Vidhya Balan – Rohith Sharma: ప్రస్తుతం భారత క్రికెట్ లో ఎక్కువగా వినబడే పేరు రోహిత్ శర్మ. గత దశాబ్ద కాలంగా టీమ్ ఇండియాకి మూల స్తంభంగా ఉంటూ వస్తున్నాడు రోహిత్. ఫార్మాట్ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా.. టార్గెట్ మాత్రం బౌండరీలే అన్నట్లు ఉండేది ఇతడి బ్యాటింగ్. రోహిత్ ఆటని చూసి జట్టులోని కుర్రాళ్ళు స్ఫూర్తి పొందే వాళ్ళమని కూడా పలుమార్లు చెప్పారు. కానీ గత కొంతకాలంగా ఈ కథ మారింది.
Also Read: WTC Final SA vs Aus: సౌతాఫ్రికా – ఆసీస్ మధ్య WTC ఫైనల్ ఫైట్.. ఎప్పుడంటే ?
రోహిత్ అటతీరు అతడి స్థాయికి తగ్గట్లుగా లేదని.. భారత జట్టు ఓటమికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాడని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు రోహిత్. ఇతడు అంతర్జాతీయ శతకం సాధించి దాదాపు పది నెలలు దాటిపోయింది. ముఖ్యంగా టెస్టుల్లో పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు రోహిత్ శర్మ. నేటితో ముగిసిన బోర్డర్ గవాస్కర్ పింక్ బాల్ టెస్ట్ లో కూడా తీవ్రంగా నిరాశపరిచాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో ప్లేస్ మారినా {Vidhya Balan – Rohith Sharma} రోహిత్ ఫేట్ మాత్రం మారలేదు.
దీంతో అతడు జట్టుకు భారంగా మారాడని.. హుందాగా జట్టు నుంచి తప్పుకుంటే మంచిది అంటూ సొంత అభిమానులే ఫైర్ అవుతున్న సందర్భంలో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ మాత్రం రోహిత్ శర్మని వెనకేసుకొచ్చి వివాదంలో చిక్కుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పై ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది విద్యాబాలన్. “రోహిత్ శర్మ అద్భుతం.. ఆయన ఓ {Vidhya Balan – Rohith Sharma} రియల్ సూపర్ స్టార్. కాస్త బ్రేక్ తీసుకొని ధైర్యంగా తిరిగి రా. మరింత బలంగా జట్టులోకి అడుగు పెట్టు. నీ పైన గౌరవం పెరిగింది” అంటూ ఇన్స్టా స్టోరీ షేర్ చేసింది.
దీంతో విద్యాబాలన్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో రోహిత్ అంటే పడని వాళ్ళు కొంతమంది విద్యాబాలన్ ని ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. మీరు సోషల్ మీడియాలో ముందు రోహిత్ శర్మను ఫాలో అవ్వండి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో విద్యాబాలన్ క్రికెట్ గురించి చేసిన వ్యాఖ్యలను బయటికి తీసి దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. తాను క్రికెట్ చూడనని, వ్యక్తిగతంగా తనకు సచిన్ టెండూల్కర్ అంటే అభిమానమని, మిగతా ప్లేయర్ల పేర్లు కూడా తనకు తెలియదని ఆ ఇంటర్వ్యూలో చెప్పింది విద్యాబాలన్.
ఆ వీడియోని షేర్ చేస్తూ విద్యాబాలన్ ని ట్రోల్స్ చేస్తున్నారు. అంతేకాదు రోహిత్ శర్మ భార్య రితిక.. విద్యాబాలన్ కి డబ్బులు ఇచ్చి పెయిడ్ ప్రమోషన్స్ చేయిస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. విద్యాబాలన్ తో పాటు వరుణ్ ధావన్ కూడా రోహిత్ శర్మ కి సపోర్ట్ చేస్తూ పోస్టులు చేయడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తుంది.
Also Read: Virat Kohli: కోహ్లీ మాస్ ర్యాగింగ్.. గుక్కపెట్టి ఏడుస్తున్న ఆసీస్ ప్లేయర్లు !
ఇక విద్యాబాలన్ గురించి చెప్పాలంటే.. బాలీవుడ్ లో సూపర్ స్టార్ ఇమేజ్ తో రానిస్తున్న హీరోయిన్లలో ఈమె ఒకరు. డర్టీ పిక్చర్ తో యావత్ ఇండియాని షేక్ చేసింది విద్యాబాలన్. నటిగా తానేంటో నిరూపించుకొని ఉత్తమ నటిగా జాతీయ అవార్డుని అందుకుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న విద్యాబాలన్ ఇప్పుడు రోహిత్ శర్మ విషయంలో వివాదాల్లో ఇరుక్కుంది.