Kangana Ranaut: బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ తనకు అనిపించి చేస్తుందని, మాట్లాడుతుందని అందరికీ తెలిసిన విషయమే. అలా మాట్లాడడం వల్లే పలుమార్లు కాంట్రవర్సీల్లో కూడా చిక్కుకుంది ఈ భామ. అయినా కూడా తన మనస్తత్వం ఏమీ మారలేదు. ఇప్పటికీ తనకు నచ్చని విషయం ఏదైనా జరిగినప్పుడు దాని గురించి సోషల్ మీడియాలో లేదా స్టేజ్‌పైనే ఓపెన్‌గా చెప్పేస్తుంది. దానివల్లే తను లీగల్ సమస్యల్లో కూడా చిక్కుకుంది. సీనియర్ రైటర్ జావేద్ అఖ్తర్‌కు, కంగనాకు మధ్య కొన్నేళ్లుగా ఈ లీగల్ పోరు నడుస్తోంది. ఫైనల్‌గా ఇన్నేళ్ల తర్వాత ఈ సమస్యలకు చెక్ పడింది. ఈ విషయాన్ని కంగనా స్వయంగా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మనస్పర్థలు తొలగిపోయాయి
2020లో కంగనా రనౌత్, జావేద్ అఖ్తర్ (Javed Akhtar) మధ్య లీగల్ యుద్ధం మొదలయ్యింది. ముందుగా కంగనా రనౌత్ ఒక టీవీ షోలో తనకు పరువు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేసిందంటూ తనపై కేసు నమోదు చేశాడు జావేద్ అఖ్తర్. కంగనా మాత్రం దీనిపై ఎప్పుడూ పెద్దగా స్పందించలేదు. తనకు అనిపించే చెప్పాను అన్నట్టుగా మాట్లాడేది. దీంతో అప్పటినుండి కంగనాపై ఈ కేసు నడుస్తూనే ఉంది. కంగనాపై మాత్రమే కాదు.. జావేద్ అఖ్తర్‌కు తనపై ఎవరైనా ఇన్‌డైరెక్ట్‌గా కామెంట్స్ చేస్తున్నారని అనిపించినా వారితో లీగల్‌గా ఫైట్ చేయడానికి సిద్ధమవుతారు. అలా చాలామంది యంగ్ ఆర్టిస్టులకు ఆయన శత్రువులాగా మారిపోయారు. కానీ తాజాగా కంగనాతో మాత్రం అన్ని మనస్పర్థలు తొలగిపోయి మళ్లీ కలిసిపోయారని తెలుస్తోంది.
మర్యాదగా మాట్లాడారు
కంగనా రనౌత్ (Kangana Ranaut) షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీతో జావేద్ అఖ్తర్‌తో ఉన్న లీగల్ వివాదంపై క్లారిటీ ఇచ్చేసింది. ‘ఈరోజు నేను, జావేద్ గారు కలిసి మాట్లాడుకొని మా లీగల్ మ్యాటర్ (పరువునష్టం దావా)ను పరిష్కరించుకున్నాం. ఈ మాట్లాడే క్రమంలో జావేద్ గారు చాలా మర్యాదగా ప్రవర్తించారు, బాగా మాట్లాడారు. నేను దర్శకత్వం వహించే తర్వాతి సినిమాలో ఆయన పాటలు రాయడానికి కూడా అంగీకరించారు’ అని చెప్పుకొచ్చింది కంగనా రనౌత్. దీంతో కంగనా షేర్ చేసిన ఈ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మామూలుగా తనకు ఎవరితో అయినా గొడవ జరిగితే అది అంత సులువుగా పరిష్కారం కాదు.. అలాంటి జావేద్ అఖ్తర్‌తో మాత్రం ఈ మ్యాటర్‌ను సింపుల్‌గా తేల్చేసింది అంటూ ప్రేక్షకులు చర్చించుకోవడం మొదలుపెట్టారు.
Also Read: తల్లి కాబోతున్న కియారా.. గుడ్ న్యూస్ అభిమానులతో పంచుకున్న జంట.!
పరిష్కరించుకోని సమస్యలు
జావేద్ అఖ్తర్ లాగానే కంగనా రనౌత్‌కు కూడా ఇండస్ట్రీలో చాలామందితో గొడవలు ఉన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోలతో సైతం కంగనాకు సమస్యలు ఉన్నాయి. కానీ ఆ సమస్యలను పరిష్కరించుకోవాలని తను ఎప్పుడూ అనుకోలేదు. అలాంటిది జావేద్ అఖ్తర్ తనపై పరువునష్టం కేసు పెట్టిన తర్వాత కూడా తానే స్వయంగా వెళ్లి ఈ సమస్యను పరిష్కరించుకుంది అంటే ఫ్యాన్స్ ఆశ్చర్యపోక తప్పడం లేదు. అంతే కాకుండా తన తర్వాతి సినిమాలో జావేద్‌తో పాటలు రాయించడానికి కూడా అప్పుడే ఒప్పందం కుదుర్చుకుంది కంగనా.
I just love her! 🫶✨
She is my inspiration for real.. I just want her to get settled now. She already doing wonders in a career she is an brilliant actor, outstanding director, great producer, business women, entrepreneur.@KanganaTeam #KanganaRanaut pic.twitter.com/XKwuCMANLq
— Akansha (@AakanshaGill) February 28, 2025