BigTV English

Devil Movie : డెవిల్ మూవీకి భారీ హైప్.. అంచనాలు అందుకుంటుందా?

Devil Movie : డెవిల్ మూవీకి భారీ హైప్.. అంచనాలు  అందుకుంటుందా?
Devil Movie

Devil Movie : 2023 ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు టాలీవుడ్ కి చాలా కలిసి వచ్చింది. ఈ సంవత్సరం భారీ ఎక్స్పెక్టేషన్స్ మధ్య వచ్చిన కొన్ని చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టగా .. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చినవి వండర్స్ సృష్టించాయి. డిసెంబర్ నెల సినిమాల సందడితో థియేటర్లు కళకళలాడాయి. మరో పక్క బాక్స్ ఆఫీస్ కూడా కాసుల వర్షం కురిపించింది. మరొక మూడు రోజుల్లో తిరిగి కొత్త సినిమాలు ప్రేక్షకులను పలకరించడానికి థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. వాటిలో కళ్యాణ్ రామ్ నటిస్తున్న డెవిల్ మూవీ ఒకటి. అభిషేక్ నామా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రేక్షకులని బ్రిటీష్ కాలానికి తీసుకు వెళ్లడానికి సిద్ధంగా ఉంది.


ఈ మూవీ 1940ల కాలంలోకి భారత్ లో జరిగే సన్నివేశాలు నేపథ్యంలో సాగుతుంది. డిసెంబర్ నెలలో వచ్చిన యానిమల్, హాయ్ నాన్న చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి.ఇక రీసెంట్ గా వచ్చిన సలార్ మంచి పాజిటివ్ టాక్ తో బ్లాక్ బస్టర్‌గా దూసుకుపోతోంది. ఇక ఈ సంవత్సరానికి మంచి ఎండింగ్ ఇవ్వడం కోసం కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీతో వచ్చేస్తున్నాడు.

గత ఏడాది సోషియో ఫాంటసీ మూవీ బింబిసారతో అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్న కళ్యాణ్ రామ్.. అమిగోస్ అనే వెరైటీ కాన్సెప్ట్ మూవీతో ఈ ఏడాది భారీ అంచనాల మధ్య వచ్చాడు కానీ అనుకున్నంత సక్సెస్ సాధించ లేకపోయాడు. ఇప్పటికే డెవిల్ మూవీ నుంచి వచ్చిన పాటలు, టీజర్, ట్రైలర్‌ అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్నాయి. కళ్యాణ్ రామ్ డెవిల్ ట్రైలర్ కు ఇప్పటికే 12 మిలియన్లకు పైగా వ్యూస్‌ వచ్చాయి.


ఈ మూవీలో బ్రిటీష్ కాలం నాటి గూఢచారిగా.. ఒక సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ వినూత్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకులకు థ్రిల్ ఇవ్వబోతోన్నాడు. ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ పనులు కూడా పూర్తి కావడంతో..సెన్సార్ బోర్డు చిత్రానికి యు/ఎ సర్టిఫికేట్‌ను ఇచ్చింది. ఈ మూవీ 2 గంటల 26 నిమిషాలు ఉంది. ఇక సెట్స్ దగ్గర నుంచి కాస్ట్యూమ్స్ వరకు డెవిల్ అదరగొట్టే విధంగా ఉంటుంది అని టాక్. అంచనాలకు తగినట్టుగా ఈ చిత్రం కూడా హిట్ గా నిలిస్తే 2023 టాలీవుడ్ కు మంచి ముగింపు వచ్చినట్టు అవుతుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×