BigTV English

Animal Sacrifice Ban Bakrid: బక్రీద్ పండుగ వేళ జంతు బలిపై నిషేధం.. ముస్లిం దేశంలో నిరసనలు

Animal Sacrifice Ban Bakrid: బక్రీద్ పండుగ వేళ జంతు బలిపై నిషేధం.. ముస్లిం దేశంలో నిరసనలు

Animal Sacrifice Ban Bakrid| బక్రీద్ పండుగ సందర్భంగా చాలా మంది ముస్లింలు జంతు బలి ఇస్తుంటారు. ఇది సాధారణంగా ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియం. అయితే తాజాగా ఒక ముస్లిం దేశంలో అక్కడి రాజు జంతు వధపై, బలి ఇవ్వడంపై నిషేధం విధించారు. దీంతో అక్కడి ప్రజలు రాజుగారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.


ఇస్లాం మతాన్ని పాటించే ముస్లింలకు రెండే ప్రధాన పండుగలు. ఒకటి ఈద్ అల్ ఫితర్ అంటే రంజాన్ పండుగ. రెండవది ఈద్ అల్-అద్హా.. దీనినే బక్రీద్ పండు అని కూడా పిలుస్తారు. బక్రీద్ పండుగ అంటే ఇది ‘బలిదాన పండుగ’, ఇది పండుగ త్యాగానికి ప్రతీక. ముస్లింలకు అత్యంత ముఖ్యమైనది. ఈ పండుగ ప్రవక్త ఇబ్రహీం దేవుని ఆజ్ఞ ప్రకారం తన కుమారుడిని బలి ఇవ్వడానికి సిద్ధపడిన నిస్వార్థ భక్తిని సూచిస్తుంది. ప్రవక్త ఇబ్రహీంకు పలుమార్లు తన కొడుకుని బలి ఇవ్వాలని ఆకాశం నుంచి, దైవదూతల నుంచి ఆజ్ఞలు రావడంతో ఆయన తన కొడుకుని గొంతుపై కత్తి పెట్టగా .. ఆకాశం నుంచి ఆయనకు సందేశం వినిపించింది. ఇదంతా ఆయన భక్తికి పరీక్ష అని.. ఆ తరువాత ఆ సమయంలో ఆయన కొడుకు బదులు ఒక మేకను బలి ఇవ్వాలని ఆదేశం వచ్చింది. ఈ గొప్ప విశ్వాసానికి గుర్తుగా, ముస్లింలు సాధారణంగా మేక, గొర్రె, ఒంటె లేదా పాడిపశువులను బలిదానం చేసి, దాని మాంసాన్ని కుటుంబం, స్నేహితులు, పేదవారితో పంచుకుంటారు.

కానీ ఈ సంవత్సరం, ముస్లిం దేశమైన మొరాకోలో ఈ సంప్రదాయంపై నిషేధం విధించారు. దేశ రాజు, మొహమ్మద్ VI, ఆర్థిక సమస్యలు, కరువు పరిస్థితులు, పశువుల అనారోగ్యంతో చనిపోవడం వల్ల వాటి సంతతి తగ్గిపోవడం గురించి ఆందోళనల కారణంగా మేకలు, గొర్రెల బలిపై నిషేధించారు. రాజు దేశం తరపున ఒక బలిని అర్పిస్తానని చెప్పినప్పటికీ, ఈ నిర్ణయం చాలా మంది మొరాకో వాసులకు నచ్చలేదు. వారు ఈ నిషేధాన్ని శతాబ్దాల నాటి మత సంప్రదాయంపై దాడిగా భావిస్తున్నారు. దీంతో, పలు నగరాల్లో నిరసనలు చెలరేగాయి. అధికారులు ఇళ్లలోకి వెళ్లి మేకలను జప్తు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ప్రజల ఆగ్రహం మరింత పెంచింది. ఈ నిషేధం వల్ల రాజు.. ఈద్ అల్-అద్హా ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను అగౌరవపరిచారని, తమ మత హక్కులను కాలరాస్తున్నారని చాలా మంది అనుకుంటున్నారు.


మొరాకోలోని మత నాయకులు ఈ నిషేధాన్ని రద్దు చేయాలని, ప్రజలతో సంప్రదింపులు జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈద్ అల్-అద్హా కేవలం సంప్రదాయం మాత్రమే కాదు, ఇది కోట్లాది ముస్లింలకు పవిత్రమైన ఆచారమని వారు చెబుతున్నారు. ఈ బలిదానం ఆధ్యాత్మిక భక్తి, సామాజిక ఐక్యతను సూచిస్తుందని వారు నొక్కి చెబుతున్నారు.

ఇదే సమయంలో, భారతదేశంలోని ముంబైలో కూడా ఈద్ అల్-అద్హా సందర్భంగా జంతు బలిపై వివాదాలు తలెత్తాయి. ముంబైలోని కొన్ని హౌసింగ్ సొసైటీలలో బలి ఇవ్వడానికి అనుమతులపై సమస్యలు ఉన్నాయి. బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) నిబంధనలు, స్థానికుల అభ్యంతరాల కారణంగా ఈ సమస్యలు తలెత్తాయి. ఉదాహరణకు, గోరెగావ్ ఈస్ట్‌లోని గోకుల్‌ధామ్‌లోని ఒక సొసైటీకి ఇచ్చిన అనుమతిని బిఎంసి రద్దు చేసింది. ఎందుకంటే 1 కిలోమీటరు దూరంలో మరో బలి స్థలం ఉందని. అలాగే, ఘాట్కోపర్ వెస్ట్‌లోని మైత్రీ సొసైటీ వాసులు గతంలో అనుమతి పొందిన స్థలంలో బలి ఇవ్వడానికి బిఎంసి నిరాకరించడంతో బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు వారిని మళ్లీ దరఖాస్తు చేయమని, బిఎంసిని ఆ రోజే నిర్ణయం తీసుకోమని ఆదేశించింది.

Also Read: బక్రీద్ వేళ జంతు వధ వద్దు.. ముస్లింలకు మహారాష్ట్ర మంత్రి హెచ్చరిక

బిఎంసి నిబంధనల ప్రకారం.. నిర్దేశిత మార్కెట్లు, సమాజ స్థలాలు, ప్రైవేట్ ఆస్తులు లేదా హౌసింగ్ సొసైటీలలో మాత్రమే బలి ఇవ్వడానికి అనుమతి ఉంటుంది. అయితే, 1 కిలోమీటరు దూరంలో మత స్థలం లేదా బలి స్థలం ఉంటే అనుమతి ఇవ్వరు. ఈ నిషేధాలు, అనుమతుల రద్దు మత స్వేచ్ఛ పురాతన సంప్రదాయాలపై చర్చను రేకెత్తించాయి.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×