రీన్ పై వేశారు బాలకృష్ణ. ఆ సినిమాల గురించి ఒక్కొక్కటిగా అడుగుతున్నారు. అయితే బాబీ డైరెక్షన్ వహించిన సినిమాలన్నింటిలో అతిపెద్ద హిట్టు కొట్టింది ఎన్టీఆర్ (NTR )నటించిన ‘జై లవకుశ’. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా బాబీ కెరియర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ. కానీ అలాంటి ఈ సినిమా గురించి బాలకృష్ణ ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. దీంతో కావాలనే బాలకృష్ణ ఇలా చేశారని, బాబీ డైరెక్షన్లో వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ జై లవకుశ. అలాంటిది ఆ సినిమాని స్క్రీన్ పై ఎందుకు చూపించలేదు. ఎన్టీఆర్ గురించి మాట్లాడాల్సి వస్తుందనే ఉద్దేశంతోనే బాలకృష్ణ ఇలా చేశారంటూ సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాలకృష్ణపై ఫైర్ అవుతున్నారు.


ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని వేడుకుంటున్న నిర్మాత..

అందుకే బాలకృష్ణ సినిమాను చూడబోమంటూ.. బాయ్ కాట్ డాకు మహారాజ్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ పోస్టులు నెట్టింట వైరల్ గా మారడంతో భయపడిపోయిన నాగ వంశీ.. వెంటనే పరోక్షంగా ఎన్టీఆర్ అభిమానులను వేడుకున్నట్టు ఒక పోస్ట్ చేశారు. ఇక అందులో ఏముందంటే.. “ఈ సినిమా మన అందరిదీ. మనం ఈ సినిమాని ఆదరించాల్సిన అవసరం ఉంది.మీ మద్దతు నాకు కావాలి. అందరం కలిసి సినిమాను పెద్ద హిట్ చేద్దాం” అంటూ పోస్ట్ చేశారు. ఇక ఈ పోస్టు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని పరోక్షంగా నిర్మాత నాగ వంశీ వేడుకున్నట్టు కనిపిస్తోంది.

బాలయ్య పై ఫ్యాన్స్ ఫైర్..

ఇకపోతే ఈ విషయంలో బాలకృష్ణకు జరిగే నష్టమేమీ లేదు. ఎందుకంటే నష్టపోయేది నిర్మాతలు కదా.. అందుకే సినిమా విడుదలకు ముందు చేసే ప్రతి ఒక్క పనిని చాలా జాగ్రత్తగా చేయాలి. ఎక్కడ తేడా కొట్టినా కూడా సినిమాపై ఎఫెక్ట్ చూపిస్తుంది అని పలువురు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తగ్గి డాకూ మహారాజ్ సినిమా చూస్తారా.. లేదా అనేది చూడాలి.ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ పై నందమూరి ఫ్యాన్స్ సంతోషంతో కామెంట్లు చేస్తున్నారు. ట్రైలర్ మెప్పించింది మరి సినిమాతో మెప్పిస్తారో లేదో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×