BigTV English

Samantha: అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌పై హింట్ ఇచ్చిన సమంత.. చాలాకాలం తర్వాత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..

Samantha: అప్‌కమింగ్ ప్రాజెక్ట్‌పై హింట్ ఇచ్చిన సమంత.. చాలాకాలం తర్వాత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్..

Samantha: సీనియర్ హీరోయిన్స్ చాలామంది ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంటున్నారు. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు దాటిపోయినా.. ఇప్పటికీ స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్న వారు కూడా ఉన్నారు. సమంతకు కూడా అలాంటి ఛాన్స్ ఉన్నా.. తను మాత్రం సినిమాలకు ఎందుకో దూరంగా ఉంటోంది. ప్రస్తుతం తను స్పోర్ట్స్, ఫిట్‌నెస్ అంటూ ఇతర విభాగాల్లో బిజీ అయిపోయింది. పైగా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి వెబ్ సిరీస్ అనే మార్గాన్ని ఎంచుకుంది. ఇక చాలాకాలం తర్వాత మళ్లీ తను వెండితెరపై మెరవబోతుందని చెప్పకనే చెప్పింది సమంత. ఇది చూసి చాలాకాలం తర్వాత గుడ్ న్యూస్ చెప్పిందంటూ ఫ్యాన్స్ అంతా చాలా హ్యాపీగా ఫీలవుతున్నారు.


ఫ్యాన్స్ హ్యాపీ

సమంతకు తెలుగులో కొందరు డైరెక్టర్లంటే ప్రత్యేకమైన ఇష్టం ఉంది. అందులో నందిని రెడ్డి కూడా ఒకరు. ఇప్పటికే నందిని రెడ్డి, సమంత కాంబినేషన్‌లో రెండు సినిమాలు తెరకెక్కాయి. సినిమాలు మాత్రమే కాదు.. సమంత హోస్ట్‌గా వ్యవహరించిన ఒక షోను కూడా నందినినే డైరెక్ట్ చేసింది. డైరెక్టర్‌గా మాత్రమే కాకుండా సమంతకు మంచి ఫ్రెండ్‌గా కూడా దగ్గరయ్యింది నందిని రెడ్డి. అందుకే సందర్భ వచ్చిన ప్రతీసారి ఒకరిపై ఒకరికి ఉన్న ఇష్టాన్ని బయటపెట్టకుండా ఉండలేరు వీరిద్దరూ. ఇక మార్చి 4న నందిని పుట్టినరోజు కావడంతో సమంత స్పెషల్‌గా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో బర్త్ డే విషెస్ చెప్పింది. అందులోనూ ఫ్యాన్స్‌ను హ్యాపీ చేసే న్యూస్ కూడా ఉంది.


రీస్టార్ట్ చేద్దామా.?

‘హ్యాపీ బర్త్ డే నందిని రెడ్డి. నా కళ్లన్నీ నీపైనే ఉన్నాయి. ఈ ఏడాది చాలా గొప్పగా ఉండబోతోంది. కలిసి ముందుకెళ్దాం’ అంటూ నందిని రెడ్డిని ట్యాగ్ చేసి విషెస్ తెలిపింది సమంత (Samantha). ఇదే విషెస్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రీషేర్ చేసింది నందిని రెడ్డి. ‘నీతో కలిసి మళ్లీ మ్యాడ్‌నెస్‌ను రీస్టార్ట్ చేయడానికి ఎదురుచూస్తున్నాను. పద మొదలెడదాం’ అని చెప్పుకొచ్చింది. దీంతో వీరిద్దరూ కలిసి మళ్లీ ఏదో ప్రాజెక్ట్ చేయనున్నారని హింట్ ఇస్తున్నట్టుగా ఫ్యాన్స్ అర్థం చేసుకున్నారు. నందిని రెడ్డి (Nandini Reddy) డైరెక్షన్‌లో సమంత చాలా బాగుంటుందని వారు ఫీలవుతున్నారు. సమంత మళ్లీ వెండితెరపై కనిపించాలంటే నందిని డైరెక్షన్ బెటర్ అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ఆ సినిమాలు ఎందుకు చేశానా అని ఫీల్ అవుతున్నా.. సమంత కామెంట్స్

అదే లాస్ట్

సమంత చివరిగా ‘ఖుషి’ అనే సినిమాలో వెండితెరపై మెరిసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో తను విజయ్ దేవరకొండతో జోడీకట్టింది. విడాకుల తర్వాత సమంత నటించిన మొదటి రొమాంటిక్ సినిమా కావడంతో ఇందులో విజయ్‌తో కలిసి సామ్ చేసిన రొమాన్స్ చాలామందికి నచ్చలేదు. అందుకే ప్రేక్షకులు తనపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. దాన్ని సీరియస్‌గా తీసుకుందో లేదో తెలియదు కానీ సమంత మాత్రం అప్పటినుండి సినిమాలు సైన్ చేయడం ఆపేసింది. మొత్తంగా వెబ్ సిరీస్‌లపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే యాక్షన్ వెబ్ సిరీస్‌లో నటిస్తూ బిజీగా ఉంది సమంత.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×