BCCI: స్వదేశంలో న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో వైట్ వాష్, అనంతరం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టెస్టుల సిరీస్ లో 3 – 1 తో ఓటమి.. ఇలా వరుసగా టెస్టుల్లో ఓడిపోతున్నా, ప్లేయర్స్ పరుగులు చేయడంలో విఫలమౌతున్నా.. టీమిండియా క్రికెటర్లలో మాత్రం ఎటువంటి నిరుత్సాహం కనిపించడం లేదు. పోతే పోయిందిలే.. అన్నట్టుగా వారి వ్యవహార శైలి ఉంది. ఈ క్రమంలోనే భారత క్రికెటర్లకు షాక్ ఇచ్చేందుకు నిర్ణయించింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ).
Also Read: Gautam Gambhir: ప్రమాదంలో గంభీర్ పదవి…వాళ్ల చేతిలోనే అతని ఫూచర్?
మరికొద్ది రోజులలో ప్రారంభం కాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కి ముందు బీసీసీఐ పెద్ద మార్పు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. సాధారణంగా భారత ఆటగాళ్లకు ఒక్కో మ్యాచ్ కి నిర్ణీత మొత్తం చెల్లిస్తారు. కానీ ఇకనుండి దీనిపై సమీక్షించేందుకు బీసీసీఐ ముందుకు వచ్చింది. అంటే రానున్న రోజులలో ప్లేయర్స్ ఆట తీరుకు అనుగుణంగా వేతనాలు అందజేయడంపై చర్చించారు. ఇకనుండి ప్లేయర్ పర్ఫామెన్స్ బాగుంటేనే జీతం వస్తుంది.
లేదంటే జీతం కట్ అవుతుంది. ప్లేయర్స్ ని బాధ్యతాయుతమైన స్థానంలో ఉంచేందుకు ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవాలని బీసీసీ చర్చించిందని సమాచారం. ఇకనుండి ఆటగాళ్లు వారి పనితీరు అంచనాలను అందుకోలేకపోతే వేరియబుల్ పే కోతలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల ఆటగాళ్ల బాధ్యత పెరుగుతుందని బిసిసిఐ భావిస్తోంది. వరుసగా వైఫల్యాలు చెందుతున్న ఆటగాళ్ల రెమ్యూనరేషన్ తగ్గింపుతో పాటు.. వారి పెర్ఫార్మెన్స్ బాలేకుంటే జట్టు నుండి కూడా తొలగించవచ్చు.
ఇది మాత్రమే కాకుండా ఫారిన్ టోర్నీలకు క్రికెటర్లతో పాటు వారి ఫ్యామిలీ మెంబర్స్ వెళ్లడంపై బిసిసిఐ పలు ఆంక్షలు విధించినట్లుగా పలు కథనాలు వెలువడుతున్నాయి. ఫారిన్ టూర్లలో క్రికెటర్ల ఫ్యామిలీ మెంబర్స్ షికార్లు చేయడంపై బీసీసీఐ ఫైర్ అయినట్లు సమాచారం. 45 రోజుల కంటే ఎక్కువ రోజులపాటు సాగే క్రికెట్ టోర్నమెంట్లలో క్రికెటర్లు వారి కుటుంబ సభ్యులు, భార్యా, పిల్లలతో కేవలం 14 రోజులు మాత్రమే ఉండాలని బిసిసిఐ నిర్ణయించింది.
Also Read: Tilak Varma – Vijay Devarkonda: టాలీవుడ్ హీరోతో తిలక్ వర్మ.. విదేశాల్లో చిల్ !
టోర్నీ మొత్తం క్రికెటర్లతో కలిసి వారి ఫ్యామిలీ మెంబర్స్ ఉండడానికి వీలులేదని తాజాగా జరిగిన రివ్యూ మీటింగ్ లో బీసీసీఐ కండిషన్స్ పెట్టినట్లుగా సమాచారం. ఒకవేళ 20 రోజుల పాటు సాగే టూర్స్ అయితే.. క్రికెటర్ల ఫ్యామిలీ మెంబర్స్ కేవలం 7 నుంచి 8 రోజులు మాత్రమే ఉండాలని రూల్ పెట్టిందట. ఈ నిబంధనలను అతిక్రమిస్తే క్రికెటర్ల పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని బిసిసిఐ నిర్ణయించింది. వరుస వైఫల్యాలపై బీసీసీఐ తీవ్ర ఆగ్రహంలో ప్లేయర్స్ పై కఠిన ఆంక్షలు విధిస్తుందని సమాచారం.
🚨 PAY CUT PROPOSAL FOR CRICKETERS 🚨
✅A performance based variable pay structure has been suggested during the review meeting.
✅It aims to ensure accountability, with pay cuts possible for underperformance. @BCCI pic.twitter.com/5HsZBfatYX
— Cricket360 (@CrickTak) January 14, 2025