Yashmi – Prerana: బుల్లితెర నటులు యష్మీ గౌడ, ప్రేరణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వీరిద్దరూ బిగ్ బాస్ 8 లో కంటెస్టెంట్స్ గా పాపులర్ అయ్యారు. వీరిద్దరూ అప్పటినుంచి మంచి ఫ్రెండ్స్ గా, ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు. ఆహాలో ప్రసారమయ్యే కాకమ్మ కథలు సీజన్ 2 లోలేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు.ఇందులోభాగంగా వీరిద్దరూ ఆషోలో పాల్గొని ఒకరితో ఒకరుగొడవపడి తిట్టుకున్నారు. ఆ వివరాలు చూద్దాం..
కాకమ్మ కథలు సీజన్ 2..గెస్ట్ గా ఇద్దరు ఫ్రెండ్స్ ..
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో కాకమ్మ కథలు సీజన్ 2 ప్రారంభమై ఇప్పటికి మూడు ఎపిసోడ్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు నాలుగో ఎపిసోడ్ లో సి బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ గా పాపులర్ అయిన ప్రేరణ కుంభం, యష్మి గౌడ,అతిధులుగా రానున్నారు. ఈ షోకు తేజస్విని మదివాడ యాంకర్ గా వ్యవహరిస్తుంది. తాజాగా రిలీజ్ చేసిన ఎపిసోడ్ 4 ప్రోమో లో ఒకరిపై ఒకరు పోటీపడి మాటలు యుద్ధం చేస్తూ పంచ్ లు వేసుకున్నారు. ప్రోమో స్టార్టింగ్ లో తేజస్వి గెస్ట్ ల గురించి చెబుతూ..అబ్బాయిలందరూ అంటారు క్రష్మీ.. ఆవిడే మన యష్మి, ఇండియా లో ఉన్న బ్రాండ్లన్నిటినీ కాపీ చేస్తుంది చైన అసలు కాపీ చేయలేని ఒక బ్రాండ్ ఉంది తనే ప్రేరణ. అంటూ ఇద్దరినీ ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఈ షో కి ప్రేరణ నైటీతో రావడంతో, నీకు నైటీలో షో కి ఎవరు రమ్మన్నారు అని తేజస్వి అడుగుతుంది. కంఫర్టబుల్ గా ఉంటుంది అని ఇలా వచ్చాను. ఇలా మాట్లాడితే ఇంట్లో ఉండి మాట్లాడుతున్నట్టు ఉంటుంది అని ప్రేరణ అంటుంది. వెళ్లి డ్రెస్ మార్చుకొని రా అని, చెప్పడంతో అక్కడి నుంచి ప్రేరణ డ్రెస్ మార్చుకోవడానికి వెళుతుంది.. కొత్త డ్రెస్ అనగానే వెళ్ళింది అని యష్మి అంటుంది.
నువ్వు కంజూస్.. నీకు బ్రెయిన్ లేదు..
బ్యూటీ ఎక్కువ బ్రెయిన్ తక్కువ అని ఎవరిని చూస్తే అనిపిస్తుంది అని ప్రేరణ ను అడగ్గానే యష్మి అని చెప్తుంది. నీలాంబరి ఇక్కడ, నువ్వు వెన్నెల్లో కూర్చొని బిర్యానీ చికెన్ ముక్కలు తింటావేమో ఇంకా నేను చంద్రుడి పైన కూర్చొని పన్నీర్ తింటా, అని అంటుంది ప్రేరణ. దీని పన్నీర్ తగలెయ్య అంటూ కౌంటర్ ఇస్తుంది తేజు. ఇక మీరు ఒక ఫిలిం లో విలన్ గా చేస్తే మీకు భర్త క్యారెక్టర్ లో ఎవరు రావాలని కోరుకుంటున్నారు అని తేజు యష్మి గౌడ్ అని అడగ్గా.. నిఖిల్ నా భర్తగా రావాలి అని, ఏమని తిడతారు అంటే కన్నడ భాషలో నా కొడకా అంటూ నిఖిల్ కు వార్నింగ్ ఇస్తానని డైలాగ్ చెప్పింది యాష్మి. ఇలా ఒకరికొకరు నీకు బ్రెయిన్ లేదు నువ్వు కన్జ్యూస్ అంటూ పంచ్ లు వేసుకున్నారు.
ఇద్దరి లైఫ్ లో కష్టాలు ..
ఒక మూమెంట్లో హార్ట్ బ్రేక్ అని కాదు స్లీప్ లెస్నైట్లు చాలానే ఉన్నాయి. పేరెంట్స్ కష్టపడతారు దేనికి వాళ్ల పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వడానికి, నేను పుట్టిన తర్వాత మా నాన్నకి జాబ్ కూడా లేదు. అని ప్రేరణ తెలిపింది. యష్మీ నేను కూడా ఎంతో బాధపడ్డాను అని అంటుంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తన తండ్రి తనపై చేయి చేసుకున్నాడని చెబుతూ ఎమోషనల్ అవుతుంది. ఈ వీడియో ప్రోమో చూసిన వారంతా ఫుల్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తున్నాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మే 17న ఫుల్ ఎపిసోడ్ ఆహాల ప్రసారం కానుంది.
ఇక యష్మీ గౌడ, ప్రేరణ ఇద్దరు కృష్ణా ముకుందా మురారి అనే మా టీవీ సీరియల్ లో కలిసిన నటించారు. ఆ సీరియల్ లో ప్రేరణ హీరోయిన్ గా నటించగా యష్మి గౌడ విలన్ పాత్రలో నటించి మెప్పించారు. 2021 నుండి 2024 వరకు ఈ సీరియల్ ప్రసారం చేయబడింది. ఈ సీరియల్ తర్వాత వారిద్దరూ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పాపులర్ అయ్యారు.