Foods For Diabetic Patients: ఈ రోజుల్లో మధుమేహం సాధారణ సమస్య. రక్తంలో చక్కెర స్థాయి అసాధారణంగా పెరగడం వల్ల డయాబెటిస్ బారిన పడతారు. ఇది గుండె, మూత్రపిండాలు, కళ్ళు, నాడీ వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. ఎవరికైనా డయాబెటిస్ వస్తే , దానిని పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదు. దీనిని నియంత్రించడం మాత్రమే సాధ్యం అవుతుంది. ఇలాంటి పరిస్థితిలో కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం అలవాటు చేసుకోవాలి.
డయాబెటిస్ రోగులు తీసుకునే సమతుల్య ఆహారం రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. అందుకే డయాబెటిస్ పేషెంట్లు కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
కాకరకాయ:
కాకరకాయ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. ఇది డయాబెటిస్ రోగులకు చాలా మేలు చేస్తుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడే బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది. కాకరకాయలో ఇన్సులిన్ లాగా పనిచేసే , రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యంగా ఉంచే పోషకాలు ఉంటాయి. మీరు దీన్ని పచ్చిగా, రసం రూపంలో లేదా ఉడికించి కూడా తినవచ్చు.
మెంతులు :
మెంతులు కూడా మధుమేహాన్ని నియంత్రించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. మెంతుల్లో కరిగే ఫైబర్ , యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. మెంతులు తినడం వల్ల ఇన్సులిన్‌కు శరీరం యొక్క ప్రతిస్పందన మెరుగుపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. అంతే కాకుండా మీరు నానబెట్టిన మెంతులు తినవచ్చు. లేదా పొడిలా చేసుకుని కూడా ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు.
త్రిఫల:
త్రిఫల అనేది ఆయుర్వేదంలో ఒక ప్రధాన మూలికా మిశ్రమం. ఇది ఉసిరి, బహేద, హరిద నుండి తయారవుతుంది. ఇది శరీర జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో, శరీరం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడంలో ఉపయోగపడుతుంది. అంతే కాకుండా రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. త్రిఫలను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా, డయాబెటిస్ సమస్యను కూడా నియంత్రించవచ్చు.
పసుపు:
పసుపులో కర్కుమిన్ అనే మూలకం ఉంటుంది. ఇది వాపును తగ్గించడంలో రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. పసుపును ప్రతిరోజూ పాలు లేదా నీటితో కలిపి కూడా తినవచ్చు. ఇది శరీరంలో ఇన్సులిన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. అంతే కాకుండా రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. పసుపు ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల అద్భుత ప్రయోజనాలు ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది. షుగర్ లెవర్స్ తగ్గించడంలో కూడా చాలా ప్రభావ వంతంగా పని చేస్తుంది.
Also Read: గుమ్మడి విత్తనాలతో.. మతిపోయే లాభాలు !
యోగా, ప్రాణాయామం:
ఆయుర్వేదంలో డయాబెటిస్ తగ్గించడానికి ఆహారం మాత్రమే కాదు, జీవనశైలి కూడా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. క్రమం తప్పకుండా యోగా , ప్రాణాయామం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించబడతాయి. ముఖ్యంగా, తడసాన, భుజంగాసనం వంటి ఆసనాలు, అనులోమ-విలోమ, కపాలభాతి వంటి ప్రాణాయామాలు శరీరంలో శక్తిని ప్రసరింపజేసి రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. డయాబెటిస్ ఉన్న వారు తప్పకుండా వ్యాయామం చేయాలి.