Kamal Haasan: తమిళ స్టార్ హీరో, విలక్షణ నటుడు కమలహాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈయన నటించిన సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవ్వడంతో తెలుగులో మంచి మార్కెట్ ఉంది. అందుకే కమల్ హాసన్ నటించిన సినిమాలకు తెలుగులో కూడా డిమాండ్ ఉంది. దశావతారం లాంటి సూపర్ హిట్ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించిన కమల్ గురించి చాలా మందికి కొన్ని రహస్యాలు తెలియవు. ముఖ్యంగా ఆయన రెండు పెళ్లిళ్లు చేసుకోవడం పై గతంలో సోషల్ మీడియాలో చర్చలు జరిగాయి. తాజాగా కమల్ రెండు పెళ్లిళ్లు చేసుకోవడం వెనుక కారణం ఇదే అంటూ ఓ న్యూస్ ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది. అదేంటో ఒకసారి తెలుసుకుందాం..
కమల్ హాసన్ రెండు పెళ్లిళ్లు..
తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ రెండు పెళ్లిళ్లు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. 1978లో, 24 సంవత్సరాల వయసులో హాసన్ నృత్యకారిణి వాణి గణపతిని వివాహం చేసుకుంది . ఆమె 1975లో మెల్నాట్టు మరుమగల్ చిత్రంలో కమల్ తో కలిసి నటించింది . వివాహం తర్వాత, వాణి అనేక సినిమాలకు హాసన్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసింది. పదేళ్ల తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నటి సారిక 1988లో కలిసి జీవించడం ప్రారంభించారు.. వారి మొదటి బిడ్డ శృతి హాసన్ పుట్టిన తర్వాత వివాహం చేసుకున్నారు. ఆమె ఒక గాయని, టాలీవుడ్ – కోలీవుడ్ నటి. వారి చిన్న కుమార్తె అక్షర, అసిస్టెంట్ డైరెక్టర్, నటి. సారిక వారి వివాహం తర్వాత వెంటనే నటించడం మానేసింది. వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారని తెలుస్తుంది.
Also Read : పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ పేరుకు అర్థం ఏంటో తెలుసా..?
బ్రాహ్మీణ్ కుటుంబంలో పుట్టిన రెండు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నారు..?
తమిళ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించిన థగ్ లైఫ్ గురించి ఇటీవల మీడియా ఇంటరాక్షన్‌లో, కమల్ హాసన్, త్రిష ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. అందులో భాగంగా ఓ జర్నలిస్ట్ త్రిషను పెళ్లి గురించి అడిగినప్పుడ.., ఆమె పెళ్లి చేసుకోలేదని? ఎప్పుడు చేసుకుంటారు అని అడిగారు. త్రిష సమాధానం చెప్పింది. ఇక కమల్ గతంలో తాను ఇంటర్వ్యూలో ఎదుర్కొన్న ప్రశ్నల గురించి పంచుకున్నారు. కమల్ మాట్లాడుతూ.. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నేను రెండు పెళ్లిళ్లు చేసుకోవడం పైస్పందించారు. అప్పుడు కమల్ ఆ రిపోర్టర్ కు దిమ్మ దిరిగే సమాధానం చెప్పినట్లు ఈ మీట్ బయట పెట్టారు.. బ్రహ్మీణ కుటుంబం లో పుట్టిన మీరు ఇలా రెండు పెళ్లిళ్లు చేసుకోవడం న్యాయమేన అని అడిగారు. దానికి కమల్ ఫన్నీగా నేను రాముడిని కాదు ముఖ్యంగా ఆయనను అస్సలు ఫాలో అవ్వట్లేదు బహుశా నేను ఆయన తండ్రిని ఫాలో అవుతున్నాను. దశరథ మహారాజు లాగా రెండు పెళ్లిళ్లు చేసుకున్నానని సమాధానం చెప్పిన విషయాన్ని గుర్తు చేశాడు.. ప్రస్తుతం ఈ మీట్ వీడియో వైరల్ అవ్వడంతో రెండు పెళ్లిళ్ల వ్యవహారం మరోసారి హైలెట్ అవుతుంది.. ఒక వర్గం వాళ్లకి కమలహాసన్ చెప్పిన విషయం అర్థమైంది కానీ, మరోక వర్గం వాళ్లకి కమల్ హాసన్ ఏమడిగితే ఏం సమాధానం చెప్పాడు అని మరికొందరు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరి దీనిపై కమల్ హాసన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.. ఫన్నీగా సమాధానం చెప్పి తప్పించుకున్నాడు అని నెటిజన్లు అంటున్నారు.. నిజానికి ఆయన రెండు పెళ్లిళ్లు ఎందుకు చేసుకున్నాడో ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కని ప్రశ్నలాగే మిగిలిపోయింది. ఈ వ్యవహారం పై త్వరలోనే క్లారిటీ ఇస్తారేమో చూడాలి.. ప్రస్తుతం కమలహాసన్ వయసుతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు..